చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

50 రోజులైనా చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరు?

వ్యవస్థలను మేనేజ్‌ చేసి.. ఇన్ని రోజులుగా జైల్లో ఉంచారని లోకేష్‌ ఆగ్రహం

by చైతన్యరధం
October 29, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
50 రోజులైనా చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారమైనా చూపగలిగారా?
  • కంటిడాక్టర్‌ పై వత్తిడి తెచ్చి 24గంటల్లో రిపోర్టు మార్చేశారు
  • ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు… వారి పరీక్షలకు అంగీకరించం
  • అవినీతి చేసి, బాబాయిని చంపినోళ్లు బయట తిరుగుతున్నారు
  • ఏ తప్పూ చేయని చంద్రబాబును జైలులో పెట్టారు
  • చంద్రబాబును చంపేస్తామని బాహాటంగానే చెబుతున్నారు
  • బస్సు యాత్రపేరుతో గాలి తిరుగుడు… ప్రజా సమస్యలు గాలికి

 

 

రాజమహేంద్రవరం: చంద్రబాబునాయుడును జైలులో బంధించి 50రోజులైంది.. ఏ తప్పు చేయకపోయినా వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఆయనను ప్రజల మధ్యకు రాకుండా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో శనివారం చంద్రబాబునాయుడుతో ములాఖత్‌ అనంతరం యువనేత లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ… గతంలో రాజకీయ కక్షసాధింపు చూశాం, ఇప్పుడు వ్యక్తిగత కక్షసాధింపులు చూస్తున్నాం. వ్యక్తిగత కక్షతో జగన్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చంద్రబాబును చంపేస్తామని చెప్పడం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అనంతపురంలో వైసీపీ ఎంపీ మాట్లా డిరది చూశాం, జైలులోనే చనిపోతారని చెబుతున్నారు. కేసుకు ఎలాంటి సంబంధం లేని మా తల్లిని జైలుకు పంపుతామని మహిళామంత్రి ఒకరు బహిరంగంగానే చెప్పారు. వారి ప్రకటనలు చూశాక చంద్రబాబు భద్రతపై మాకు సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబు కు వ్యతిరేకంగా గత 50 రోజులుగా ఒక్క ఆధారమైనా ప్రభుత్వం బయటపెట్టిందా? ఇదంతా వ్యవస్థల మేనేజ్‌ మెంట్‌ గాక మరేమిటి? ప్రభుత్వం చంద్రబాబుని జైలులో ఉంచడానికి పదేసి కోట్లు లాయర్లకు ఖర్చు పెడుతోంది. ముకుల్‌ రోహత్గీతో వారం, వారం వాయి దాలు అడిగిస్తూ బెయిల్‌ రాకుండా జాప్యం చేస్తున్నారు,  ప్రభుత్వంలో పీపీలు, ఏజీపీలుగా పనిచేసిన వారు నేడు జగన్‌ కేసులు వింటున్నారు, మాకు సందేహాలు ఉన్నా యి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులోని నిందితుల్లో గరిష్టం గా ఒక వ్యక్తి మాత్రమే 38రోజులు రిమాండ్‌లో ఉన్నారు, మిగిలిన అందరికీ నెలరోజుల లోపే బెయిల్‌ వచ్చేసింది. ఏ ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడును 50 రోజులుగా రిమాండ్‌లో ఉంచడం వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ కాదా అని లోకేష్‌ ప్రశ్నించారు.

 

దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి!

ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్‌ చేస్తున్నాం, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. అన్నింటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 50 రోజులుగా మీరు పీకింది ఏమిటి? స్కిల్‌ డెవలప్‌ మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఒక కొత్త ఆధారమైనా బయటపెట్టారా? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ అజయ్‌ రెడ్డి అన్ని సెంటర్లు నడుస్తున్నాయని చెప్పారు. మొదటినుంచి మేం చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే చెబుతున్నాం. మా అకౌంట్లు కూడా ప్రజల ముందు పెట్టాం, 50 రోజులుగా ఏం పీకారని ప్రశ్నిస్తున్నాం. 15 ఏళ్లు సీఎంగా, 15ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని వ్యవస్థలను మేనేజ్‌ చేసి  జైలులో బంధించడం అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ప్రజల్లోకి వెళితే ఆమెను కూడా జైలుకు పంపాతామని అనడం వ్యక్తిగత కక్షసాధింపు కాకపోతే మరేమిటి? మా కుటుంబసభ్యు లెవరికీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌లో ఎలాంటి పాత్ర లేదు, చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదు.స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టులో 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చింది నిజం, 85వేల మందికి ఉద్యోగాలు వచ్చింది నిజం. ఫైబర్‌ గ్రిడ్‌లో 10లక్షల కనెక్షన్లు ఇచ్చింది నిజం. ఏటా వందకోట్ల టర్నోవర్‌ చేసే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటు నిజం. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఐటి రిటర్న్స్‌ స్క్రూటినీ జరగలేదు, మేం నిజాయితీగా ఉన్నామని లోకేష్‌ స్పష్టం చేశారు.

