కనిగిరి నియోజకవర్గం పెదఅలవలపాడు క్యాంప్ సైట్ వద్ద వలస కార్మికులు, గ్రామస్తులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.
జాబ్ క్యాలెండర్ అని జగన్ ప్రభుత్వం మోసం చేసింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మీరు ఎటువంటి భరోసా ఇస్తారు?
సాగు నీరు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నాం. సాగు, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నాం.
కనిగిరి లో సరైన స్కూల్స్, కాలేజీలు లేక ఇబ్బంది పడుతున్నాం.
బత్తాయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. రైతులను ఆదుకోవాలి.
జగన్ పాలన లో కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు ఇవ్వక దెబ్బతిన్నాం. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నాం.
చిరు వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నారు.
…కనిగిరి నియోజకవర్గం వలస కార్మికులు
లోకేష్ మాట్లాడుతూ
కనిగిరి లో వలసలు ఆపడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం
సాగు, తాగు నీరు అందించి వలసలకు చెక్ పెడతాం
ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా… పరదాలు కట్టుకొని తిరగాలి అనే కోరిక నాకు లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొస్తాం
అభివృద్ది, సంక్షేమం సైకిల్ కి రెండు చక్రాలు.
సైకో పాలన పోతేనే రాష్ట్రానికి పెట్టుబడులు
కనిగిరి ని శస్యశ్యామలం చెయ్యడం నా లక్ష్యం.
మంత్రాలయం లో చిన్న వ్యాన్ లో గుంటూరు, తెలంగాణ లో పనులు కోసం వెళ్తున్న వలస కూలీల కష్టాలు నేరుగా చూసాను. చిన్న పిల్లలతో వారంతా వలసలు వెళ్ళడం చూసి బాధపడ్డాను.
కనిగిరి నియోజకవర్గం లో వలసలు ఎక్కువ.
ఎక్కడికి వెళ్ళినా కనిగిరి వాళ్లు ఉంటారు.
నియోజకవర్గంలో 20 నుండి 30 శాతం మంది ప్రజలు పనుల కోసం ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు.
ఫ్లోరైడ్ సమస్య వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం.
ప్రకాశం జిల్లా కి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ తీసుకొస్తే జగన్ తరిమేశాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి కి సహకారం అందిస్తాం.
టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వమే ప్రకటించింది.
జగన్ అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు.
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు, డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నిరుద్యోగులను జగన్ మోసం చేసాడు.
పాదయాత్ర లో కియా అనుబంధ సంస్థ లో పనిచేస్తున్న పద్మావతి నన్ను కలిసినప్పుడు నాకు ఎంతో ఆనందం వచ్చింది. గతంలో ఇంట్లో ఉండి ఇళ్లు చూసుకునే దానిని. ఇప్పుడు నా జీతం రూ. 30 వేలు అని చెప్పింది.
ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తాం.
హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.
రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
అరటి, మామిడి, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, బత్తాయి లో అనేక కొత్త రకాల మొక్కలు, అధిక దిగుబడి వచ్చే వెరైటీలు రీసెర్చ్ సెంటర్ ద్వారా అభివృద్ది చేస్తాం.
ఇన్పుట్ సబ్సిడీ, సూక్ష్మ పోషకాలు, రైతు రథాలు, ఇతర యంత్రాలు గతంలో సబ్సిడీలు ఇచ్చే వాళ్ళం. ఇప్పుడు జగన్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసాడు.
యువత ను వ్యవసాయం వైపు ప్రోత్సహించే విధంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తాం.
విద్య దీవెన, వసతి దీవెన చెత్త పథకాలు. ఈ కొత్త విధానం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఫీజులు చెల్లించక కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.
పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకాలను మళ్ళీ ప్రారంభిస్తాం.
జగన్ ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. కానీ ఆయన విదేశీ విద్య పథకం రద్దు చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు విదేశాల్లో చదవకూడదా?
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం.
జిల్లా లను అశాస్త్రీయం గా విడదీశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన తప్పులు సరిదిద్ది అవసరమైన మేర యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం.
రాజకీయ కక్షలతో బిల్లులు ఆపడం కరక్ట్ కాదు. ప్రభుత్వం మారినప్పుడు బకాయిలు తిర్చమంటే పనులు చెయ్యడానికి ఎవరూ ముందుకు రారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలు అన్ని వడ్డీ తో సహా చెల్లిస్తాం.
జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను వేధిస్తుంది. చెత్త పన్ను, బోర్డు పన్ను, కరెంట్ బిల్లు లు పెంచి వేధించారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చిరు వ్యాపారస్తుల పై పెంచిన పన్నులు తగ్గిస్తాం. వేధింపులు లేకుండా చేస్తాం.
కియా, అమర్ రాజా లాంటి సంస్థలను కూడా జగన్ ప్రభుత్వం వేధించింది.
ఇంఛార్జ్ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలసలు ఎక్కువ అయ్యాయి.
వలసల నివారణ కోసం టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.