సంపద సృష్టించి సమంగా పంచాలన్నదే నా ఆలోచన
ఆర్ధిక అసమానలతల తొలగింపు కు ప్రత్యేక పాలసీలకు రూపకల్పన
ఎప్పుడూ నిత్యనూతనంగా ఆలోచిస్తాను
మార్గాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశం
పేద ప్రజలను కోటీశ్వరును చేయడమే తన సంకల్పం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం చంద్రబాబు నాయడు మార్కాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఒక ఐడియాలజీ కాన్సెప్ట్ ను విడుదల చేశారు. రెండు అంశాలపై సంకల్పం తీసుకుంటున్నట్లు ఆయన సభలో ప్రకటించారు.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నంబర్ 1 స్థానంలో నిలవాలన్నది నా తొలిసంకల్పం అని చంద్రబాబు నాయడు చెప్పారు. దాని కోసం పని చేస్తానన్నారు. తెలుగు ప్రజల్లో ఉండే పేద వర్గాల వారు కోటీశ్వరులు కావాలన్నది నా రెండోసంకల్పం అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనుభవం, విజన్, టెక్నాలజీ వాడుకోవడం, సంపన్నులు తోటి వారికి సాయం చేయడం, ప్రజల మద్దతుతో ఈ కలను సాకారం చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు వేదికపై సాదారణ మహిళలు, పిల్లలతో కలిసి విడుదలచేశారు.
పేదవాడికి అండగా, నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే నా సంకల్పం. నేను చేసే పనులు, నా ఆలోచనలు నాకోసం కాదు. ప్రజల బాగు, వారి భవిష్యత్ కోసమే. విజన్ 2020 వల్లనే హైదరాబాద్ నగరం నేడు ధనికులు ఎక్కువగా ఉన్ననగరాల్లో ప్రపంచంలో 65వస్థానానికి వచ్చింది? అని చంద్రబాబు అన్నారు. పేదలు కోటీశ్వరులు కాకూడదా? జగన్ ఒక్కడే కోటీశ్వరుడు కావాలా? వైసీపీ దొంగలు చెప్పే మాయమాటలు నమ్ముతారా? సంపదసృష్టించి, దాన్ని అందరికీ సమానంగా పంచాలన్న నా ఆలోచనలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.
గతంలో జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా సొంత గ్రామాలను అభివృద్ది చేసుకున్నామని, ఇప్పుడు ప్రణాళికా బద్దంగా పనిచేయడం ద్వారా ప్రజల జీవితాలను సమూలంగా మార్చవచ్చు అని చెప్పారు. సంపన్నులు తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి మెంటార్ గా నిలవడం ద్వారా, తగు సాయం చేయడం ద్వారా వారిని ధనికులుగా మార్చి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మించేందుకు తాను పనిచేస్తానని, దీని కోసం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక పాలసీలు రూపొందిస్తాను అని చంద్రబాబు చెప్పారు.
విజన్ 2020 అని చెప్పిన సమయంలో దాన్ని అంతా హేళన చేశారని, కానీ కళ్ల ముందు ఆ ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నారు. అదే విధంగా ఒక ఐడియాలజీతో, ప్రణాళికతో పనిచేయడం ద్వారా పేదలను ధనికులను చేస్తాను అని చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా కుటుంబం ఒక యూనిట్ గా తీసుకుని వారి జీవితాల్లోమార్పులు తెస్తాము అని ప్రకటించారు. దేశ విదేశాల్లో ఉన్న వారు తమ వారిని పైకి తెచ్చేందుకు తమ వంతు సాయం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పరంగా తాను చేసేది చేస్తాము అని చెప్పారు. తాను తీసుకున్న సంకల్పం నెరవేర్చేందుకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
మహిళలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు తన మనోభావాలు పంచుకున్నారు. మహిళలు తెలివితేటలు, పట్టుదల, పనితీరులో మగవారికి ఏమాత్రం తీసిపోరు, వారుకూడా మగవారితో సమానంగా ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉండాలనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశాను. ఐటీరంగంలో యువతులు యువకులతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఆనాడు తాను నాటిన మొక్క నేడుమహావృక్షమై, ఐటీఫలాలను ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచంలోని తెలుగువారు అందరూ ఈ గడ్డ రుణం తీర్చు కోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. మీతోపాటు, సమాజం, రాష్ట్రం బాగుకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాల ని అక్కచెల్లెమ్మలను కోరుతున్నాను. మీరుచెప్పే వాటిపై ఆలోచించి, సరికొత్తగా ఆలోచన చేస్తానాన్నారు.
