– 17ఏ తీర్పుకు బెయిల్‌కు ఎటువంటి సంబంధం లేదు
– చంద్రబాబును కస్టడీలో ఉంచడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు
అమరావతి, చైతన్యరథం: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హై కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్ర బాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు ముగియడంతో బెయిల్‌పిటిషన్‌పై తీర్చును హైకోర్టు రిజర్వ్ చేసింది.
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరు తూ సిద్దార్థ లూద్రా గురువారం హైకోర్టులో సమర్థ వం తంగా తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేయబడిరదని ఈ నేప థ్యంలో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ను నిరాకరించ డం చట్ట సమ్మతం కాదని ఆయన పేర్కోన్నారు. ఎసిబి కోర్టు వారు సిఐడి రెండవ సారి అడిగిన పోలీస్ కస్టడీ ని తిరస్కరించినప్పటికి దానిపై సిఐడి ఇంతవరకు అప్పీ ల్ చేయకపోవడం ఆయనను కస్టడీలో ఉంచవల సిన అవసరంలేదని నిర్ధారిస్తుందని కోర్టుకు తెలియజేశారు. క్వాష్ పిటిషన్ వేసినప్పటికి దానికి సంబంధం లేకుం డా బెయిల్ పొందడానికి చంద్రబాబుకు హక్కు ఉందని క్వాష్ మరియు బెయిల్ పిటిషన్ల మధ్య సంబంధంలేద ని ఆయన పేర్కొన్నారు. డిజైన్ టెక్ సంస్థకు నిధులను విడుదల చేయడంలో చంద్రబాబు పాత్ర ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విధాన నిర్ణ యాలుమాత్రమే తీసుకుంటారని ఈవిషయంలో కూడా అదే జరిగిందని ఆయన కోర్టుకు నివేదించారు. ఒప్పం దపత్రం మీద తేదీలు వేయడం మర్చిపోవడానికి ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు సంబంధం ఉం డదని, ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన వారందరికీ కోర్టులు బెయిల్స్ మంజూరు చేశాయని ఆయన ఎత్తి చూపారు.ఫైళ్ళలో ఉన్న విషయాలు 2015 సంవత్సరా నికి సంబంధించినవి అని అవి సిఐడి స్వాధీనంలోనే ఉన్నాయని, వాటి ఆధారంగా 2023లో చంద్రబాబు బెయిల్ నిరాకరించడం సమర్థనీయం కాదన్నారు. కేసు లో ఉన్న ఇతరులకు ముందస్తు లేదా రెగ్యులర్ బెయిల్స్ ఇప్పటికే ఇచ్చారని,చంద్రబాబునుఅన్యాయంగా ఇప్పటి కే 50 రోజులు జైలులో ఉంచారని కోర్టుకు తెలిపారు.
సిద్ధార్ధ లూద్రా కోర్టు ముందు ఉంచిన ముఖ్య అంశాలు
సిఐడి వారు నిన్న వేసిన అడిషనల్ కౌంటర్‌లో సీమెన్స్ సంస్థ అంతర్గత నివేదికను పదేపదే ప్రస్తావిం చారని, అందులో ఉన్న సారాంశం మరియు వాట్సాప్ సందేశాలు అక్టోబర్ 2014-మార్చి 2015 కాలానికి సంబంధించినవి అని, అప్పటికి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రారంభం కూడాకాలేదని ఎత్తిచూపారు. సీమె న్స్ అంతర్గతనివేదికలో చంద్రబాబు పేరును కానీ, మరే విషయాన్ని కానీ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్ పేరుతో శరత్ అసోసియేట్ సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నివేదిక లోపభూయి ష్టమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు తరఫున వచ్చిన సాప్ట్‌వేర్ మరియు హార్డ్ వేర్ విలువలను మదిం పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితా లను మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ నివేదిక తయారు చేశారన్నారు. 40శిక్షణా కేంద్రాలలోని సాప్ట్ వేర్ మరి యు హార్డ్ వేర్ పరికరాల విలువను స్టాక్ రిపోర్టుల ద్వారా తెప్పించుకుని అప్పటి ఎండి డిజైన్ టెక్ సంస్థకు అభినందన పత్రం అందజేశారని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్ కోసం టెండర్ పిలిచినప్పుడు స్టాక్ వెరిఫికేషన్ చేయాలని ఉందని,కానీ ఆ తరువాత దురు ద్ధశ్యపూర్వకంగా దానిని తొలగించారని అందుకున్న ఆస్థుల విలువ లెక్కలోకి తీసుకోకుండా నిధులు దుర్వి నియోగం అయ్యాయని ఆరోపించడం ఆధార రహిత మని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది నగదు రూపేణా లేదా వస్తు రూపే ణా కూడా ఉండవచ్చని దానికి సంబంధించిన పత్రాల ను కోర్టు ముందు ఊటంకించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన శరత్ అసోసియేట్స్ గానీ, విచారణ జరు పుతున్న సిఐడి సంస్థ కానీ సీమెన్స్ నుండి వచ్చిన సాప్ట్ వేర్ విలువను ఇప్పటికీ నిర్ధారించలేదని, వారికి కావల సిన విధంగా దురుద్దేశ్యాలు ఆపాదిస్తున్నారని ఆయన కోర్టు ముందుంచారు.
ఫోరెన్సిక్ ఆడిట్ తయారుచేసిన సంస్థ రాష్ట్ర ప్రభు త్వ అధికారులు ఇచ్చిన పత్రాలను మాత్రం ఆధారంగా చేసుకుని వారి కోరికలకు అనుగుణంగా ఆరోపణలతో కూడిన నివేదికను అందించిందన్నారు. నివేదికలో పొం దుపరిచిన సమాచారానికి కానీ, వాటిపై చేసిన వ్యాఖ్యా లకు కానీ,తాము బాధ్యులం కామని వాటి యొక్క వాస్త వికతను తాము నిర్ధారించలేమని కూడా ఆసంస్థ వారు స్పష్టంగా పేర్కొన్నారు.రెండు సంవత్సరాల క్రితం ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన సిఐడి సంస్థ కూడా ఇప్పటికీ స్టాక్ వెరిఫికేషన్ చేయకుండా ఉండటం వారి ఉద్దేశ్యా లను తెలయజేస్తుందన్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌లోనే డిజైన్ టెక్ ద్వారా సీమెన్స్ సంస్థకు రూ.92 కోట్లు చెల్లించారని పేర్కొనగా సిఐడి వారుమాత్రం సీమెన్స్ సంస్థ ఈప్రాజెక్టుతో తమకు సం బంధం లేదని చెప్పిందని పేర్క్నొడం విడ్డూరమన్నారు. నిధులు తీసుకున్న సీమెన్స్‌సంస్థ జవాబుదారీ వహించా లని నొక్కి వక్కాణించారు. ఫోరెన్సిక్ ఆడిట్‌నివేదికను లోపభూయిష్టంగా తయారు చేశారని, శరత్ అసోసియే ట్స్ సంస్థపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అది రాజకీయ ప్రేరేపితమైదని, ఇనిస్టిట్యూట్ చార్టెడ్ అకౌం టెంట్స్ ఆఫ్‌ఇండియా(ఐసిఏఐ) వారికి డిజైన్‌టెక్ ఎండి శ్రీ వికాస్ కన్వెల్కర్ ఫిర్యాదుచేయడానికి చంద్రబాబుకు సంబంధం లేదని బాధితులు తమ చట్టబద్ద హక్కులను ఉపయోగించుకోవడాన్ని తప్పు పట్టకూడదని ఆయన చెప్పారు.తాము చేసిన అసత్య ఆరోపణలను మౌనంతో అందరూ అంగీకరించాలని సిఐడి భావించడం హాస్యా స్పదం అన్నారు.
సిఐడి సంస్థవారు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సీమెన్స్ సంస్థకు సంబంధమేలేదని పదే పదే చెబుతు న్నారని కానీ ఆసంస్థ ప్రస్తుత ఎండి మాథ్యుస్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్‌వారికి ఇచ్చిన వాంగ్మూలంలో తమసంస్థ 90శాతం ప్రాజెక్టు వ్యయాన్ని డిస్కౌంట్ల రూపేణ ఇవ్వ డం ఆనవాయితీ అని చెప్పారని, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ధృవీకరించారని ఆయనకోర్టుకు విన్నవించారు.ఈవాంగ్మూలం వల్ల సిఐ డి చేస్తున్న వాదనలో పసలేదని తేలిపోయిందని పత్రికా విలేకరుల సమావేశంపెట్టి సర్వీస్ నిబంధనలకు వ్యతిరే కంగా కొందరు చేస్తున్న ద్రుష్పచారం విలువ లేనిదిఅని తేలిపోయిందని ఆయన కోర్టు ముందుంచారు.
ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక గురించి సిఐడి వారు తమ కౌంటర్‌లో అనేకసార్లు ప్రస్తావిస్తున్నారని,ఆనివేదికవారి ఆధీనంలోనే ఉందని, దానిఆధారంగా చంద్రబాబుకు బెయిల్‌నిరాకరించడం చట్టబద్దంకాదని ఆయన వాదిం చారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థమరియు ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా ఆరోపణలుచేస్తూ ఈ నివేద కను తయారుచేశారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లోనే సీమె న్స్ మరియు డిజైన్‌టెక్ సంస్థలవారు తమకు ఏరకమైన సమాచారం అందజేయలేదని అందువల్ల వారి తరఫు నుండి గ్రాంట్ రాలేదని తాము భావిస్తున్నామని వారి నుండి సమాచారం వస్తే తమ అభిప్రాయాన్ని మార్చు కుంటామని పేర్కొన్న విషయాన్ని ఆయన కోర్టుకు తెలి యచేశారు. ఫోరెన్సిక్ ఆడిట్‌చేసి సంస్థ ఏరకమైన పరి శీలన జరపకుండా ప్రభుత్వానికి కావలసిన నివేదికను అందజేసిందన్నారు.
ప్రాజెక్టు క్రింద సరఫరా చేసిన ఆస్థుల విలువను నిర్ధారించకుండా,లెక్కలోకి తీసుకోకుండా నిధులు పక్క దారి పట్టాయని ఫోరెన్సిక్ నివేదిక సూత్రీకరించడం ఆధారాలు లేని ఆరోపణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి నగదురూపంలో వచ్చిన విరాళాల గురించి సిఐడి ప్రస్తా వించిందని, చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారాన్ని ఇప్పటికేపార్టీ అందజేసిందని, తెలుగుదేశం పార్టీకి చెం దిన ఆర్ధిక వ్యవహారాల వివరాలను ప్రత్యర్థి పార్టీ అయి న వైసీపీ చేతిలో ఉంచడానికి సిఐడి చేస్తున్న ప్రయత్న మని ఆయన పేర్కొన్నారు. నగదు విరాళాలపై విచారణ పేరుతో విచారణను సాగదీస్తున్నారని,అంతంలేని విచా రణను కొనసాగించడమేవారి ఉద్దేశ్యమనిఆయన సిఐడి ని తప్పుపట్టారు. భారత ఎన్నికలసంఘం మరియు ఆదాయపు పన్నుల శాఖల వారికి అన్ని వివరాలు ఇప్పటికే అందజేసిందన్నారు.
కిలారు రాజేష్ ఇప్పటికే సిఐడి ముందు వాంగ్మూ లం ఇచ్చారని, అలాగే మిగిలిన వ్యక్తులు కూడా విచా రణకు సహకరిస్తున్నారని తెలిపారు. మనోజ్ పార్థసాని మరియు పెండ్యాల శ్రీనివాస్‌ల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబును 08.09.2023న అరెస్ట్ చేయగా వారికి 3రోజుల ముందు అనగా 05.09.2023న నోటీసులు ఇచ్చారని, ఈ సంఘటనలతో చంద్రబాబుకు సంబం ధం లేదని స్పష్టం చేశారు.
మధ్యంతర బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లం ఘించలేదని హైదరాబాద్‌లో జరిగినది రాజకీయ ర్యాలీ అని చెప్పడం వాస్తవ విరుద్దమని, దీనిపై తెలంగాణ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఎఫ్‌ఐఆర్ దీనిని స్పష్టం చేస్తుందని ఆయన కోర్టు ముందుంచారు. అదే విధంగా వైసీపీపార్టీ ప్రతిరోజు ఈకేసులపై మాట్లాడుతూ తెలుగు దేశంపార్టీని అప్రదిష్టపాలు చేస్తున్నదని,దానికి సమాధా నంగా తెదేపా ప్రతినిధులు మాట్లాడటం ప్రజాస్వామ్య హక్కు అనిదానిని సాక్ష్యులను బెదిరించడంఅని చిత్రీక రించడం సమ్మతంకాదని పేర్కొన్నారు. సిఐడి సంస్థ వారు, అధికారపార్టీ తెలుగుదేశంపార్టీపై చేస్తున్న ఆరో పణలు ఆపార్టీని అప్రదిష్టపాలు చేయడం కోసమేనని ఆయన నిర్ధారించారు.
ఈ వాస్తవాల నేపథ్యంలో చంద్ర బాబుకు బెయిల్ మంజూరు చేయాలని, ఆయనను కస్టడీలో కొనసా గించడం వల్ల ఏ ప్రయోజనం నెరవేరదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉండి కాటరాక్ట్ చికిత్సను పొంది విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వ వలసిందిగా కోర్టును అభ్యర్ధించారు. సిఐడి గొప్పగా చెప్పిన భాస్కర్‌ప్రసాద్ బెయిల్ తిరస్కరణ కేసులో కూడా సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిందని సిద్దార్ద్ లూద్రా కోర్టుకు నివేదించారు.