టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటుచేసి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో సందర్భంగా బుధవారం కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో మంచినీటి సమస్య ఉంది. గ్రామంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి.
ఇళ్ల ముందు సొంతగా రోడ్లు మరమ్మతు చేసుకుందామన్న గ్రావెల్ సమస్య తీవ్రంగా ఉంది.
ఎస్సీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మా గ్రామ సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి పంచాయితీల నిధులు దారిమళ్లించి గ్రామసీమలను నిర్వీర్యం చేశారు.
గ్రామ పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు కూడా నిధులులేవు.
టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.