కష్టాలు, బాధలు అధిగమిస్తూ అందరితో సమానంగా పైకిరావాలని, తనకుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని భావించే మహిళలకు తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుం ది. డ్రైవర్ కుటుంబానికి ఈప్రభుత్వం అమ్మఒడి నిలిపేసింది. కుటుంబపోషణకోసం అప్పుచేసి కారుకొంటే, అది ఉందని ప్రభుత్వ పథకాలు ఆపేస్తారా? అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు పరిస్థితి ఎలాఉండేదో, ఆ మహానుభావుడు వచ్చాక రాజకీయాలు ఎలా మారాయో అందరూ తెలుసుకోవాలి. పేదలు పస్తు ఉండకూడదనే కిలోబియ్యం రూ.2లకు అందించిన గొప్పవాడు ఎన్టీఆర్. పక్కా ఇళ్లనిర్మాణం, పేదలకు జనతావస్త్రాలు, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి అందించిన సంస్కరణవాది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థికసంస్కరణలు అమలుచేస్తే జాతికి మేలు జరుగుతుందని భావించి, నేను వచ్చాక రాష్ట్రస్థాయిలో వాటిని అమలుచేశానని చెప్పారు.
ప్రపంచంలోనే ఎక్కువజనాభా ఉన్న భారతదేశంలో 1998 టైమ్ లో మంచిరోడ్లు లేవని నాటి ప్రధాని వాజ్ పేయ్ గారికి చెప్పాను. డబ్బులేకుండా రోడ్లు ఎలా వేస్తారని ఆయన అన్నారు. ప్రజలే రోడ్లు వేయించుకుంటారు, ప్రభుత్వం తరుపున ఎంత ఇస్తారో ఇవ్వండి అని చెప్పి, దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, ప్రధాన పట్టణాలను అనుసంధానిం చేలా పెద్దరోడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా చేశాను. అది సంస్కరణల ఫలితమే అని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో అనేక సంస్కరణలకు నాందిపలికాను. హైటెక్ సిటీ నిర్మించి సైబరాబాద్ నగరావిష్కరణకు బీజంవేశాను. డబ్బులు లేవంటే 5 వేలఎకరాలు సేక రించి, ప్రైవేట్ వారికి అప్పగిస్తే, దేశం గర్వించే విమానాశ్రయం ఆ నగరం సొంతమైంది. జీనోమ్ వ్యాలీని ఏర్పాటుచేశాను. దానినుంచే ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ తయారైంది. 167 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేయించాము. జంటనగరాల్లోని రోడ్ల ను వెడల్పు చేయించాను.
సాంకేతిక విప్లవంలో భాగంగా తాను సెల్ ఫోన్ గురించి చెబితే అందరూ నవ్వారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఒక్కరైనా ఉన్నారా? భార్యలేకపోయినా ఉండగలరేమో గానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేరు. సెల్ ఫోన్ తోనే అన్నిపనులు చక్కబెట్టుకుంటు న్నారు. ఇక్కడే ఉండి మీఇంట్లోని ఏసీని ఫోన్ తోనే ఆఫ్ చేస్తున్నారు. ఐటీ సాంకేతిక తను అన్నివర్గాలకు చేరువచేశాను అని వివరించారు. పుట్టుకతో అందరూ సాధారణ మనుషులే. సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అసాధారణ స్థాయికి ఎదిగారంటే ఆయన పడినకష్టం. ఆయన పట్టుదల. కృషే. విజయవాడలో పాలు అమ్ముతూ, తనకుటుంబాన్ని పోషించుకున్నారు.
