టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. పులికనుమ ద్వారా రైతులకు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం మంత్రాలయం నియోజకవర్గం పీకలబెట్ట గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. జుమ్మాలదిన్నె చెరువునుంచి పైపులైను ద్వారా నీళ్ల స్టోరేజ్ ట్యాంకుకు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. పులికనుమ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని వారు కోరారు. వారి సమస్య్లపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని విమర్శించారు.