• మాచర్ల నియోజకవర్గం శ్రీచక్ర సిమెంటు ఫ్యాక్టరీ వద్ద కారంపూడి విద్యార్థులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కారంపూడి మండలంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలున్నాయి.
• మేము ఇంటర్, డిగ్రీ చదవాలంటే నరసరావుపేట, గుంటూరు వెళ్లి హాస్టళ్లలో ఉండి చదవాల్సి వస్తోంది.
• మావి వ్యవసాయం కూలీ కుంటుంబాలు కావడం వల్ల పెద్దమొత్తంలో ఖర్చు పెట్టడానికి ఆర్థికస్థోమత సరిపోవడం లేదు.
• బొల్లాపల్లి మండలానికి చెందిన 15 గ్రామాలు కారంపూడికి దగ్గరగా ఉన్నాయి.
• మీ ప్రభుత్వం వచ్చాక కారంపూడిలో ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయగలిగితే బలహీనవర్గాలకు మేలు చేసినవారవుతారు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు.
• గ్రామీణ ప్రాంతాల్లో పేదవిద్యార్థులకు గతంలో అమలుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారు.
• కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తాం… విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీకాలేజి అంశాన్ని పరిశీలిస్తాం.
• గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తాం.