టిడిపి హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి జరిగింది అని వెంకటగిరి బహిరంగ సభలో నారా లోకేష్ అన్నాడు . రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సిసి రోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. టిడిపి హయాంలో ప్రారంభించిన ఆల్తూరుపాడు రిజర్వాయర్ ని జగన్ ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసి సాగు,తాగు నీరు అందిస్తాం. సోమశిల హై లెవల్ కెనాల్ పూర్తిచేస్తాం.
పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు. నూలు, కలర్ ఇతర సబ్సిడీలు అందిస్తాం. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతను నేను దత్తత తీసుకుంటాను. మీ సంక్షేమం నా బాధ్యత. నిమ్మ, బెంగాల్ గ్రామ్, మినుము, పత్తి, వరి, హార్టీ కల్చర్ రైతుల సమస్యలు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలిపెట్టను. వెంకటగిరి లో ఉన్నా ఉగాండా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా. వైసిపి నాయకుల భూ అక్రమాల పై సిట్ వేసి ఆ భూములు వెనక్కి తీసుకోని పేదలకు పంచుతాం.