- మహిళా సాధికారతకు నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు బాటలు
- ఆస్తిలో సమానహక్కు, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఎన్టీఆర్
- డ్వాక్రా సంఘాలను తెచ్చిన చంద్రబాబు
- నేడు అత్యాచారాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన జగన్
- మళ్లీ బాబు వస్తేనే మహిళలకు మంచిరోజులు
- కుప్పం మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి
కుప్పం: టీడీపీ పాలనలోనే మహిళల అభ్యున్నతికి, సాధికారతకు బాటలు పడ్డాయని టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందడుగు వేసేందుకు నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. నేడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, అఘాయిత్యాలకు అంతే లేకుండా ఉంద ని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న భువనేశ్వరి బుధవారం ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. కుప్పం నారీ మణులకు పేరు పేరునా నా నమస్కారాలు.. ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు.. వారిని వంటింటికే పరిమి తం చేసేవారన్నారు. స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సాధికారంగా సమాజంలోకి తీసు కొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారు. మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి యూనివర్శిటీని తీసుకొచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఆయనవల్లే మహిళలు నేడు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. తరువాత చంద్రబాబు హయాంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకు హైస్కూలు వీటితో పాటు కాలేజీ, డిగ్రీకాలేజీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ వల్ల యువత మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.. వారి కుటుం బాలు బాగున్నాయి. చంద్రబాబు ముందుచూపుతో మహిళలకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చారు. 1997లో బాలికాశిశు సంరక్షణ పథకం ద్వారా ఆడపిల్ల పుడితే ఆ పిల్ల పేరున రూ.5వేలు బ్యాంకు అకౌంట్లో వేసి వారి అభివృద్ధికి నాంది పలికారు. 8 నుండి 10వ తరగతి చదివే విద్యా ర్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చారు. దళిత మహిళ ప్రతిభా భారతికి ఏపీ చరిత్రలో మొదటిసారిగా శాసన సభ స్పీకర్ పదవిని ఇచ్చారు. దీపం, డ్వాక్రా రుణ మాఫీ, పసుపుకుంకుమ, అమృతహస్తం, నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, సామూహిక సీమంతాలు, తల్లికి వందనం, పెళ్లికానుక పథకాలను చంద్రబాబు అమలు చేశారని భువనేశ్వరి చెప్పారు.
మహిళలకు చంద్రన్న హామీలు..
ఇప్పుడు చంద్రబాబు మహిళా శక్తి ద్వారా 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలకు ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ సంవత్సరానికి రూ.15 వేలు, దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చంద్రబాబు మహిళలకు హామీ ఇప్పటికే ఇచ్చారని భువనేశ్వరి తెలిపారు.
దిశ చట్టంపై గొప్పలు..
జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు. చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు..కానీ నేడు జగన్ పాలనలో ఆ పరిస్థితి లేదు. గతంలో ప్రొద్దుటూరులో 6సంవత్సరాల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడితే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆర్డర్ వేస్తే..ఆ నిందితుడు ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్, పథకం ద్వారా మహిళలకు రక్షణ ఎక్కడా దొరకడం లేదు…చట్టం కాగితాలకే పరిమితమైంది. మహిళలను మాయ చేయడానికి, మహిళలకు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికే దిశ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారని భువనేశ్వరి విమర్శించారు.
అత్యాచారాల్లో అగ్రస్థానం..
జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మహిళలపై అత్యాచారాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో జగన్ నిలబెట్టాడు. ఓ మహిళకు గంజాయి అలవాటు చేసి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు…ఈ విషయాలపై జగన్ సిగ్గుపడాలి. ఏపీలో 2019 నుండి 2021వరకు 30196 మంది మహిళలు అదృశ్యం అయ్యారని చట్టసభల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటు న్నారు. అదృశ్యం అయిన వారిని కనిపెట్టడానికి పోలీసులు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందు ఉండాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ..
చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అశువులు బాసిన కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ ఓదార్చి, ఆర్థికసాయం అందించడం అభినందనీయం. భర్తలు, కుటుంబ సభ్యులపై ఆధారపడే స్థితి నుండి మహిళ లను ఆర్థికంగా నిలబెట్టేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. కుప్పంలో పాడిపరిశ్రమ విరాజిల్లుతోంది అంటే కార ణం చంద్రబాబు. పూలు, పండ్లు, డ్రిప్ ద్వారా అనేక పంటలు, ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను ఆర్థికం గా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు అనేక కార్యక్రమాలతో మనముందుకు వస్తున్నారు. మహిళలంతా ఆశీర్వదించాలని శ్రీకాంత్ కోరారు.
నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం మాట్లాడుతూ..
కుప్పంలోని 66వేల కుటుంబాల్లో కనీసం 40వేల కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళి కలు తయారుచేయాలని చంద్రబాబు చెప్పారు. ఎన్నిక ల్లో చిన్న చిన్న తాయిలాలకు ప్రభావితం కాకుండా భవిష్యత్తును ఆలోచించాలని కోరుతున్నా. చంద్రబాబు విజనరీ లీడర్..చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసు కుంటే కుప్పం భవిష్యత్తు బాగుంటుంది. కుప్పంలో చంద్రబాబుకు లక్ష మెజారిటీ వచ్చేలా చూడాలని కుప్పం ప్రజలకు మునిరత్నం విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ..
