అమరావతి, చైతన్యరథం: జగన్రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలు పై రోడైక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తన సహజసిద్దమైన వేధింపులు, కక్ష సాధింపు పద్దతులను అంగన్వాడీల పైనా ప్రయోగించడం నియం తృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. నిరసనలను అణచి వేయడం, అనై తిక పద్దతిలో సమ్మెను విచ్చిన్నం చేయడం కంటే, ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేదన్నారు. అంగన్వాడీ లను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృషి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు సోమవారం నాడు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.