చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ విధ్వంస పాలన ప్రారంభించిన అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసిన ఇరువురు నేతలు

by చైతన్యరధం
Jan 15, 2024 at 8:33am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ విధ్వంస పాలన ప్రారంభించిన అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజధాని రైతుల త్యాగం, పోరాటం వృధా కాదు…అమరావతే రాజధాని
  • టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి చేసుకుందాం
  • ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌
  • వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసిన ఇరువురు నేతలు
అమరావతి :- ‘పండుగ భోగి..పాలకుడు మానసిక రోగి. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసానికి జగన్‌ నాంది పలికారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారు. ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుండే ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో సంపద సృష్టించడమే టీడీపీ-జనసేన లక్ష్యం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని గ్రామమైన మందండంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరిట గోల్డెన్‌ రోల్‌ స్కూల్‌ ఆవరణలో భోగి మంటల కార్యక్రమంలో  చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు,  పవన్‌ కళ్యాణ్‌ కు రాజధాని ప్రాంత రైతులు గంగిరెద్దులు, పొంగళ్లతో ఘనస్వాగతం పలికారు. మహిళలు వేసిన ముగ్గులను ఇరు నేతలు కాసేపు తిలకించారు. భోగి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
అడుగడుగునా రాజధాని రైతులకు అవమానం
సంక్రాంతి పండుగ రాజధానిలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఒకవైపు సంతోషం..మరోవైపు బాధ కూడా ఉంది. మళ్లీ భవిష్యత్తు మనదే..అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో త్వరలో పరిపాలన జరుగుతుంది. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు. ఇంటికి వచ్చిన బంధువులతో కుటుంబ సమేతంగా సంక్రాంతి జరుపుకుంటాం. మీరు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి నారావారిపల్లె రావాలని నా సతీమణి 30 ఏళ్ల క్రితం చెప్పింది. పాతవస్తువులు, పనికిరానివి భోగిలో వేసి పాపాలు తొలగిపోవాలని కోరుకుంటాం. ప్రభుత్వ అసమర్థత, విధ్వంస విధానాల వల్ల ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..కానీ ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు..అన్నింటినీ నాశనం చేశాడు..దానికి ఉదాహరణ అమరావతి రాజధానే. పగవాళ్లు కూడా పడనన్ని ఇబ్బందులు  భూములిచ్చిన రైతులు పడ్డారు..అడుగడుగునా అవమాన పడ్డారు. రాష్ట్ర రాజధాని కోసం 35 వేల ఎకరాలు భూమి ఇచ్చారు. ఉదారంగా ముందుకు వచ్చి భూములిచ్చిన మిమ్మల్ని రాజధానిలో భాగస్వామ్యం చేసి పేదరికం నుండి బయటకు తీసుకురావాలని చూశాను..కానీ ప్రభుత్వం మారడంతో అనుకున్నది జరగలేదు.
వైసీపీకి కౌంట్‌ డౌన్‌ ప్రారంభం
భోగిలో చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. రాష్ట్ర రాజధానిగా రాజధాని అమరావతే ఉంటుంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, సంపద సృష్టించే కేంద్రంగా అమరావతి మారుతుంది. రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ పాలన ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. అమారావతి దేవతల రాజధాని..దాన్ని రాక్షసుడు చెరబట్టాడు. 87 రోజులే ఉంది..ఇక్కడి నుండే కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. రాష్ట్రానికి శుభగడియలు తలుపు తడుతున్నాయి. రాజకీయ హింస, అక్రమాలు, మోసపు హామీలు, అధికార మదం, జగన్‌ అహంకారాన్ని కూడా భోగిలో తగలబెట్టాం. ధరల పెరుగుదల పేదలను పట్టి పీడిస్తోంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని రోడ్డుపై నిలబెట్టారు..ఇది ప్రభుత్వ అహంభావం. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక పక్క భోగి. తర్వాత సంక్రాంతి. సంక్రాంతికి మళ్లీ వెలుగులు రావాలని పెద్దలకు పూజలు చేస్తాం. కనుమ రోజు పశువులకు పూజలు చేసి పశుసంపద పెరగాలని ఆకాక్షిస్తాం. సుసంపన్నమైన సాంప్రదాయం తెలుగు వారి సొంతం.