2004లో అలిపిరి సంఘటన జరిగిన సమయంలో చంద్రబాబు గురించి భువనమ్మ పడిన ఆవేదన వర్ణించ లేనిది. కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎవర్నీ పట్టించుకోని సమయంలో చంద్రబాబు, లోకేష్ ప్రజల్లో తిరిగిన సమయంలో భువనమ్మ ఎంతో ఆందోళన పడ్డా రు. వైసీపీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను గాలికొదిలేస్తే, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆక్సిజన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత భువనమ్మది. ఎంపీ సీటుకోసం జగన్మోహన్‌రెడ్డి సొంత బాబాయ్‌నే చంపే శారు. ఇలాంటి జగన్‌పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ పాదయాత్ర చేస్తానంటే ఆందోళనను దిగమింగు కుని భువనమ్మ లోకేష్‌ను ఆశీర్వదించి ముందుకు పంపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా విద్య, వైద్యం, బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు. వరద వస్తే ప్రభావిత ప్రాం తాల ప్రజలను ఆదుకున్న ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపే భువనమ్మది. చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో పెట్టిన సమయంలో భర్తకు కూతవేటు దూరం లో ఉంటూ న్యాయాన్ని గెలిపించేందుకు అనేక పోరాట కార్యక్రమాలు చేశారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటి వరకు 3,200 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కార్య కర్తల పిల్లల్లో చదువుకునేవారు ఉంటే వారిని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదవించే బాధ్యతలు తీసుకున్నారని అనురాధ చెప్పారు.
మహిళల ప్రశ్నలకు భువనమ్మ జవాబులు
సరస్వతి: చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మహిళల కోసం 20కిపైగా పథకా లు తెచ్చారు. ఆ నాడే మహిళలను ఆర్టీసీ కండ క్టర్లుగా నియమించారు. మహిళలకు ప్రోత్సాహం విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉంటాయి?
భువనమ్మ: చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ఒక్కటే.. మహిళలు ఎందులోనూ తక్కువకాదు అని. అందు కే ఆయన దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్‌ను కూడా చేశారు. ఇదొక చరిత్ర.. అదేవిధంగా ఆర్టీసీ లో మహిళా కండక్టర్ల ఉద్యోగాలు, ఇతర ఉద్యో గాల్లో మహిళలకు ప్రాధాన్యత, ఐటీ తీసుకు రావ డంతో మహిళలకు అపారమైన ఉద్యోగావకాశాలు కల్పించారు. నైపుణ్యశిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, సబ్సిడీలోన్లు ద్వారా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మహిళలను ప్రోత్సహించారు. మహిళల గురించి చంద్రబాబు ఆలోచనలు ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘మహిళలు మగవాళ్లకంటే ఏమీ తక్కువ కాదు… మహిళలు దైనికైనా సమర్థులు..మహిళలు తలుచు కుంటే ఏదైనా సాధిస్తారు’’.
స్వాతి: చంద్రబాబు అన్యాయంగా 53రోజులు జైల్లో ఉన్నారు.ఎప్పుడూ ప్రజలేప్రాణంగా పనిచేసే ఆయ న జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ధైర్యంగా నిల బడ్డారు. నిజం గెలవాలి అని ఎలా రోడ్డెక్కి పోరాటం చేశారు?
భువనమ్మ: చంద్రబాబు ఏనాడూ కుటుంబం గురించి ఆలోచించిన వ్యక్తి కాదు. మా కుటుంబ సభ్యులం ఏనాడూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయాలకు గాని,సెక్రటేరియట్‌కు గాని వచ్చి న వాళ్లంకాదు. చంద్రబాబు ఎప్పుడూ యువత భవిష్యత్తు, స్టేట్ డెవలప్మెంట్, మహిళాభివృద్ధి వం టి అంశాలపై ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనల భాగమే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం. దీనిద్వారా 3,08,425 మంది శిక్షణ తీసుకున్నారు.. 79వేల మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి కార్యక్రమంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అక్రమ కేసుపెట్టి, 53 రోజులు జైల్లో నిర్బంధించారు. రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తుకోసం నిలబడిన నా భర్తను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసింది. నిజాన్ని కప్పిపెట్టి కక్షసాధిస్తున్నారు..నిజాన్ని గెలిపించాలి.. చంద్రబాబు తప్పుచేయలేదు అని సమా జానికి అర్థమయ్యేలా చేయాలని నేను నిజంగెలవా లి అనే పోరాటానికి శ్రీకారం చుట్టాను. నేను ధైర్య ంగా రోడ్డుమీదకు వచ్చి పోరాడానంటే అది నా తండ్రి ఎన్టీఆర్, నాభర్త చంద్రబాబు నుండి పొం దిన స్ఫూర్తే. నేను ఒక్కదాన్ని రోడ్డుమీదకు వస్తే.. నాకు తోడుగా రాష్ట్రంలోని మహిళలంతా రోడ్డు మీదకు వచ్చి పోరాడారు… నిజాన్ని గెలిపించారు.
