- ఇద్దరు చనిపోయినా ప్రభుత్వానికి పట్టదా
- సీఎంకు కనీసం సమీక్షించే తీరిక లేదా
- జగన్ మీద సినిమా తీస్తే భూములు కట్టబెట్టేస్తారా
- బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ బ్యాక్‌బోన్ విరిచేయాలి
- సూపర్-6తో మరింత మెరుగైన సంక్షేమం
పార్వతీపురం: ప్రజలకు సురక్షిత తాగునీరు కూడా అందించలేని అసమర్థ పాలకుడు జగన్‌రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో చెత్త ప్రభుత్వం. నిన్నగాక మొన్న గుంటూరులో కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్నా ఈ ప్రభుత్వానికి సమీక్ష చేసే తీరిక కూడా లేదని లోకేష్ దుయ్యబట్టారు.
పార్వతీపురంలో బుధవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ ఈ మధ్య జగన్‌రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు.. మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా.. తాడేపల్లి మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ సరఫరాచేసిన నీళ్లు తాగి జగన్‌రెడ్డికి డయేరి యా వచ్చింది. అందుకే ఎప్పుడన్నా బయటకు వచ్చే ముఖ్యమంత్రి ఈ మధ్య అసలు బయటకు రావటం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు.
ఆరోగ్యశాఖ మంత్రి రజినీని అడుగుతున్నా.. అమ్మా రజినీ… నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావ్.. మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారారమ్మా అని లోకేష్ ప్రశ్నించారు. పరిస్థితి విషమిస్తున్నా ముఖ్య మంత్రి, కనీసం ఆరోగ్యశాఖ మంత్రి కూడా సమీక్ష చేయేలేదు. ఇదొక దున్నపోతు ప్రభుత్వం. ముళ్లకర్ర తీసుకుని కొట్టాలని లోకేష్ అన్నారు.
అల్లూరి నడిచిన నేలలో..
మా శంఖారావం సభకు వైకాపా దిష్టి తగిలినట్లుం ది. మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు,నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు. ఉత్త రాంధ్ర దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరి పోయింది. ఉద్యమాల,పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. ఫ్యాన్‌కు షాకిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది రాజ సం. ఉత్తరాంధ్ర అంటే పైడితల్లి అమ్మవారు గుర్తుకు వస్తారు. అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజ యనగరం నేల. ఇలాంటి పవిత్ర నేలపై అడుగుపెట్ట డం నా అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు.
నీ సొంత భూమి ఇవ్వొచ్చుగా..
జగన్‌రెడ్డికి సినిమా పిచ్చి ఎక్కువైంది. పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారు. ఆ వంకర నవ్వుతో సినిమా చేయలేడు. ఇమేజ్ పెంచుకోవడానికి సినిమాలు తీస్తాడు. ఓవైపు వ్యూహం, మరోవైపు యాత్ర సినిమా అంటారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్త లకు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా సినిమా చూడటం లేదు. సినిమా అట్టర్ ప్లాప్. వైకాపా పని అయిపోయింది, ఇక అంతిమయాత్రే అంటున్నారు. మొదటిరోజు కూడా ఎవరూ చూడలేదు. కానీ సినిమా తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్ జగన్‌రెడ్డి దగ్గరికి వెళ్లి ఆదుకోమంటే ఛీ పో అన్నారు.
అతడికి కోపం వచ్చి అంతిమయాత్ర పోస్టర్ వేసి చూపించారు. డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా తీస్తాననడంతో భయపడిపోయి హార్సిలీ హిల్స్‌లో ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారు. అది ప్రజల కోసం తీసిన సినిమా కాదు.. మీ మెప్పు కోసం తీసిన సినిమా. వాళ్లకు భూమి ఇవ్వాల నుకుంటే తాడేపల్లిలోనో, ఇడుపుల పాయలోనో రెండు ఎకరాలు ఇవ్వొచ్చు కదా. బెంగుళూరులో 32ఎకరాల్లో ప్యాలెస్ ఉంది కదా. అందులో రెండు ఎకరాలు ఇవ్వొ చ్చు కదా. ప్రజల సొమ్మును ఎందుకు అప్పనంగా ఇస్తున్నావ్? ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా లూటీ చేస్తున్నాడని లోకేష్ మండిపడ్డారు.