 

న్యాయపోరాటం కొనసాగిస్తాం

వ్యవస్థలను మేనేజ్‌ చేసే మా నాయకుడ్ని బంధిస్తే ఊరుకోం, న్యాయపోరాటం చేస్తాం. 17ఏ పై తీర్పు రిజర్వ్‌లో ఉంది. రాబోయే రెండువారాల్లో 17ఏపై జడ్జిమెంట్‌ వస్తుంది, అందు కోసం వేచిచూస్తున్నాం. వ్యవస్థలను మేనేజ్‌ చేశారు కనుకే చంద్రబాబు జైలులో ఉన్నారు. నేను సూటిగా అడుగుడున్నా, మేనేజ్‌ చేయక పోతే లక్షకోట్ల అవినీతి చేసిన జగన్‌ పదేళ్లుగా బెయిల్‌ పై ఎలా బయట ఉన్నారు, బాబాయి హత్యకేసులో అవి నాష్‌ ఎలా బయటతిరుగుతున్నారు,సీబీఐ అరెస్టు చేయ డానికి వస్తే ఎందుకు అడ్డుకున్నారు? తప్పులు చేసిన, అవినీతిని చేసిన వ్యక్తి రోడ్లపై హాయిగా తిరుగుతాడు, బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తి రోడ్లపై తిరుగుతా డు, మైనింగ్‌ దోచేసిన పాపాల పెద్దిరెడ్డి బయట ధైర్యం గా తిరుగుతారు, ఇదంతా వ్యవస్థలను మేనేజ్‌ చేయ డంగాక మరేమిటని లోకేష్‌ సూటిగా ప్రశ్నించారు.

 

కంటి డాక్టర్‌ రిపోర్టు ఎలా మారిపోయింది?

చంద్రబాబుకి నెలలోగా ఆపరేషన్‌ చేయాలని ఒక రిపోర్టులో ఉంది, అదే కంటి డాక్టర్‌ తొందరేం లేదని అన్నట్లుగా మరో రిపోర్టులో ఉంది. 24గంటల్లో కంటి డాక్టర్‌ ఎలా మనసు మార్చుకున్నారు? వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారనడానికి ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి? ఈ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం, పరీక్షల పేరుతో ఏం చేస్తుందోనన్న భయం మాలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఎన్‌ఎస్‌జి రక్షణలో ఉన్న ఒకే ఒక వ్యక్తి చంద్రబాబునాయుడు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు కేంద్రం ఆయనకు రక్షణ కల్పించింది. చంద్రబాబును చంపుతామని మావోయిస్టులు లేఖ రాశారు, జైలులో డ్రోన్లు ఎగురుతున్నాయి, గంజాయి సరఫరా జరుగుతోంది, ఇంత జరుగుతుంటే భద్రతపై సందేహం ఉండదా? డీఐజీ, డీజీ, హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, జైలులో చంద్రబాబుకి దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయి? దానికి సమాధానం చెప్పాలని లోకేష్‌ సవాల్‌ విసిరారు.

 

అంతా ప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జల నేతృత్వంలోనే!

ప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జల నాయకత్వంలోనే అంతా జరుగుతోంది. డీజీ, డీఐజీలతో సజ్జల ఎలా సమీక్ష చేస్తారు, అందుకే మేం చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో అధికారల కాల్‌ డేటా అడుగుతున్నాం, తప్పు చేయకపోతే కాల్‌ డేట్‌ ఇవ్వడానికి ఎందుకు భయం? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసిపోతుందని భయమా? చంద్రబాబు 6 కిలోలు బరువుతగ్గిన మాట వాస్తవం, 72 ఉండేవారు, 66కిలోలకు తగ్గారు, ఆయన రెగ్యులర్‌ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్న మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు నంద్యాలలో ప్రజల మధ్య భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఉంటే ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. జైలు అధికారులకు సైతం స్వేచ్ఛ ఉన్నట్లుగా కన్పించడం లేదు, మేం ములాఖత్‌ కు వెళ్లాక అక్కడి అధికారికి పదిసార్లు ఫోన్లు వచ్చాయి. ఈ ప్రభుత్వ పర్యవేక్షణలో మేం వైద్య పరీక్షలకు సిద్ధంగా లేము. మాకు నమ్మకం లేదు. సొంత బాబాయిని చంపినోడు, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేసినవాడు ఈ ముఖ్యమంత్రి. ఆయనను ఎలా నమ్ముతామని లోకేష్‌ ప్రశ్నించారు.

 

గాలియాత్రలు కాదు, ప్రజల గురించి ఆలోచించండి!

రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కరువు నెలకొంది, పంట ఎండిపోయింది, సీఎం ఒక్క సమీక్ష చేయరు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లరు. బస్సు యాత్ర అని గాలి తిరుగుడు తిరుగుతున్నారు. ప్రజలకోసం ఎందుకు ఆలోచించరు? మరోవైపు యువత ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నా రు. నిత్యావసర వస్తువుల ధరల గురించి పట్టించు కోరు. నిన్నగాక మొన్న వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై నడివీధిలో దాడిచేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. దళితులను చంపేస్తున్నారు, ఇవన్నీ ఎవరూ మాట్లాడకూడదు, వారు చెప్పినట్లు వింటేనే బతకనిస్తాం అనేలా ఉందని లోకేష్‌ దుయ్యబట్టారు.

 

ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు?

ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తారు? డాక్టర్‌ సుధాకర్‌ ను సస్పెండ్‌ చేసి, గుండెపోటు వచ్చేలా చేసింది ఎవరు? దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కొట్టి చంపిన అనంతబాబు.. జగన్‌ పక్కన కూర్చుంటున్నాడు, ఇదా దళితులకు చేసే న్యాయం? దళితులకు కోసం ఉద్దేశించిన 27 సంక్షేమ పథకాలు రద్దుచేయడమే సామాజిక న్యాయమా? వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మైనారిటీలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, పలమనేరులో మిస్బా అనే మైనారిటీ బాలికకు వైసీపీ నాయకుల ఒత్తిడి తో టీసీ ఇచ్చి పంపించడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇదేనా మైనారిటీలకు చేస్తున్న సామా.ఇక న్యాయం. బీసీ బాలుడు అమర్‌ నాథ్‌ గౌడ్‌.. తన అక్కను వేధిస్తున్నాడని వైసీపీ నేత కొడుకును అడిగినందుకు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు, ఇదేనా బీసీలకు చేస్తున్న న్యాయం? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడమే సామాజిక న్యాయమా? ఏసీ బస్సుల్లో తిరిగితే అన్యాయం న్యాయం కాదు. వైసీపీ అరాచకాల్లో నేను చెప్పింది 1శాతమే ఇంకా 99 శాతం ఉన్నాయి. అందుకే నల్లబెలూన్లతో నిరసన తెలుపుతున్నామని లోకేష్‌ స్పష్టం చేశారు.

ఇసుక అవినీతిపై త్వరలో సీవీసీకి లేఖ

జగన్‌ లా మేం పారిపోం, ఆయన ఏనాడైనా ప్రెస్‌ మీట్‌ పెట్టారా? వైసీపీ నాయకులు, జగన్‌, ఆయన బ్రోకర్లు, చుట్టుపక్కల ఉన్నవారు జగన్‌ అవినీతిపరుడు కాదని ఎప్పుడైనా చెప్పారా? పదేళ్లుగా బెయిల్‌ పై తిరిగే స్థాయిలో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల అవకతవకలపై ఈడీ, ఐటీలకు లేఖలు రాశాను. సీఏజీకి రాశాను, ఇసుకపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) కు లేఖ రాయబోతున్నాం. కేంద్రానికి కూడా రాస్తున్నాం. నెల్లూరులో అవినీతిని ప్రశ్నిస్తున్న వారి పార్టీ ఎమ్మెల్యేలనే ఈ ప్రభుత్వం బంధిస్తోంది. వారి పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి జరుగుతోందని చెబుతున్నారు. ఇంకేం ఆధారాలు కావాలి? స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లో సీఐడీ అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. నేను ఎక్కడికి పారిపోలేదు. సమాజానికి జగన్‌ ఏంచేశారు? చంద్రబాబు సైబరాబాద్‌ తయారుచేశారు. కియా, టీసీఎల్‌, హెచ్‌సీఎల్‌, ఫ్యాక్స్‌ కాన్‌, జోహో వంటి పరిశ్రమలు తెచ్చి లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారని లోకేష్‌ చెప్పారు.

Tags: అజయ్‌ రెడ్డిఅవినీతిఇసుక అవినీతికంటి డాక్టర్కియాగాలి యాత్రలుచంద్రబాబునాయుడుజగన్ రెడ్డిజోహోటీసీఎల్‌తిరుగుడుప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జలప్రజా సమస్యలుఫ్యాక్స్‌ కాన్‌బస్సుయాత్రబాబాయిని చంపారుబెయిల్‌ముకుల్‌ రోహత్గీరిపోర్టులోకేష్‌వ్యవస్థలు మేనేజ్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌హెచ్‌సీఎల్‌
Previous Post

జగన్‌ అరాచక, అసమర్థ పాలనకు రాష్ట్రంలో లక్షా 31 వేల మంది బలి

Next Post

ఇక క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
Next Post
ఇక క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరు

ఇక క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరు

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.