అధికారంలోకి వచ్చాక కర్నూలుకు పరిశ్రమలు తెస్తాం
ఉద్యోగావకాశాలు కల్పించి వలసలను నివారిస్తాం
ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం
100వరోజు పాదయాత్రలో యువత మేనిఫెస్టో ప్రకటిస్తాం
మరోసారి జగన్ సిఎం అయితే రాష్ట్రం బీహారే!
యువతతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ వరకు ఉన్న సబ్జెక్టులను మారుస్తాం, విద్యారంగాన్ని ప్రక్షళన చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగలు వచ్చేలా సిలబస్ ను మారుస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ ను పునరుద్ధరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తాం. వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ రద్దు వల్ల ఫీజులు కట్టలేక కోర్సు పూర్తిచేసి, కాలేజీలోనే సర్టిఫికెట్లు వదిలేసిన విద్యార్థులకు టిడిపి అధికారంలోకి వచ్చాక కాలేజీలకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఫీజులు కట్టి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని వెల్లడించారు.
జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఏపీని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడని విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గం నాగలాపురం లో యువతతో ముఖా ముఖి సమావేశం లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదు. యువత ప్రశ్నిస్తారనే భయంతో పరదాల చాటున, పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నాడన్నారు.
100వరోజు యువత మేనిఫెస్టో ప్రకటిస్తాం
నా పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్లకు నేను ఓ హామీ ఇస్తున్నా. నా పాదయాత్ర 100వ రోజు యువతకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నాం అని లోకేష్ ప్రకటించారు. చంద్రబాబు ఉద్యోగాలు కల్పించేదానిపై దృష్టి పెడతారు. జగన్ కమీషన్లు, వాటాల కోసం ఆశపడతాడు. చంద్రబాబు పాలనలో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి. జగన్ వచ్చాక 100కు పైగా పరిశ్రమలు రాష్ట్రం నుండి పారిపోయాయి. ఏపీ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పాలనలోనే జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది. హైదరాబాద్ లో చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల నేడు ఐటీ హబ్ గా వెలుగొందుతోంది. జగన్ మరోసారి గెలిస్తే దక్షిణభారత దేశ బీహార్ గా ఏపీ మారుతుంది. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దోచుకునే పనిలోనే ఉన్నాడు జగన్.
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఓటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరు గెలిస్తే మీకు భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీఎస్టీ కలెక్షన్ లో మనం ఒరిస్సా కంటే వెనుకబడి ఉన్నాం. దీనికి కారణం సైకో జగన్. వైసీపీ ఐదేళ్ల పాలనలో మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మరోమారరు వైసీపీ మాయమాటలు వింటే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని లోకేష్ చెప్పారు.
కర్నూలుకు పరిశ్రమలు తెస్తాం
ఉమ్మడి కర్నూలు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తాం. కర్నూలు నుండి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే విధానానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కు వెళ్లకుండా ఏపీలోనే ఉద్యోగాలు చేసేలా ఐటీ కంపెనీలను తెస్తాం. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం. యువతకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహిళల భద్రతకు కావాల్సిన చర్యలు చేపడతాం.
చిన్న నాటి నుండే పాఠశాలల్లో మహిళల పట్ల గౌరవం, మర్యాద అలవడేలా పాఠ్యాంశాలు రూపొందిస్తాం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణమే శరణమనేలా చట్టాలను కఠిన తరం చేస్తాం అని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు. దిశ చట్టం లేకుండానే పోలీసు స్టేషన్లు, వాహనాలు తిప్పుతున్నారు. యాప్ తో మహిళల కళ్లు కప్పుతున్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారు దర్జాగా బెయిల్ పై వచ్చి రోడ్లపై తిరుగుతున్నారుఅని ఆరోపించారు.
కటింగ్ మాస్టర్ జగన్
విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని జగన్ రెడ్డి కట్ చేశాడు. జగన్ ఓ కటింగ్ మాస్టర్ అని లోకేష్ విమర్శించారు. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీవిద్య, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ పథకాలను కూడా కట్ చేశాడు. కటింగ్ మాస్టర్ జగన్ మెగా డీఎస్సీ హామీని కూడా కట్ చేశాడు. 2019 ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ రెడ్డి గాలికొదిలేశాడు. పాఠశాలలను మెర్జ్ చేసి, ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు లేవని చెప్పాడు. మేం అధికారంలోకి వచ్చాక విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తాం. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం.
ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం. గత ప్రభుత్వంలో అన్ని జిల్లాలను సమాంతంరంగా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణను తెలుగుదేశం ప్రభుత్వంలో చేసి చూపించాం గతంలో కర్నూలుకు మేం మెగాసీడ్ పార్క్ తెస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని తరిమేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కు జైలు తప్ప అభివృద్ధి తెలీదు
జగన్ రెడ్డికి జైలు బతుకు తప్ప అభివృద్ధి తెలియదు. నేడు మళ్లీ వాళ్ల కుటుంబం చంచల్ గూడ జైలుకు వెళ్లే పనిలో బిజీగా వున్నారని లోకేష్ చెప్పారు. ఏ కార్పొరేషన్ కు జగన్ నిధులు ఇవ్వలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించలేదు. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి యేటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూపు పరీక్షలన్నీ నిర్వహిస్తాం. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. మేం గతంలో ఐటీఐ కాలేజీ తెస్తే, ప్రస్తుత ప్రభుత్వం కనీసం సిబ్బందిని ఇచ్చే పరిస్థితి లేదు. మేం అధికారంలోకి ఐటీఐ కాలేజీ ఏర్పాటుచేస్తాం. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. జగన్ పాలనలో యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. యువత భవిష్యత్ కోసమే నేను యువగళం పాదయాత్ర ప్రారంభించినట్టు తెలిపారు.
