వినుకొండ నియోజకవర్గం బొమ్మరాజుపల్లి మధ్యాహ్న విడిది కేంద్రం వద్ద సుగాలీ/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
సాగు, తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నాం. మీ ప్రభుత్వం వస్తే ఎటువంటి భరోసా కల్పిస్తారు.
36 తాండాలు ఉన్నాయి కానీ మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ , హాస్టల్, టీచర్లు లేరు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే స్థోమత మాకు లేదు.
ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్రతకడం కష్టం గా మారింది.
గిరిజనులు జీవనం కోసం భూములు ఇవ్వకపోగా గిరిజనుల చేతిలో ఉన్న భూములు జగన్ లాక్కుంటున్నాడు.
సేవాలాల్ మహారాజ్ జయంతి ని అధికారికంగా జరపాలి.
పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్న గిరిజన యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
బంజారా భవనాల ఏర్పాటు కి సాయం అందించాలి.
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాండా లకు దగ్గర గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కాక గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ను జగన్ ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది.
జగన్ పరిపాలన లో తాండా లకు తాగునీరు లేదు. నివాసం ఉండటానికి ఇళ్లు లేవు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం.
… వినుకొండ సుగాలీ/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం ప్రతినిధులు
లోకేష్ మాట్లాడుతూ
సేన్ రామ్ రామ్… జై సేవాలాల్ మహారాజ్
గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసింది టిడిపి.
స్వర్గీయ ఎన్టీఆర్ గారు గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఏ లు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు గారు గిరిజన తాండా ల రూపురేఖలు మార్చారు. సిసి రోడ్లు, తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్య కు శాశ్వతంగా పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మూడు ఏళ్ల లో వరికపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టిడిపి ది.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని జగన్ రద్దు చేసాడు.
జాతీయ విద్యా విధానం పేరుతో స్కూల్స్ మూసేస్తున్నాడు. టీచర్ల సంఖ్య తగ్గిస్తున్నాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.
మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకొని చంద్రబాబు గారు భవిష్యత్తు కి గ్యారంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు.
మహా శక్తి పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.1500 ఇస్తాం.
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.
ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం.
ఆర్టీసి బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
అరకు కాఫీ, తేనె తదితర అటవీ ఉత్పత్తులను ఎలా అయితే ప్రమోట్ చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించామో. అలానే మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.
ఈ ప్రాంతానికి ప్రత్యేక ఐటిడిఏ ఏర్పాటు చేస్తాం.
గిరిజనులను జగన్ మోసం చేశాడు.
500 కంటే ఎక్కువ జనాభా ఉన్న తాండా లను పంచాయతీలు గా గుర్తిస్తా అన్నాడు. చెయ్యలేదు.
45 ఏళ్లు నిండిన ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మాట తప్పాడు.
16 గిరిజన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు జగన్.
గత ప్రభుత్వాలు గిరిజనుల జీవనోపాధి కోసం ఇచ్చిన వ్యవసాయ భూముల్ని జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం.
వినుకొండ కి పరిశ్రమలు తీసుకొచ్చి గిరిజనులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.
బంజారా భవనాలు నిర్మిస్తాం.
సేవా లాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం అధికారికంగా జరుపుతాం.
తాండాల్లో నివసించే వారికి మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన మేర మందులు, డాక్టర్లను ఏర్పాటు చేస్తాం.
స్కూల్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ బ్రష్టు పట్టించాడు.
విద్యా దీవెన, వసతి దీవెన చెత్త పథకాలు. ఈ కార్యక్రమాల వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు. 2 లక్షల మందికి మార్క్ లిస్ట్, సర్టిఫికేట్లు రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం.
స్కిల్ డెవలప్మెంట్ ని చంపేశాడు జగన్. టిడిపి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు ప్రక్షాళన చేస్తాం. కాలేజ్ నుండి బయటకు వచ్చే సమయానికి జాబ్ రెడీ యూత్ ని సిద్దం చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిపోయిన తాండా లను పంచాయతీలు గుర్తించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇళ్లు నిర్మిస్తాం.
500 జనాభా ఉన్న తాండా లను పంచాయతీలుగా గుర్తించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి/ లంబాడీ/ బంజారా సామాజికవర్గం సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తాం.
రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది.
రూ.750 పెంచడానికి జగన్ కి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. మూడు వేలు పెన్షన్ అని వృద్ధులను మోసం చేసింది జగన్.
చంద్రన్న భీమా పథకాన్ని కూడా జగన్ నిర్వీర్యం చేసాడు.
సంక్షేమం, అభివృద్ది కి టిడిపి పుట్టినిల్లు. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. టిడిపి ని గెలిపించండి అభివృద్ది, సంక్షేమం మరింత ఎక్కువగా చేసే బాధ్యత నాది.
టిడిపి ఇంఛార్జ్ జీవి ఆంజనేయులు
టిడిపి హయాంలో గిరిజన తాండాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాం.
లోకేష్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిరిజన తాండాల అభివృద్ది కి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.