- హైదరాబాద్‌లో రూ. 150 కోట్లయితే ఇక్కడ 400 కోట్లెందుకని ప్రశ్న
- రాజధానిలో అంబేద్కర్ స్మృతివనాన్ని పాడుబెట్టారని ఆవేదన
- అంబేద్కర్ విగ్రహం పెడితే దళితుల పట్ల చేసిన పాపాలన్నీ పోతాయా అని నిలదీత
- అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్ అని ధ్వజం
అమరావతి: అంబేద్కర్ విగ్రహం పేరు అడ్డం పెట్టు కుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైకాపా ప్రభు త్వం తెరలేపిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. రాజ ధాని ప్రాంతంలోని శాఖమూరులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఏర్పా టు కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయిం చిన ప్రాంతాన్ని ఆనందబాబు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, తిరువూరు నియోజకవర్గం ఇం చార్జి శావల దేవదత్, తెలుగుదేశంపార్టీ నాయకులు మద్దిరాల మ్యాని, పిల్లి మాణిక్యారావుతో కలిసి పరిశీ లించారు. స్మృతి వనం ప్రాజెక్టులో పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయి ఆ ప్రాంతం మొత్తం పిచ్చిమొక్కలతో నిండి పోవటం, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన విగ్రహాలన్నీ దొంగలు ఎత్తుకెళ్లిన వైనాన్ని చూసి నేతలు అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు మాట్లా డుతూ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే, అలాంటి ఉగ్రహానికే ఏపీలో రూ.400 కోట్లు ఖర్చు చూపటం దోపిడీ కాక మరేం టని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.137 కోట్ల తో 125అడుగుల ఎత్తు విగ్రహంతో నిర్మించ తలపెట్టిన స్మృతి వనాన్ని జగన్ నాశనం చేశాడని ఆవే దన వ్యక్తంచేశారు. రూ.36 కోట్లతో 26శాతం పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు కంటే చిన్న ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం చేపట్టి రూ.400కోట్ల ఖర్చు చూపెట్టడమేమిటని తప్పుబట్టారు. అంబేద్కర్ విగ్రహం పేరు మీద వందల కోట్లు దోచు కోవడానికే విజయవాడలో విగ్రహం ఏర్పాటు పేరిట తతంగం నడిపిస్తున్నారన్నారు. శాఖమూరులోని స్మృతి వనంలో అంబేద్కర్ విగ్రహాలు దోపిడీకి గురవటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. ఆనాడు అంబేద్కర్ స్మృతి వనం కోసం రూ.36 కోట్లు ఖర్చు పెట్టాము. 26శాతం పనులు పూర్తయ్యాయి. ఫౌండేషన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. దానికి సంబంధించి అంబేద్కర్ నమూనా విగ్రహాలు 7 విగ్రహాలు ఏర్పాటు చేయగా అందులో ఆరు విగ్రహాలు దొంగిలించుకు పోయారు. ఒక విగ్రహం మాత్రమే మిగిలిందని ఆనంద్ బాబు చెప్పారు.
అంబేద్కర్ విగ్రహం పెడితే పాపాలన్నీ పోతాయా?
విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గురి ంచి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటేమిటి? ఆ ప్రాజెక్ట్ బాధ్యత చూసుకుంటున్నది సోషల్ వెల్ఫేర్ విభాగం. ఆ శాఖకి సంబంధించిన మంత్రి పక్కన మౌనంగా నిలబడి ఉంటే పెత్తందారైన విజయసాయి రెడ్డి విగ్రహావిష్కరణ వివరాలను మీడియాకు వివరించ డమేమిటి? ఇదేనా దళిత మంత్రులకు వైసీపీలోని పెత్తందారులు ఇచ్చే గౌరవం. దళితుల ఓట్లతో గద్దెనెక్కి న జగన్‌రెడ్డి దళితులను ఘోరాతి ఘోరంగా అవమా నించారు. హత్యలు చేశారు. అత్యాచారాలు చేశారు. ముఖాలపై మూత్ర విసర్జన చేశారు. ఈరోజు అంబేద్క ర్ విగ్రహం ఒకటి పెట్టి పాపాలన్నీ కడిగేసుకుందా మని అనుకుంటున్నారా? సిగ్గుండాలని ఆనంద్‌బాబు మండిపడ్డారు.
అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టును చంపేశారు
విజయవాడలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా న్ని 19వ తేదీన ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నా రని చాలా గొప్పగా చెబుతున్నారు. ఆనాడు అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ప్రత్యేక సమా వేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో వక్తలందరూ అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. ఆ రోజు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటికి వెళ్లిపోయాడు. ఏపీ రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలనేది ఆ రోజు తీసుకున్న నిర్ణయమే.
స్మృతి వనంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, ఇండోర్, ఔట్‌డోర్ బుద్ధిష్ట్ కేంద్రాలు, పదివేల పుస్తకాలతో ఒక లైబ్రరీ, అదేవిధంగా మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రతి పాదనలతో 20 ఎకరాలు చంద్రబాబు కేటాయించారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతిని ఏ విధంగా నిర్ధాక్షిణ్యంగా చంపేశాడో, అదేవిధంగా అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్నా అంటు న్నాడని ఆనంద్ బాబు విమర్శించారు.
అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటారా?
ఈ రోజు అంబేద్కర్ మీద జగన్‌కి నిజంగా ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును జగన్ విదేశీ విద్యానిధిగా ఎందుకు మార్చాడని ఆనంద్‌బాబు ప్రశ్నించారు. ఇంత కంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా అన్నారు. అంబేద్క ర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ప్రతిరోజు ఖూనీ చేస్తునే ఉన్నారు.
దళితుల హక్కులు కాలరాసిన జగన్
చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో రాజధాని నడి బొడ్డున అంబేద్కర్ స్మృతివనంతో పాటు బాబూ జగ్జీవన్ రామ్ పేరిట సమతా స్మృతివనం ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం,రూ.50 కోట్లు కేటాయించారు. స్వాతం త్రం వచ్చిన తర్వాత దళితులకు అమలవుతున్న పథకా లు రద్దుచేసి, రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలు రాసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. మీరు చేస్తున్న పనులన్నీ దళితులు గమనిస్తూనే ఉన్నారు. దళితులంద రూ తమ ఓటు ద్వారా జగన్‌రెడ్డిని ఇంటికి పంపించ డానికి సిద్ధంగాఉన్నారని ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.
చేసిన పాపాలు పోవు: వర్ల
అమరావతిని చంపేసినట్లే అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టి నిర్వీర్యం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చినది మొదలు గత నాలుగేళ్ల ఎని మిది నెలల్లో దళితుల పట్ల జగన్మోహన్‌రెడ్డి చేసిన నేరా లు, ఘోరాలకు లెక్కలేదన్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ పాపాలు పోవన్నారు. చేసిన పాపాలకు జగన్‌రెడ్డి మూ ల్యం చెల్లించుకోవాల్పిందేనన్నారు. అంబేద్కర్ పైనా, ఆయన రాసిన రాజ్యాంగం పైనా ఏ మాత్రం గౌరవం, చిత్తశుద్ధిలేని ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్‌రెడ్డి ఒక్కరేనని వర్ల దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవతోటి నాగరాజు, సుశీలరావు, కోడూ రి అఖిల్, మైనర్ బాబు,బత్తుల హరిదాసు, పులి చిన్నా, కారంగి అనిల్, సౌపాటి రత్నం, ఆదాము, బలరాం, మాణిక్యం, ఇతర దళిత నేతలు ఉన్నారు.