ఛీకొట్టిన జనం
జగన్ ను చూస్తే పిట్టల దొర గుర్తుకు వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఖేలో ఇండియాను ఆడుదాం ఆంధ్రా అనిమార్చారు. అదికాస్తా విఫలమైం ది. మా జీవితాలతో ఆడిరదిచాలు, ఇక వెళ్లండి అని జనం ఛీకొట్టారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీ యాలు తీసుకువచ్చారు. ఎన్నికల ముందు నియోజక వర్గానికో స్టేడియం నిర్మిస్తామన్నారు. క్రికెట్ అకాడ మీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా అవి ఏర్పాటుచేశారా? జగన్ ఐపీఎల్ టీం పెడతామం టున్నారు. దాని పేరు కోడికత్తి వారియర్స్.
ఆ టీమ్‌లో ప్లేయర్స్‌గా బాబాయిని గొడ్డలితో నరికిచంపిన ఆల్ రౌండర్ అవినాష్‌రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు,గంట స్టార్ అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాట్స్‌మెన్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, కమెడియన్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆటగా ళ్లుగా ఉంటారని లోకేష్ ఎద్దేవా చేశారు.
బీసీలు కలిసికట్టుగా పోరాడాలి
నాకు కులం లేదు, పార్టీ లేదు, మతంలేదు అంటా డు. ఇప్పుడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెడు తున్నారు.కొత్తగా వైకాపా నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారు. అది కాస్తా తుస్తుమంది. జగన్ సామాజిక అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.అసలు వైకాపాలోనే సామాజిక న్యాయం లేదు. ఇప్పటివరకు 63మంది ఎమ్మెల్యేలను మార్చారు. 16 మంది ఎంపీలను ట్రాన్స్‌ఫర్ చేశారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీలే ఉన్నారు. వారి పార్టీకి చెం దిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు.
ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు.
పద్మశాలి వర్గానికి చెందిన వైసిపి ఎంపీ సంజీవ్ కూడా తనకు తగిన గౌరవం లేదని చెప్పారు. బీసీలను ఎదగనివ్వడం లేదన్నారు.ఎమ్మెల్యే పార్థసారథి సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. బీసీలకు రావాల్సిన 27సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. స్థానికసంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్ తగ్గించి 16,500 పోస్టులు దూరం చేశారు. బీసీలకు నేను హామీ ఇస్తున్నా..10శాతం రిజర్వేషన్లు మళ్లీ తీసుకొస్తాం. అమర్‌నాథ్ గౌడ్ అనే బీసీ విద్యార్థిని కిరాతకంగా కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. తన అక్కను ఏడిపిస్తున్నారని అడిగినందుకు వైకాపా నేత ఈ దురాగతానికి పాల్పడ్డారు.
ఆ సోదరుడి అక్కను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్‌బోన్ అన్నారు. ఇప్పుడు జగన్ వారి వెన్నెముకను విరుస్తున్నారు. బీసీలపై 27వేల కేసులు పెట్టారు. జయహో బీసీ అంటూ కలిసికట్టుగా పోరాడి బీసీలంతా జగన్ వెన్నెముక విరగ్గొట్టాలి. ఏపీ వ్యాప్తం గా ఉన్న బీసీ సోదరులు అందరూ కలిసికట్టుగా నడ వాలి. దామాషా ప్రకారం నిధులు కేటాయించి కార్పొ రేషన్లు బలోపేతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
గాలిపైనా పన్ను వేస్తారు
జగన్‌రెడ్డి కటింగ్,ఫిట్టింగ్ మాస్టర్.బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్‌లో రూ.10వేసి, బల్లకింద ఉన్న రెడ్ బటన్‌తో వందరూపాయలు లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. లిక్కర్ రేట్లు పెం చారు. చెత్తపైన పన్ను వేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కాను కలు, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్‌లు కట్,.. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచారు. చివరికి గాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు.
సూపర్-6తో మెరుగైన సంక్షేమం
ఏపీకి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. కేజీ రూ.2కే బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రూ.50కే హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు. చంద్రబాబు దీపం పథకం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. మీ కష్టాలను తీర్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. అందుకే చంద్రబాబునాయుడు- పవనన్న సూపర్-6 హామీలు ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తాం.
ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం. జీవో 3 పునరుద్ధరించి షెడ్యూలు ఏరియాలో గిరిజనులకే ఉద్యోగాలు ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకు అండగా నిలబడేందుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
పసుపు జెండాను చూస్తే చాలు..
టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ. వైకాపా వారికి ఉత్సాహం రావాలంటే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి. మన కార్యకర్తలకు పసుపు జెండాను చూస్తే ఉత్సాహం వస్తుంది. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వంద కోట్లు ఖర్చు చేశాము. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లలను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.
ఒక్క హామీ అయినా..
పాదయాత్రలో విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తిచేస్తామన్నారు, చేశారా? రామతీర్థం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేదు. గోస్తనీ-చంపావతి నదుల అనుసంధానం చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి చేయలేదు. సాలూరు బై పాస్ రోడ్డు, పాలేరు నదిపై డ్యా నిర్మాణం, స్వర్ణముఖి-చింతగడ్డపై బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా? పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నిలబెట్టుకోలేదు. కనీసం రోడ్డుపై గుంతలు కూడా పూడ్చలేకపోతున్నాడు. నాడు, నేడు ఎప్పుడూ విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే.
రోడ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు నిర్మించాం. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు భూసేకరణ చేశాం. టిడ్కో ఇళ్లు కట్టించాం. అయినా 2019లో మనం ఓడిపోయాం. ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇస్తున్నా..మరో 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. పరిశ్రమలు తెచ్చి స్థానికంగా ఉద్యోగాలు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
పార్వతీపురంలో చిరంజీవి మాస్టారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రూ.350 కోట్ల తండాలకు రోడ్లు వేశాం. పార్వతీపురం హెడ్ క్వార్టర్ లో పేదలకు 560 టిడ్కో ఇళ్లు నిర్మించాం. 66 కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేశాం. జంరaావతి రిజర్వాయర్ కు రూ.43 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసింది. హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆనాడు ఏర్పాటుచేశాం. టీడీపీ పాలనలో పార్వతీపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచిందని లోకేష్ అన్నారు.
అవినీతికి చిరునామాగా..
నేడు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జోగారావు. ఆయనకు అవినీతి రావు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారు. ఎక్కడ చెరువు కనిపించినా పట్టాలు సృష్టిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారు. పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే చిన్న సైకో జోగారావు. ఏకంగా ఎమ్మార్వో సంతకాన్నే ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎంక్వైరీ వేసి, కబ్జా చేసిన భూములన్నీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇస్తామని లోకేష్ అన్నారు.
మోడల్ పట్టణంగా పార్వతీపురం
2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురానికి బైపాస్ రోడ్డు వేస్తాం, జంరaావతి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆడారు మినీ రిజర్వాయర్ ద్వారా తండాలకు మంచినీరు ఇస్తాం, సీతానగరం, బలిజపేట మండలాలకు తోటపల్లి నుంచి సాగునీరు అందిస్తాం. పార్వతీపురం శివార్లలో డంపింగ్ యార్డ్ తీసుకువచ్చే బాధ్యత, పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకుంటాం. స్పోర్ట్ స్టేడియం నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు
అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. మన టీడీపీ కౌన్సిలర్ నారాయణ రావుని కొట్టి ఆయనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. దానికి కారణం తాగునీరు అందించాలని, వార్డుని డెవలప్ చేయాలని అడగడమే? ఆయనపై కేసులు పెట్టి పది రోజులు వార్డుకు తాగునీరు రాకుండా చేశారు.
ఎంత అన్యాయం? చట్టాన్ని అతిక్రమించిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నా. వారిని జైలుకు పంపిస్తాం. నాపై 22 కేసులు పెట్టారు. రెడ్ బుక్ పైనా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఇక్కడే ఉంటా రండి. చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. 40 ఏళ్లు ప్రజాసేవ చేశారు. ఆయనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. అవినీతిపై చర్చకు సిద్ధం. వైసిపి పాలనలో ఎక్కువ కేసులున్న కార్యకర్తలకు అంతపెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాం. వచ్చే రెండు నెలలు కష్టపడి టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలి. మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. మన లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రం నుంచి సైకో జగన్ ను తరిమికొట్టాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.