• వినుకొండ నియోజకవర్గం రాముడుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రాముడుపాలెం, పుచ్చనూతల పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం.
• ఫ్లోరైడ్ నీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాం.
• మా గ్రామంలో 300కుటుంబాలు నివసిస్తున్నాం.
• ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలి.
• మా ప్రాంతం మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం.
• వ్యవసాయం, కూలీపనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం.
• పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాభివృద్ధికి గ్రహణం పట్టింది.
• పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.9వేల కోట్లు జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
• పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా చిల్లిగవ్వ లేని దుస్థితి నెలకొంది.
• టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు వేశాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక రాముడుపాలెం గ్రామానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందిస్తాం.
• వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.