- బీజేపీతో పొత్తుపై ఢల్లీిలో కీలక చర్చలు
- అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు`పవన్ భేటి
- గంటన్నరపాటు సాగిన సమావేశం
- నేటి ఉదయం కొనసాగనున్న చర్చలు
- బీజేపీతో పొత్తుపై సానుకూల సంకేతాలు
ఢిల్లీ, చైతన్యరథం: త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీతో పొత్తుపై గురువారం రాత్రి ఢల్లీిలో కీలక చర్చలు జరిగాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాలతో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షా ఇంట్లో ఈ నలుగురి నాయకుల సమావేశం జరిగింది. నేడు ఉదయం కూడా ఈ చర్చలు కొనసాగునున్నాయి. నిన్న రాత్రి జరిగిన భేటిలో మూడు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అన్ని ప్రధాన విషయాలపై లోతుగా అగ్రనాయకులు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల విభజన, పోటీ చేసే స్థానాలపై కూడా చర్చ జరిగింది. జనసేన ఇప్పటికే మూడు లోక్‌సభ, 24 శాసనసభ స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకరించింది. తెదేపా 94 శాసనసభ స్థానాల్లో జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్ధులను (మొదటి పేజీ తరువాయి)
గత నెల 24వ తేదీన ప్రకటించి ఎవ్వరూ ఊహించని విధంగా తొలి అడుగు వేశారు.
సానుకూల సంకేతాలు
గురువారం రాత్రి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగి రాష్ట్రంలో తెదేపా`జనసేనలతో బీజేపీ చేతులు కలిపే దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఈ చర్చల వివరాలు తెలిసిన నాయకులు తెలిపారు. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్‌లు ఇటీవలే విడివిడిగా అమిత్‌షా, నడ్డాలతో పొత్తుపై మొదటి విడత చర్చలు జరిపారు. గతంలో ఎన్డీయేలో భాగాస్వాములుగా ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైన పాత మిత్రులను తిరిగి కూటమిలోకి ఆహ్వానిస్తూ చర్చలు జరుపు తున్నామని బీజేపీ అగ్రనాయకత్వం తెలిపింది. తెలుగుదేశం` జనసేన మధ్య పొత్తు కుదరకుండా చేయడానికి కూటమి ఏర్పాటుకు ముందు, తర్వాత వైసీపీ నాయ కత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇరు పార్టీల మధ్య విబేధాలు సృష్టించడానికి జగన్ బృందం నానాపాట్లు పడినా తెదేపా`జనసేనలు కూటమిగా ఏర్పడి ముఖ్య మంత్రి గుండెల్లో గుబులు రేకిత్తించారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటుతో బెంబేలెత్తి పోయిన జగన్ రెడ్డి.. వీరితో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని తీవ్రంగా ఆకాక్షించారు. గత నెలలో చంద్రబాబు నాయుడు అమిత్‌షాతో సమావేశమైన వెంటనే హడా విడిగా ఢల్లీి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో బీజేపీ చేయి కలపరాదంటూ తనదైన రీతిలో జగన్‌రెడ్డి మాట్లాడి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గురువారం రాత్రి అమిత్ షా, జెపి నడ్డాలతో సుదీర్ఘ చర్చలు జరపడం జగన్‌రెడ్డి బృందానికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
బీజేపీతో పొత్తుపై నేడో, రేపో ప్రకటన
ఇప్పటికే కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పొత్తుపై నేడో, రేపో ప్రకటన వస్తుందని ఇరు పార్టీల అగ్ర నాయకులు గురువారం నాడు స్పష్టం చేశారు. నిన్న తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశంలో తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై విలేఖరులు అడిగిన సమాధానాలకు స్పందించారు. ఇరు పార్టీల అగ్ర నేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు బీజేపీ నాయకత్వం పిలుపుమేరకు గురువారం నాడు చర్చల కోసం ఢల్లీి వెళ్లారని, అతి త్వరలో మూడు పార్టీల పొత్తుపై తగు నిర్ణయం వెల్లడౌతుందని అచ్చెన్నాయుడు, మనోహర్ తెలిపారు. మూడు పార్టీల పొత్తు కుదరకుండా చేయటానికి భారీ ప్రయత్నాలు జరిగాయని, దీనికి తగు సమాధానం నేడో, రేపో తెలుస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇరు పార్టీల అగ్ర నేతల ఢల్లీి పర్యటనతో సీట్ల సర్దుబాటుపై కూడా స్పష్టత వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన రెండవ విడత అభ్యర్థుల జాబితాపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ విషయం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని బీజేపీతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చాక రెండో జాబితా విడుదల అవుతుందని మనోహర్ స్పష్టం చేశారు.
గతంలో మూడు పార్టీల కూటమి
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. జనసేన బరిలో నిలవకుండా సంపూర్ణ మద్దతు నివ్వగా టీడీపీ, బీజేపి సీట్లు పంచుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్‌సభ స్థానాలైన విశాఖ, నర్సాపురం, తిరుపతి, రాజంపేటల్లో పోటీ చేసి విశాఖ, నర్సాపురంలో విజయం సాధించింది. పది అసెంబ్లీ స్థానాలు… విశాఖ నార్త్, పాడేరు, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ వెస్ట్, నర్సారావుపేట, నెల్లూరు రూరల్, మదనపల్లె, కొడుమూరులో బీజేపీ పోటీ చేసి నాలుగు చోట్ల విశాఖ నార్త్, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, కైకలూరులో గెలిచారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన ి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి తరపున డాక్టర్ కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యలరావు మంత్రులుగా పని చేశారు.