- అరకు లోక్‌సభ నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’
- నాలుగు కుటుంబాలకు పరామర్శ
- రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేత
పాడేరు, అరకు: కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ప్రాణమని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బుధవారం అరకు లోక్‌సభ నియోజకర్గంలో నలుగురు కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి, ఆర్థికసాయం అందచేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మనస్తాపానికి గురై మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుం బాలను ఓదార్చి, ధైర్యం చెప్పి, భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయా కుటుంబాలను పరామర్శించటంతో పాటు, ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున అర్థిక సాయం కూడా అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో అరకు రూరల్ మండలం, ముసరుగుడ గ్రామం లో సొన్నాయి బసు కుటుంబాన్ని పరామ ర్శించారు. బసు గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు.బసు చిత్రపటానికి నివాళులుఅర్పించి, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు.
తరువాత పాడేరు నియోజకవర్గం,మం డల కేంద్రమైన జీ మాడుగులలో కొరబు లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించా రు. లక్ష్మణరావు గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మ ణరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు భువనేశ్వరి దైర్యం చెప్పారు.
అనంతరం జీ మాడుగుల గ్రామంలోనే అనసూరి రాజారావు కుటుంబాన్ని భువనే శ్వరి పరామర్శించారు. రాజారావు గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. రాజారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. చివరగా పాడేరు మండలం, కిందంగి గ్రామంలో ఓండ్రు నాగేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నాగేశ్వర రావు గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. నాగేశ్వర రావు చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి భువనేశ్వరి ధైర్యం చెప్పారు.