పేదవాడు పండుగ చేసుకోలేని పరిస్థితి
పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదలు ఉన్నారు. 6 రకాల వస్తువులతో మన ప్రభుత్వంలో సంక్రాంతి కానుకు ఇచ్చాం. ముస్లింలకు రంజాన్‌ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుక అందించాం. వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసింది..పండుగ జరుపుకోలేనంతగా నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజల్‌, విద్యుత్‌, పన్నుల మోత మోగిపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ బాదుడు దెబ్బకు పేదవాడు బతికే పరిస్థితి లేదు. రూ.10 ఇచ్చి వంద దోచుకుంటుంన్నాడు. టీడీపీ-జనసేన వచ్చాక రూ.15 ఇచ్చి దాన్ని రూ.100 చేసే విధానం తీసుకొస్తాం. వందను వెయ్యి…వెయ్యిని పది వేలకు పెంచేలా..సంపద సృష్టికి చర్యలు చేపడతాం. రాజధానికి ఇచ్చిన 35 వేల ఎకరాల భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చే భూమి పోగా..ఇంకా 8 వేల ఎకరాలు మిగులుతుంది. ఈ 8 వేల ఎకరాలను కొద్దికొద్దిగా అమ్ముకుంటే లక్షకోట్ల సంపద వస్తుంది. ఎకరా రూ.30 కోట్లకు అమ్మితే రూ.3 లక్షల కోట్ల సంపద వస్తుంది. హైటెక్‌ సిటీ ఎదురుగా 25 ఏళ్ల క్రితం ఎకరా లక్ష ఉండేది..ఇప్పుడు వంద కోట్లు అమ్ముతోంది. ఇది సంపద సృష్టించే మార్గం.
ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి నాంది
కూల్చడం తప్ప..నిర్మిచడం తెలియని వ్యక్తి జగన్‌. రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలేదు..పంట కొనుగోలు చేయడం లేదు..వరదలు వస్తే వారివైపు చూడటం లేదు. రాష్ట్రంలో 466 మండలాల్లో కరువు వస్తే…106 మండలాల్లోనే ఉంది అని చెప్పి కేంద్ర సాయం కూడా తీసుకోలేదు. మనం కట్టిన అసెంబ్లీలో సమావేశాలు, సచివాలయంలో మంత్రిమండలి నిర్వహిస్తున్నారు. హైకోర్టు భవనం కూడా నిర్మించాం. రాజధానిలో ఐదేళ్ల క్రితం కట్టిన బిల్డింగులు చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది. రోడ్లను కూడా తవ్వుకుపోతున్నారు. హైకోర్టు జడ్జిల కోసం నిర్మించిన ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. 3 రాజధానుల పేరుతో విశాఖ పోతున్నామంటున్నారు. రాజధాని రైతుల గెలుపు 5 కోట్ల ఆంధ్రులు, తెలుగుజాతి గెలుపు. తెలుగుజాతి కోసం మీరు త్యాగం చేశారు…మీ త్యాగం వృధా కాదని ఆకాంక్షిస్తున్నా. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుంది..ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నా అన్నాడు. కానీ అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఆడుతున్నాడు.
ఆర్థిక రాజధానిగా విశాఖ..కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌
విశాఖను ఆర్థిక రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసి పూర్వవైభవం తీసుకొస్తాం. జగన్‌ కు ఓటేశాక అందరి నెత్తిన చేయిపెట్టి భస్మం చేస్తున్నాడు. ఇంకా బతికే ఉన్నాం..సంతోషించాలి. మళ్లీ ఒక్కటే అవకాశం ఉంది..87 రోజులు ప్రతి ఒక్కరూ ఆలోచించి కులం, మతం, ప్రాంతానికి అతీతంగా ఒకే దారికి రావాలి. వైసీపీ విముక్త రాష్ట్రంగా అంతా పని చేయాలి. పోలీసులు కూడా అరాచకాలు చేశారు..రైతులకు జిందాబాద్‌ కూడా పోలీసులు త్వరలో కొడతారు. ఇదే ప్రజాస్వామ్య విశిష్టత. పోలీస్‌ వ్యవస్థ మారాలి. దుర్మార్గుడి చేతిలో బలైపోయారు. అప్రతిష్టపాలు అయ్యారు. సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మొదట పోలీసులే. మీరు మారకుంటే ప్రజలు, ప్రజాస్వామ్యమే మిమ్మల్ని మారుస్తారు. రాజధాని కోసం ఆడబిడ్డలు ఆందోళన చేస్తుంటే డ్రోన్‌ లు బాత్రూంల పైకి పంపారు. ఈ సమావేశానికి స్థలం ఇచ్చిన యజమాన్యాన్ని కూడా బెదిరించారు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి సీఐడీ చేసి కొట్టి జైలుక పంపారు. ఒక ఎంపీని సొంతూరు రాకుండా ఐదేళ్లుగా ఢల్లీిలోనే ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో సొంతూరు వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వ తప్పిదాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన యశస్వి అనే యువకున్ని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అమెరికా పోకుండా అడ్డుకుని పాస్‌ పోర్టు లాక్కున్నారు.
రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్‌
అమరావతి ఒక వర్గం, కులం, మతానిది కాదు..అన్ని వర్గాలకోసం అమారావతి ఉంది. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే విధంగా తెలంగాణ ఉందంటే దానికి 25 ఏళ్ల క్రితం వేసిన పునాది. మా ఆలోచన ఒకటే..తెలుగుజాతి నెంబర్‌ 1 గా ఉండాలి. 2047 నాటికి తెలుగుజాతి నెంబర్‌ 1 గా ఉండాలన్నదే మా ఆశయం. ఈ పండుగ 3 రోజులు సంకల్పం చేయండి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మన బాధ్యత. సాధారణ మానవులు అయితే ఎవరూ ఇలాంటి పాలన చేయరు..మానసిక రోగులు మాత్రమే చేస్తారు. పోలీసులు యాక్షన్‌ తీసుకోవాల్సింది..మానసిక రోగిపైనే..పేదలపై కాదు. రాబోయే రోజుల్లో ఇక్కడే సంక్రాంతి జరుపుకుంటాం. రాజకీయాలకు అర్హతలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ…
‘‘నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడపట్టింది…ఆ పీడ వదిలే సమయం వచ్చింది. రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగిమంటల్లో కాల్చివేశాం. మీ కష్టాలు నాకు తెలుసు..మీపై జరిగిన దాడి, అనుచిత వ్యాఖ్యలు చేసిన, లాఠీలతో కొట్టిన ఘటనలు నన్ను కలిచివేశాయి. మీ ఆవేదన చూడలేకనే టీడీపీ-జనసేన కలిశాయి. ప్రతి ఆడబిడ్డకు హామీ ఇస్తున్నాం..ఏ ఉద్దేశ్యంతో మీరు రాజధానికి భూములిచ్చారో దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం. ప్రతి సారి జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్ర నినాదాన్ని కూడా లేవనెత్తాలి. జై అమరావతి అన్న ప్రతిసారి అది అమరావతి సమస్యగా అనుకుంటున్నారు..కానీ ఇది 5 కోట్ల మంది సమస్య. మీకొచ్చిన కష్టం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వాసులకు రావొచ్చు..కడపలోని పులివెందుల వాసులకూ రావొచ్చు. యువజన శ్రామిక రైతు అని పార్టీలో పేరు పెట్టుకున్నారు తప్ప..రైతులకు ఏమీ చేయలేదు.
టీడీపీ-జనసేన ప్రభుత్వంతో బంగారు భవిష్యత్తు
రాజధాని రైతులకు మొదట ద్రోహం చేశారు, భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేశారు. ఐదేళ్లుగా డీఎస్సీ లేదు..కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ లేదు. ఉపాధి అవకాశాలు లేవు. మీకు కౌలు రాకుంటే మేము పోరాడాం. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రానికి చీకటి భవిష్యత్తు వస్తుందనే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు కలవకూడదు అని ప్రయత్నం చేశారు. సుస్థిర ప్రభుత్వాన్ని టీడీపీ-జనసేన ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తు ఇస్తాం. జనసేన రైతులకు అండగా ఉంటుంది..కౌలు రైతులకు స్వయంగా లక్ష దాకా అందించాం. యువత, మహిళలు, రైతులు, అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. తెలంగాణ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా. వచ్చే యేడాది టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఇక్కడే సంక్రాంతి సంబరాలు చేసుకుందాం.’’ అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-08-2026

భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

Previous Post

మంత్రి కారుమూరి..మహా ముదురు!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 14-01-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-08-2026

కార్యకర్త
@ August 11, 2026
భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

చైతన్యరధం
@ August 11, 2026
ఆంధ్రప్రదేశ్

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

కార్యకర్త
@ August 10, 2026
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026

కార్యకర్త
@ August 9, 2026
Load More

ముఖ్య వార్తలు

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

చైతన్యరధం
@ August 11, 2026

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist