• కొండపి అసెంబ్లీ నియోజకవర్గం చెరువుకొమ్ముపాలెంలో పొగాకు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మాది మెట్ట ప్రాంతమైన పొగాకు, కంది, మినుము వంటి మెట్ట పంటలపైనే ఆధారపడుతున్నాము.
• గత 20ఏళ్లుగా పొగాకు బ్యార్లకు కొత్తగా లైసెన్సులు మంజూరు చేయడం లేదు.
• పొగాకు పండించే రైతులకు కొత్త బ్యారన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలి.
• మాది మెట్ట ప్రాంతమైనందున పనుల్లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చాక మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఆదుకోండి.
• భోగనంపాడు గ్రామపంచాయితీ పరిధిలోని సర్వే నెం.423లో 600 ఎకరాల గయాళా భూములు రైతులు సాగుచేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక పట్టాలు ఇప్పించండి.
• చెరువుకొమ్ముపాలెంలో గత ప్రభుత్వంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేశారు, ప్రస్తుతం ఆ స్కీమ్ మూతపడింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ను పునరుద్దరించాలి.
• పాలేటిపల్లి రిజర్వాయర్ ద్వారా మా ప్రాంతానికి కెనాల్ ద్వారా నీటి సౌకర్యం కల్పించండి.
• భోగనంపాడు పంచాయితీ పరిధిలో వైసిపి ప్రభుత్వం పేదలకు వాగుపోరంబోకు, చెరువుతొట్లు, వంకల్లో నిరుపయోగమైన స్థలాలు ఇవ్వడంతో ఎవరూ ఇళ్లు కట్టలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక ఆవాసయోగ్యమైన స్థలాలు కేటాయించండి.
• కొంతమందికి రాజకీయ కారణాలతో పించన్లు నిలిపివేశారు, వాటిని పునరుద్దరించండి.
• వ్యవసాయదారులకు ఈ ప్రభుత్వం వచ్చాక సబ్సిడీ పనిముట్లను నిలిపివేశారు, వాటిని కొనసాగించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
• గత నాలుగేళ్ల వైసిపిపాలనలో దేశం మొత్తమ్మీద ఎపి రైతులను అప్పుల్లో మొదటిస్థానంలో నిలిపారు.
• రైతుల ఆత్మహత్యల్లో 3వస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానానికి చేర్చారు.
• జగన్ నేతృత్వంలో దివాలాకోరు ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక మూలనపెట్టింది.
• పొగాకు రైతులకు బ్యార్లన్ల మంజూరుపై టుబాకో బోర్డు అధికారులతో చర్చించి, రైతులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం.
• దీర్ఘకాలంగా గయాళా భూములను సాగుచేసిన వారికి పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
• పేదలకు ఆవాసయోగ్యమైన స్థలాలు కేటాయించి, పక్కాఇళ్లు నిర్మించి ఇస్తాం.
• కొండపి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి, వలసలను నివారిస్తాం.