యువత హక్కుల కోసం పోరాడాలి
యువత తమ హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలి అని లోకేష్ పిలుపునిచ్చారు. నా పాదయాత్రలో కూడా ప్రభుత్వం నాపై అనేక విధాలుగా నిర్బంధాలు విధించడం ప్రారంభమైంది. అయినా నా పోరాటం ఆగలేదు. చివరకు ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. సైకో నుండి మనకు స్వాతంత్ర్యం రావాలి. దానికోసం మనం పోరాడాలి. జగనోరా వైరస్ కు మన ఓటే వ్యాక్సిన్. విద్యార్థులు, యువత ఒక్కటై టీడీపీని గెలిపించాలి. కార్పొరేషన్ల ద్వారా ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వలేదు. అలాగే ఇన్నోవా, జేసీబీ, ఆటోలు ఏమీ ఇవ్వలేదు. పరిశ్రమల శాఖ మంత్రి ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. పరిశ్రమల గురించి ప్రశ్నిస్తే కోడి-గుడ్డు అంటూ కాలాక్షేపం చేస్తున్నాడు. జగన్ హయాంలో స్టడీ సర్కిళ్లను కూడా రద్దు చేశాడు. చంద్రబాబు పాలనలో యువతకు అవకాశాలు కల్పించాలని భావించి అనేక పథకాలు అమలు చేశారు.మేం అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరిస్తాం అని వెల్లడించారు.
నెలకో తేదీ చెప్పి మోసగిస్తున్నాడు
మన రాష్ట్రానికి గత నాలుగేళ్లుగా రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్. నెలకొక తారీఖు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో నాలుగేళ్లలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీని నిర్మించారు. రాజధానిలో ఉద్యోగుల భవనాలను దాదాపు పూర్తిచేశారు. జగన్అ ధికారం లోకి వచ్చాక రాజధాని ఎక్కడో ఎవరికీ తెలియదు. ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. మేం నిర్మించిన రోడ్లపైనే జగన్ తిరుగుతున్నాడు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. కనీసం ఒక్క ఇటుకైనా వేశారా? అమరావతి, వైజాగ్ లలో దోచుకోవడం తప్ప, రాజధాని నిర్మాణాలు ఎక్కడా లేవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వస్తే మన రాజధాని అమరావతిగా ముందుకు దూసుకుపోతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చాలా చరిత్ర ఉంది.
సిద్ధార్థ ప్రైవేటు మెడికల్ కాలేజీని ఎన్టీఆర్ కష్టపడి ప్రభుత్వ రంగంలోకి తెచ్చారు. ఆ యూనివర్శిటీకి ఎన్టీఆర్ అని చంద్రబాబు పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేరు మార్చడం వల్ల దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మేం అధికారంలోకి వచ్చాక డాక్టర్.ఎన్టీఆర్ వర్శిటీ పేరును పునరుద్ధరిస్తాం. స్టిక్కర్ల మోహన్ పేర్లకు స్టిక్కర్లు వేయడం తప్ప, ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు. అబ్ధుల్ కలా వ్యూ పాయింట్ కు జగన్ మార్చిన పేరును రద్దు చేసి పాత పేరునే పునరుద్ధరిస్తాం అని ప్రకటించారు.
యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
మల్లిఖార్జున్: ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు. ఫీజులు కట్టమని మేనేజ్ మెంట్ ఒత్తిడి చేస్తున్నారు. చేతి డబ్బులే కడుతున్నాను. మీరు వచ్చాక మాకు రీఎంబర్స్ మెంట్ ఇచ్చి ఆదుకోండి.
ముంతాజ్, ఆదోని: వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ ఇస్తానని మోసం చేసింది. మీరు వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటించండి.రామరాజు, కర్నూలు: నేను గ్రూప్-2 కు గత నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. కానీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. మీరు వచ్చాక నోటిఫికేషన్ ఇవ్వండి.
గణేష్: ఆదోనిలో ఐటీఐ కాలేజీ లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కాలేజీ ఏర్పాటు చేయండి.
హారిక: దిశ చట్టం, యాప్ వల్ల ఎక్కడా ప్రయోజనం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు భద్రత కల్పించండి.
సురేష్: జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఆదోని నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా గ్రామంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రవాణా, హాస్టల్ వసతులు ఏర్పాటు చేయండి.
అక్షితరెడ్డి, ఆదోని: నా ఇంటర్ పూర్తయ్యింది. మాకు డిగ్రీ కాలేజి లేదు. మేం పై చదువులు చదవాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఉచిత విద్య అందే పరిస్థితి లేదు.
దినేష్, బీటెక్, ఆదోని: స్టార్టప్ కంపెనీలు పెట్టేందుకు వైసీపీ నుండి ప్రోత్సాహం లేదు. మీరు వచ్చాక ప్రోత్సాహకాలు అందించండి
నాగరాజు: నేను మెడికల్ కోడర్ జాబ్ చేస్తున్నాను. రాష్ట్రంలో మెడికల్ కోడింగ్ విధానం తక్కువగా ఉంది. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక అవకాశాలు కల్పించండి.
మధు: విశాఖలో అబ్ధుల్ కలాం వ్యూ పాయింట్ కు వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు కూడా మార్చారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోండి.