- సంక్షేమాన్ని భూతద్దంలో చూపడమే..
- నాసిరకం మద్యంతో వేలమంది మృత్యువాత
- ఆ మాంగల్యాలు తెంచిన ఉసురు జగన్‌రెడ్డికే
- జగన్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం
అమరావతి: గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకునే సీఎం జగన్.. ఆసరా పేరిట మహిళలకు టోకరా వేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత దుయ్యబట్టారు. ఒక్కో మహళకు రూ. 15వేలు చొప్పున లబ్ధి అందించి జగన్ ఎక్కడాలేని ఆర్భాటం చేస్తున్నాడన్నారు. తెలుగుదేశం హయాంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా ఒక్కో మహిళకు 20వేల చొప్పున అప్పటి సీఎం చంద్రబాబు కోటిమందికి లబ్ధి చేకూర్చిన విషయాన్ని ఈ సందర్భంగా సునీత గుర్తుచేశారు. ఒక్కో మహిళకు రూ.5 వేల లబ్ధిని కుదించటంతోపాటు, రాష్ట్రంలో 1.14కోట్ల డ్వాక్రా మహిళలుంటే 79 లక్షలకే లబ్ధి దారులను కుదించారని అంటూ, ఈరకంగా 35 లక్షల మందికి మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం రేట్లు మూడు రెట్లు పెంచి భారీ దోపిడీకి పాల్పడిన జగన్, మందుబాబుల ఇళ్లు గుల్ల చేయడమే కాదు, నాశిరకం మద్యం కారణంగా 30వేల మంది చావుకు కారణమయ్యారని దుయ్యబట్టారు. మహిళల మాంగల్యాలు తెంపిన జగన్ మహిళా ద్రోహి అని దుయ్యబట్టారు. పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న వ్యక్తి, చెల్లికి ఆస్తిలో భాగమివ్వని జగన్‌రెడ్డి మహిళా పక్షపాతి ఎలా అవుతాడని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సునీత ప్రశ్నించారు.
నిత్యావసరాల ధరలు పెంచి 57నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.3లక్షల భారం మోపిన జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత, ప్రచారం మాత్రం చెప్పలేనంత అని ఎద్దేవా చేశారు. చంద్రన్న పాలనలో సున్నా వడ్డీ రూ.5లక్షలకు వర్తింపజేస్తే, దాన్ని జగన్ రెడ్డి రూ.3 లక్షలకు కుదించి దారుణంగా మోసం చేశా డన్నారు. జగన్ సర్కారు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్న ఆ 3 లక్షల వడ్డీ భారాన్ని కేంద్రం భరిస్తోంది తప్ప జగన్ ఇచ్చేది కాదన్నారు.
ఉచితంగా ఇళ్లిస్తానని నమ్మించిన జగన్, ఓటీఎస్ పేరిట ఒక్కో మహిళ నుంచి 30వేల వరకూ బలవం తంగా వసూలు చేశాడు. సెంటుపట్టాలో ఇళ్ల నిర్మాణం పేరుతో మహిళలను అప్పులపాలు చేశారు.టిడ్కో ఇళ్లూ లబ్ధిదారులకు ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రన్న అధి కారంలోకి వచ్చివుంటే మొదటి ఏడాది నుంచే ఇళ్లు ఇచ్చి ఉండేవారన్నారు. పెళ్లి కానుక పథకానికి కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల పేదింటి ఆడపిల్ల లకు తీరనినష్టం జరిగిందన్నారు. చంద్రబాబు హయా ంలో అంగన్వాడీల జీతాలు రూ.6,300 పెంచగా, జగన్ పెంచింది కేవలం వెయ్యి మాత్రమే అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు 2014 ఏప్రిల్ 1కి డ్వాక్రా సంఘాల ఎన్‌పీఎ 10.33 శాతం ఉంటే, 2019 ఏప్రిల్ 1కి 1.56 శాతానికి తగ్గించిన ఘనత చంద్రబాబుదని, కానీ 18శాతం అంటూ జగన్ రెడ్డి నిస్సిగ్గు రాతలు రాయించటం వాస్తవం కాదా అని నిలదీశారు? ఎన్సీఆర్బీ లెక్కలపకారం 2022లోే మహి ళలపై 25,503 నేరాలు జరిగాయని, 601 అత్యాచా రాలు, 180 అత్యాచార యత్నం ఘటనలు వెలుగు చూశాయన్నారు.
జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు 66.4 శాతంవుంటే, ఏపీలో 96.2 శాతం నమోదు కావడం మహిళా భద్రతలో జగన్‌రెడ్డి డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. వైసీపీ పాలనలో 30,196మంది మహి ళలు, చిన్నారులు మిస్సయ్యారు. 2019తో పోలిస్తే 2021 మహిళల అదృశ్యం ఘటనలు 43.45 శాతం, చిన్నారుల అదృశ్యం ఘటనలు 53.61శాతం పెరిగా యన్నారు.
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 57నెలల్లో మహిళ లపై 2 లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఆంధ్రలోనే జరగడాన్ని చూస్తే, దిశా చట్టం అమలు ప్రచారార్భాటానికే పరిమితమైంది. మహిళలపై నేరాల పెరుగుదలకు జగన్ నాశిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ కారణాలు కాదా? అని ప్రశ్నించారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్యవున్న 12.6 శాతం బాలికలు గర్భం దాలుస్తున్నారు. ఈ దారుణాల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది.ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో 1,33,447 మంది వ్యభిచారకూపంలో చిక్కుకు న్నారు. ఈ అమానుషాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది. మహిళా సంక్షేమాన్ని భూతద్ధంలో చూపించటం తప్ప వైసీపీ సర్కారు చేసిందేమీ లేద న్నారు. రాష్ట్రం పరిస్థితి ఇలావుంటే మహిళలను ఉద్ధ రించానని జగన్‌రెడ్డి చెప్పుకోవడం ఆత్మవంచన అని పరిటాల సునీత తన ప్రకటనలో మండిపడ్డారు.