పుంగనూరు, పలమనేరు: రానున్న ఎన్నికల కురు క్షేత్రానికి వైసీపీ సిద్ధం అంటే… టీడీపీ కార్యకర్తలు సై అంటూ ముందుకు దూకాలని పుంగనూరు, పలమ నేరు నియోజకవర్గాల పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీ మణి భువనేశ్వరి పిలుపు ఇచ్చారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చిత్తూరుజిల్లాకు వచ్చిన భువనే శ్వరి పుంగనూరు నియోజకవర్గం,ఒంటిమిట్ట.. పలమ నేరు నియోజకవర్గం,పెద్దపంజాణి మండలం, కతార్ల పల్లి గ్రామాల్లో తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చి న కార్యకర్తలనుద్దేశించి భువనమ్మ మాట్లాడారు. నాలు గున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధింపులు, ఇబ్బందు లకు గురిచేసిన దుర్మార్గపుపాలనకు చరమగీతం పాడేం దుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలన్నారు. అన్యా యాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, టీడీపీ కార్యకర్తలపై దుర్మార్గాలకు పాల్పడేవారు ఎన్నికలకు సిద్ధం అంటు న్నారు..దానికి టీడీపీ కార్యకర్తలు దీటుగా నిలబడి ఎన్ని కల యుద్ధంలో గెలవాలని భువనేశ్వరి ఉద్ఘాటించారు.
కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది..
జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లేక ప్రక్క రాష్ట్రా లకు వలసపోవాల్సిన దుస్థితి వచ్చింది. జగన్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నారనే కక్షతో చంద్రబాబు పై అక్రమ కేసుపెట్టి 53రోజులు జైల్లో నిర్బంధించారు. పుంగనూరులో చంద్రబాబుకు సంఫీుభావంగా సైకిల్ ర్యాలీ చేసిన టీడీపీ కార్యకర్తలను వైసీపీ దుర్మార్గులు ఏ విధంగా వేధించాలో,దాడి చేశారో రాష్ట్రమంతా చూసిం ది. గతంలో మాచర్లలో వైసీపీకి జై కొట్టలేదని నందం సుబ్బయ్య అనే కార్యకర్తను నడిరోడ్డుమీద గొంతు కోసి చంపేశారు. నందం సుబ్బయ్య పార్టీకోసం ప్రాణాలి చ్చిన కార్యకర్త. ఆయన త్యాగానికి నా జోహార్లు.
టీడీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసి మరీ పార్టీ కోసం, చంద్రబాబుకోసం నిలబడుతున్న తీరు చూస్తుం టే గర్వంగా ఉందన్నారు. నాకు ఘన స్వాగతం పలికిన మీ ఉత్సాహం, అభిమానం తెలుగుదేశంపార్టీ కార్య కర్తల్లో చంద్రబాబు, పార్టీపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేసింది. అయినా వాటన్నిటినీ తట్టుకుని పార్టీ కోసం తడబడకుండా నిలబడుతున్న ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అభిమానం, మీ త్యాగాలను మేం మరచిపోలేం. తెలుగుదేశంపార్టీ నేడు ఇలా నిల బడి ఉందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలే. పార్టీ కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడే ఉం టుంది. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధా లు, దాడులు, హత్యలతో పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నాడని భువనేశ్వరి దుయ్యబట్టారు.
తరలిపోతున్న పరిశ్రమలు..
చంద్రబాబు పాలనలో ఏపీకి కంపెనీలు వరుస కట్టేవి… జగన్‌పాలనలో ఏపీ నుండి పక్కనున్న రాష్ట్రా లకు వెళ్లేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. చంద్ర బాబు పాలనలో పక్కనున్న రాష్ట్రాల ప్రజలు, యువత ఏపీకి వలసలు వచ్చేవారు…నేడు జగన్ పాలనలో ఏపీ నుండి యువత, ప్రజలు పక్క రాష్ట్రాలకు తరలిపోతు న్నారు. ఏపీకి పూర్వవైభవం తెచ్చుకుని మన భవిష్యత్తు ను మనమే నిలబెట్టుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును నాశ నం చేసిన ప్రభుత్వాన్ని కూలదోసే ఎన్నికల యుద్ధంలో యువత కీలకపాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తును నిలబెట్టుకునేం దుకు సై అంటూ ముందుకు రావాలి. ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకులు ఎవరో ఆలోచించి ఓటు వేయాలి. చంద్ర బాబు పాలనతోనే ఏపీకి భవిష్యత్తు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం…భావిత రాల భవిష్యత్తు ను కాపాడుకుందాం. రానున్న ఎన్నికల తరువాత వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించుకునేందుకు ప్రతి కార్యకర్త సై అంటూ ముందుకు రావాలి.. ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టాలని భువనమ్మ పిలుపు ఇచ్చారు.