- దళితుల ఊచకోత కోయడమా?
- రాష్ట్రాన్ని దివాళా తీయించడమా?
- నెల జీతాలు ఇవ్వలేకపోవటమా?
- అన్ని వర్గాలకు అన్యాయం చేశారు..
- దళితులను స్పీకర్లు చేసిన ఘనత మాది
- జీడీ నెల్లూరులో చంద్రబాబు ఉద్ఘాటన
- డేటా చోరీపై సీబీఐ విచారణకు డిమాండ్
జీడీ నెల్లూరు: రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం, దళి తుల్ని ఊచకోతకు గురిచేయడమే జగన్ మార్క్ పాలనా? అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. మంగళవారం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో ఉద్వేగంగా మాట్లాడుతూ ` దళితుల్ని చంపి డోర్ డెలి వరి చేయటమే జగన్ మార్క్ పాలనైతే… దళితులను లోక్ సభ స్సీకర్ చేయటం టీడీపీ మార్క్ పాలన అన్నారు. ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వలేకపోవటం జగన్ మార్క్ పాలనైతే, 43 శాతం పిట్‌మెంట్ ఇవ్వటం టీడీపీ మార్క్‌పాలన అన్నారు. అన్ని వర్గాలకు అన్యా యం చేయటమే జగన్ మార్క్ పాలనైతే, అన్ని వర్గాలకు మేలు చేయటం టీడీపీ మార్క్ పాలన అంటూ `ప్రభు త్వాలు ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, కానీ నేడు పాలకులే సమస్యగా మారారు.
ప్రభుత్వమే ప్రజల పట్ల శాపమైందని విచారం వ్యక్తంచేశారు. జగన్ హామీ లను ఎండగడుతూ మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగడుతా నన్నాడు చేశాడా? మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చారు అని విమర్శిం చారు. ఆడబిడ్డలు జగన్‌కి ఓటేసే పరిస్థితి లేదు. తాను అర్జునుడినంటూ జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తు న్నాడు. ఆయన అర్జునుడు కాదు భస్మాసురుడు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా భస్మాసురుడికి బుద్ధి చెప్పాలి అన్నారు. నవరత్నాల ద్వారా ఎవరి జీవితాల్లోనైనా మార్పు వచ్చిందా?, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఐదేళ్లయింది, ఎన్ని జ్యాబ్ క్యాలెండర్లు ఇచ్చాడు, ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? అని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో టీసీఎల్, హీరో, సెల్ కాన్, కార్బన్, డిక్సన్‌వంటి వందలాది కంపెనీలు తెచ్చిన ఘనత టీడీపీదే. అన్ని కంపెనీలు తెస్తే… జగన్ రెడ్డి టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయాయి. అమర్ రాజా బ్యాటరీస్‌ని చిత్తురు జిల్లా నుంచి తరిమేశారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక గుంటూరు ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. యువత 60 రోజులు సైకిలెక్కి టీడీపీ`జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీఈసీ డేటా చోరీపై సీబీఐ విచారణ
ఐప్యాక్ ద్వారా ప్రజల ఓట్లు తొలగిస్తున్నారు. తిరుపతి ఈసీ కార్యాలయంలో డేటా చోరీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్‌కి చిత్తురు జిల్లాలో ఎమ్మెల్యే సీటిచ్చారని అంటూ, అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో కానిస్టేబుల్‌ని ఎర్రచందనం మాఫియా కారుతో గుద్ది చంపిన సంఘటన గుర్తు చేశారు. పోలీసులకే రక్షణ కల్పించలేని వ్యవస్ధ ఎందుకు? అని ప్రశ్నించారు. టీడీపీ ఐదేళ్లలో ఒక్క ఎర్రచందనం దుంగ స్మగ్లింగ్ కాకుండా కాపాడిరదన్నారు. నేడు మళ్లీ ఎర్రచందనం దొంగలు పడ్డారని, తమిళనాడు నుంచి తెస్తున్న రూ.50 కోట్లు దొంగలు ఎత్తుకెళ్లిపోతే దానిపై పోలీసు కంప్లైంట్ ఇస్తే అసలు విషయాలు బయటకొస్తాయన్న భయంతో తేలుకుట్టినా దొంగల్లా ఉండిపోయారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ పాలనలో ప్రతి స్కీమ్.. ఓ స్కామ్ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. బుధవారం రాత్రి అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన కేంద్ర పెద్దలతో విడివిడిగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మూడు సార్లు సమావేశమై ఒక అవగాహన వచ్చారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా వెల్లడిరచలేదు. మరో పక్క జనసేన ఇప్పటికీ బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామి గానే కొనసాగుతోంది.ఈ నేపధ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.