అమరావతి,చైతన్యరథం: అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్య క్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయడు పాల్గొన్నారు. ఈ అధ్యా త్మిక కార్యక్రమంలో పాల్గొనడంత నకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిం దని పేర్కొన్నారు.ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన చేసిన పోస్టులో ‘‘ప్రపంచవ్యాప్తంగా అందరూ సంతోషంతో జరుపుకున్న ఉత్సవాల్లో నేను భాగాస్వామినయ్యాను. మతానికి, బౌగోళిక సరిహద్దులకు అతీతం గా శ్రీరాముడికి ప్రాధాన్యత ఉంది. ఆయన వారసత్వం విశ్వవాపితం. రామమందిరం కేవలం దేవా లయం మాత్రమే కాదు,మన దేశ అధ్యాత్మిక ప్రయాణంలో ఓ మైలు రాయి. శ్రీరాముడు నెలకొల్పిన అన్ని రకాల విలు వలకు నివాళి. ఈరోజు ఆయోధ్యలో పండుగ వాతావరణాన్ని, అధ్యాత్మిక ఆహ్లాదాన్ని అనుభవి చేందుకు నేను అశీర్వదించబడ్డాను. బాలరాముని ప్రాణప్రతిష్ట దేశంలో ఓకొత్త యుగానికి నాంది పలుకుతుంది. మనందరికీ అత్యున్నత ఐక్యత ను పెంపొందిస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.