- పార్టీ మీకు తోడుగా ఉంటుంది
- కష్టమొస్తే అండగా నిలబడతాం
- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్య కర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఆయ న సతీమణి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెల వాలి ఉమ్మడి నెల్లూరుజిల్లా పర్యటనలో భాగంగా ఆత్మ కూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మొదటగా ఆత్మకూరు నియోజ కవర్గం అల్లిపురం గ్రామంలో పార్టీ కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని కలిశారు. వారి యోగ క్షేమాలడిగి తెలుసుకున్నారు. ఆంజనేయరెడ్డి(60), గత ఏడాది సెప్టెంబర్ 30న గుండెపోటుతో మృతిచెందా రు. భువనేశ్వరిని చూసిన ఆంజనేయరెడ్డి భార్య జయ మ్మ, కుమారుడు రవి, ఇతర కుటుంబ సభ్యులు భావో ద్వేగానికి గురయ్యారు. వారిని భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.
అనంతరం వెంకటగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రం కలువాయి గ్రామంలో పార్టీ కార్యకర్త బొలిగర్ల చెన్నయ్య కుటుం బాన్ని పరామర్శించారు. చెన్నయ్య(66), గత ఏడాది సెప్టెంబర్ 11న గుండె పోటుతో మృతిచెందారు. చెన్నయ్య భార్య సుశీలమ్మ, కుమారుడు రవిచంద్ర, కుటుంబ సభ్యులను భువనేశ్వ రి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు.
అనంతరం వెంకటగిరి నియో జకవర్గం, రాపూరు మండలం,శానాయపాలెం గ్రామం లో పార్టీ కార్యకర్త సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. కృష్ణయ్య(54), గత ఏడా ది అక్టోబర్ 9న గుండెపోటుతో మృతిచెందారు. కృష్ణ య్య భార్య సుబ్బరత్తమ్మ, కుమారుడు శ్రీనివాసులు, కుమార్తెలు అన్నపూర్ణ, శ్రీలత, సులోచన, కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. పర్యటన పూర్తిచేసుకున్న భువనేశ్వరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హైదరాబాద్‌కు తిరుగుపయనమ య్యారు.
భువనమ్మకు వినూత్న రీతిలో సంఫీుభావం…
వెంకటగిరి నియోజకవర్గం ప్రజలు భువనమ్మకు వినూత్న రీతిలో స్వాగతం పలికి, సంఫీుభావం తెలిపారు. భువనమ్మ పర్యటనకు వెళ్లాల్సిన హైవే మార్గంపై రాపూరు మండలం, పెనుబర్తి గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను బంతిపూలతో అందంగా చిత్రీకరించారు. బంతిపూల మధ్యలో నిజం గెలవాలి అని రాశారు. అటుగా వెళుతున్న భువనమ్మను ఆపి, ఆ చిత్రం వద్దకు తీసుకెళ్లి తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. పెనుబర్తి గ్రామస్తులు, కార్యకర్తల అభిమానానికి భువనమ్మ ముగ్ధులయ్యారు. వినూత్న రీతిలో తనకు సంఫీుభావం తెలిపిన పెనుబర్తి గ్రామస్తులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన గ్రామస్తులు, కార్యకర్తలతో భువనమ్మ ఆప్యాయంగా మాట్లాడి, వారితో ఫోటోలు దిగారు. భువనమ్మతో ఫోటోలు దిగడం పట్ల పెనుబర్తి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.