పాలుఅమ్ము తూనే చదువుకున్నారు. అలాంటి వ్యక్తి సినీరంగంలో, రాజకీయాల్లో చరిత్ర గర్వించేలా ఎదిగారు. మనఅందరి గుండెల్లో దైవంలా కొలువయ్యారు అని చంద్రబాబు చెప్పారు. ఈనెలలోనే ఎందరో మహానుభావులు పుట్టారు. అంబేద్కర్ మహానుభావుడు అడుగడుగునా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు కాబట్టే, దేశానికే ఆదర్శంగా నిలిచారు.
బాబూ జగజ్జీవన్ రామ్ పుట్టింది కూడా ఈనెలలోనే. సాధారణ కుటుంబం లో పుట్టి దేశం గర్వించే నాయకుడయ్యారు. ఎస్సీఎస్టీల సంక్షేమానికి పాటుపడ్డారు. మహాత్మాజ్యోతిరావు పూలే గొప్ప సంస్కరణ వాదిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. చరిత్రలో ఆయన స్థానం చాలా ప్రత్యేకం. వెనుకబడిన వర్గాలకోసం ఎంతో శ్రమించారు అని తెలిపారు.
జీవితాల్లో మార్పుకో శ్రమిస్తా
నేను కూడా చాలాపేద కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పుడు నడిచివెళ్లే ప్రాథమిక విద్యను పూర్తిచేశాను. వాగులు, వంకలు దాటివెళ్లి హైస్కూలు చదువు పూర్తిచేశాను. వ్యవసాయకుటుంబంలో పుట్టిన నేను ఇన్నిసంస్కరణలు చేస్తానని అనుకోలేదు. మీ జీవితాల్లో మార్పులు తేవడంకోసం ఎప్పుడూ నిత్య నూతనంగా ఆలోచిస్తుంటాను అని చంద్రబాబు ప్రకటించారు. రాజకీయాల్లో ఉండే నేను ఆలోచించాల్సింది నానిర్ణయాలు, పరిపాలన, దూరదృష్టి తో ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అని. ప్రభుత్వ పాలసీలు అనేవి చాలాబలమైనవి. నాకు ఎందుకు అనుకొని మాములుగా అధికారం అమలుచేసి ఉంటే, హైదరాబాద్ కూడా సాదాసీదా నగరంగానే ఉండేదన్నారు. 2020 నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో ఆలోచించాను. ఆనాడు నాఆలోచన తప్పుపట్టిన వారే ఇప్పుడు సిగ్గుపడుతున్నారు.
ఎన్నిచేసినా 2004లో నేనుఓడి పోయాను. అలానే 2019లో ఓడిపోయాను. ఓటమితో బాధలేదు. కానీ నేనుచేసిన పని, నాఆలోచనల నుంచి పుట్టినవి కళ్లముందు కనిపిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేను. ఐటీని తీసుకొచ్చాను కాబట్టే నేడుప్రపంచంలో తెలుగువారు గొప్ప స్థానాల్లో వున్నారని చెప్పారు. కోటి 20లక్షలమంది ఉన్న జ్యూయిష్ లను (ఇజ్రాయెలీస్) హిట్లర్ చాలా ఇబ్బందులు పెట్టాడు. వారు బాగా రాటుదేలిపోయారు. అందరూ ప్రపంచమంతా చుట్టి, విపరీతంగా సంపాదించి, ఇప్పుడు అగ్రస్థానంలోఉన్నారు. అలానే తెలుగువారు ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండాలి. తెలుగుజాతి నంబర్ 1స్థానంలో ఉండాలి. దానివల్ల నాకు ఏమి లాభంలేదు. కానీ నా ఆత్మకు సంతృప్తి కలుగుతుంది అని పేర్కొన్నారు.
