ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎర్రఒబునపల్లి క్యాంప్ సైట్ వద్ద కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్. అన్ని సామాజికవర్గాల ప్రజలతో మీటింగ్ పెట్టుకుంటున్న మీరు కమ్మ సామాజికవర్గం తో మీటింగ్ పెడతారా పెట్టరా అనే డౌట్ ఉండేది. కానీ మా సమస్యలు కూడా తెలుసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అమరావతి పై జగన్ కమ్మరావతి అని ప్రచారం చేసాడు. జగన్ కమ్మ కార్పొరేషన్ పెట్టాడే తప్ప నిధులు, విధులు లేవు. కమ్మ సామాజికవర్గంలో వెనుకబడిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారికి టిడిపి ప్రభుత్వం వస్తే ఎటువంటి సహాయం చేస్తారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 37 మంది కమ్మ డీస్పిలకు ప్రమోషన్లు ఇచ్చారు అని జగన్ ప్రచారం చేసాడు. మీరు ఎందుకు దానిని ధీటుగా ఎదుర్కోలేకపోయారు. కమ్మ సామాజికవర్గం వారిని గ్రామాల్లో టార్గెట్ చేసి మరీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కమ్మ సామాజికవర్గాన్ని మాత్రమే కాదు… ఎస్సీ, బిసి, మైనార్టీలు, ఎస్టీలు ఇలా అందరినీ జగన్ వేధిస్తున్నాడు. వ్యాపారాలు చేసుకునే కమ్మ సామాజికవర్గం ప్రతినిధులను జగన్ టార్గెట్ చేసి వేధిస్తున్నాడు.
… కనిగిరి కమ్మ సామాజికవర్గం ప్రతినిధులు
లోకేష్ మాట్లాడుతూ
టిడిపి అందరి పార్టీ కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరినీ అభివృద్ది చెయ్యడం టిడిపి లక్ష్యం. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ కి చంద్రబాబు గారిని, నన్ను ఒక్క రోజైనా జైలు లో పెట్టాలనే ఆశ ఉంది. జగన్ రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు. అలాంటి చిల్లర రాజకీయం ఎప్పుడూ చెయ్యదు. 160 రోజులుగా అన్ని సామాజికవర్గాల ప్రజలను కలిసాను. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వైశ్య, బలిజ, బ్రాహ్మణ, రెడ్డి ఇలా అన్ని సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి కష్టాలు తెలుసుకున్నాను. రెండే రెండు సామాజికవర్గాలతో ఇప్పటి వరకూ మీటింగ్ పెట్టుకోలేదు. ఒకటి కమ్మ, రెండు మార్వాడి. అందులో భాగంగానే కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో కనిగిరి లో సమావేశం ఏర్పాటు చేశాం. కనిగిరిలో వలసలు ఎక్కువ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కనిగిరి వాళ్లు కనపడతారు. ఏపి నంబర్ 1 గా ఉండాలి అనేది టిడిపి అజెండా. జగన్ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు.
చంద్రబాబు గారు ఏ రోజూ కులం, మతం, ప్రాంతం లేకుండా అభివృద్ది చేశారు. కులం పేరుతో రాజకీయం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్. ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసాడు. ఇతర రాష్ట్రాల అభివృద్ది లో దూసుకుపోతున్నాయి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. పరిపాలన ఒకే చోట…అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి అనేది టిడిపి విధానం. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది టిడిపి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా రాయలసీమ, ఐటి హబ్ గా విశాఖ ను అభివృద్ది చేసాం. ప్రకాశం కి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ తీసుకొచ్చాం. రాజధాని గురించి అసెంబ్లీ లో జరిగిన చర్చ లో జగన్ అన్ని ప్రాంతాలకు మధ్య లో ఉండాలి, 30 వేల ఎకరాలు ఉండాలి అని మాట్లాడాడు. అమరావతి కి మద్దతు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చాడు, మడమ తిప్పాడు. మూడు రాజధానులు అంటూ విశాఖ ని క్రైం క్యాపిటల్ గా మార్చేశాడు. వైసిపి ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. కర్నూలు లో ఒక్క ఇటుక పెట్టలేదు.
అమరావతి కి భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ ఎస్సీలు ఉన్నారు. 4 ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో అమరావతి విస్తరించి ఉంది. కేవలం కుట్ర తోనే అక్కడ కమ్మ సామాజికవర్గం వారు మాత్రమే ఉన్నారు అని జగన్ ప్రచారం చేసాడు. అమర్ రాజా లాంటి కంపెనీలను జగన్ హిట్లర్ ని ఆదర్శంగా తీసుకున్నాడు. హిట్లర్ జ్యుస్ ని టార్గెట్ చేసినట్టు జగన్ కమ్మ సామాజికవర్గానికి టార్గెట్ చేసాడు. ఒక సామాజికవర్గానికి బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు ఏనాడూ ఒక కులాన్ని దూషించలేదు. పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. కానీ జగన్ నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం నిధులు కేటయించి కమ్మ సామాజికవర్గంలో ఉన్న పేదలను ఆదుకుంటాం. జగన్ గల్లీ నుండి ఢిల్లీ వరకూ టిడిపి హయాంలో 37 మందిలో 35 మంది కమ్మ సామాజికవర్గం వారికి ప్రమోషన్లు ఇచ్చారని అసత్య ప్రచారం చేసాడు.
గవర్నర్ కి, రాష్ట్రపతి కి అబద్ధాలు చెప్పిన వ్యక్తి జగన్. 37 మందిలో కేవలం ప్రమోషన్లు పొందింది కేవలం 5 గురు కమ్మ సామాజికవర్గం వారు మాత్రమే. మిగిలిన వాళ్లలో ఎక్కువ ఎస్సీ, బిసి సామాజికవర్గంకి చెందిన వారే ఉన్నారు. అన్ని సామాజికవర్గాల వారిని జగన్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆఖరికి పోలీసులు అత్మహాత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు రాముడు, రాజనీతి పాటిస్తారు. అందుకే అనేక అసత్య ఆరోపణలు చేసినా కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు.