- మొత్తం దోచేస్తున్నారు
- తిన్నదంతా కక్కిస్తాం
- పనిచేసే వారికే పదవులు
- బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. బొబ్బిలిలలో బుధవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. ఒక్క ఇటుక వేయలేదు. ఈ ప్రాం తాన్ని దోచుకునేందుకు మూడు కుటుంబాలకు జగన్ లైసెన్స్ ఇచ్చారు. బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు. టీడీపీ రాగానే తిన్నదంతా కక్కిస్తాం. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మూతపడి న షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పి మోసం చేశారు. ఏకంగా రూ.500కోట్ల ప్రజా ధనంతో విశాఖ లో ప్యాలెస్ కట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కనీసం భూములు కూడా కేటాయిం చలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దలు పోరాడి తీసుకువచ్చా రు. దీనిని ప్రైవేటీకరించేందుకు జగన్ కుట్ర పన్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్లాంట్ అమ్మాలని చూస్తున్నాడు. అవసరమైతే ఆ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ బాధ్యత మనం తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిం చేలా చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
పౌరుషాల గడ్డ బొబ్బిలి
ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర..పోరాటాల గడ్డ ఉత్త రాంధ్ర. పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉంది. మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుండి పారిపోతుంది. శ్రీపైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా అని లోకేష్ అన్నారు.
తగ్గేదే లేదు
2019 నుంచి 2024 వరకు మనపై అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అటెమ్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019కి ముందు ఏనాడూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. అయినా ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారి చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, వైకాపా నాయకులు ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. జనసేన వాళ్లు కూడా పేర్లు పంపిస్తున్నారు. రెండు నెలలు ఓపిక పట్టండి. వారిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి జైలుకు పంపే బాధ్యత నేను తీసుకుంటానని లోకేష్ స్పష్టం చేశారు.
మొదట ఫోన్ చేసింది పవనన్న
ఎన్టీఆర్ మీ అందరికీ రాముడు, చంద్రబాబు దేవుడు,లోకేష్ వైకాపా వాళ్లకు మూర్ఖుడు. చంద్రబాబు ను ఆనాడు అక్రమంగా రిమాండ్‌కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిల బడతానని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్‌చాలని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. ఆంధ్రా ఏమైనా పాకిస్థానా? ఈ సద్దాం హుస్సేన్ పాలన వల్ల ఆంధ్రా పాకిస్థాన్ లా మారిపోయింది. అందుకే సైకో జగన్‌ను తరిమి కొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు. పవనన్న చెప్పినట్లు హలో ఏపీ-బైబై వైసిపి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. టీడీపీ-జనసేన మధ్య చిచ్టుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాత్ ప్రయత్నిస్తుంది. వారికి రూ.5 ఇస్తే చాలు. వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
పనిచేసే వారినే ప్రోత్సహిస్తా
టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సీనియర్లు, జూనియర్లు అందరినీ గౌరవిస్తా. కానీ పనిచేసే వారినే ప్రోత్సహిస్తా. కార్యకర్త లందరూ ప్రతిగడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. టీడీపీ కార్యక్రమాలను ప్రజ ల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇస్తానని లోకేష్ చెప్పారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణరంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ది చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పక్క నియోజకవర్గా ల్లో కనీసం ఇంకుపెన్ను ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో పెన్నుకు ఇంకును మరొ కరు పోసే పరిస్థితి. కొండదేవుల పల్లి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టీడీపీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. వెంగళరాయసాగర్ విస్తరణ పనులు మనం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. పెద్దగడ్డ నీళ్లను రామభద్ర ురం గడ్డ ఆయకట్టుకు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వేదావతి బ్రిడ్జ…