కొంతమంది ఇప్పటికీ దినసరివేతనం రూ.150తోనే బతుకుతున్నారు. వారిగురించి ఆలోచించాలి. పేదవాడికి అండగా ఉండాలి. నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే నా సంకల్పం. ఆర్థికఅసమానతలు లేని సమాజంకోసం రాత్రింబవళ్లు పనిచేస్తాను. ప్రతి ఒక్కరినీ సంపన్నుల్ని చేయాలి. అందరికీ సమానఅవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెప్పిందన్నారు. సంపద సృష్టించాలి..అది అందరికీ సమానంగా అందాలి. తెలివైనవారు ముందుకెళితే, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఇతరత్రా కారణాలతో చాలా మంది వెనుకపడిపోతున్నారు. అలాంటివారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల వారు ఉన్నారు. అవన్నీ పోవాలనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
కుటుంబం ఒక యూనిట్ గా
కుటుంబం ఒక యూనిట్. ఇంట్లోని మనుషులు, వారికి ఉండే వనరులు, సామర్థ్యమే ఆస్తి. పొలాలు, ఆస్తులు లేకపోయినా వారి ఆదాయం పెరగాలి. సాధారణ డ్రైవర్ కూతురు పుష్ప తనకు అమ్మఒడి ఇవ్వలేదని చెబితే ఆశ్చర్యపోయాను. ఆ పాపను డాక్టర్నో, ఇంజనీర్నో చేయలేమా? ఆ పాప బాగా చదివి ఉన్నతస్థానానికి వెళ్తే, ఆమె తరువాత మరో 10మందిని చదివిస్తుంది. జన్మభూమి పేరుతో ఇచ్చిన పిలుపు నకు స్పందించి గతంలో దేశవిదేశాల్లోని తెలుగువారు సమాజ నిర్మాణంకోసం శ్రమిం చారు అని చంద్రబాబు వివరించారు. అదే ఆలోచన ఇప్పుడు చేస్తున్నాను. ఒకరు ఒకరికంటే ఎక్కువమందిని పైకి తీసుకొ చ్చేందుకు ముందుకురావాలి. అదే నాసంకల్పం. ఒకరోజులోనో.. ఒక నెలలోనే కాకుం డా పద్ధతి ప్రకారం అందరినీ ఆదుకోవాలి. త్వరలోనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుడు తున్నాం. నేనే మీ ఇంటికి వచ్చి మీకు సాయంచేయడం. తరువాత మీరుచెప్పింది చేశానోలేదో నాకు బ్రీఫింగ్ వచ్చేలా కొత్త టెక్నాలజీని తయారు చేయమని చెప్పాను. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నాం అని తెలిపారు.
ప్రపంచంలో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలి. అలానే తెలుగుదేశం ఎక్కడున్నా తెలుగువారికోసం, తెలుగుజాతి కోసమే పనిచేస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపై నిలవాలి. మత మనేది కేవలం ఒకనమ్మకం. కులం అనేది సమాజంలో సంభవించిన మార్పులనుంచి పుట్టింది. ఏ కులం కూడా ఆ కులాన్ని ఉద్ధరించదు. కులనాయకులు మాటలుచెబుతారుగానీ ఎలాంటి సాయం చేయ రు, ఎవరినీ ఆదుకోరు అని చెప్పారు. విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే ఎడ్ల బళ్లతో మా ఊరికి రోడ్డు వేయించాను. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమెరికాలో ఉండేవారితో మాట్లాడాలంటే ఎంతబిల్లు వస్తుం దో అని భయపడేవాడిని. సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచంలో ఎక్కడున్నవారితో ఎప్పుడై నా, ఎంతసేపయినా మాట్లాడుకుంటున్నాం.
కరెంట్ తో నడిచే కార్లు వచ్చాయి. డ్రైవర్ లెస్ కార్లు కూడా వచ్చేశాయి. కారెక్కి దానికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే, అదే దారి వెతుకు తూ మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. అదంతా సాంకేతికత గొప్పతనమేనన్నారు. అలాంటి సాంకేతికత తోనే పేదరికాన్ని రూపుమాపగలం. దేశ విదేశాల్లో ఉన్నత స్థానా ల్లో ఉన్న తెలుగు వారు పుట్టిన గడ్డకోసం పనిచేయాలి. తమవారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి. దానికోసం ప్రభుత్వం నుంచి కూడా చేయాల్సింది చేస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను అని ప్రకటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరికం రూపుమాపడంలో కూడా ఆడబిడ్డల్నే ముందు పెడతాను. వారు ఏపనైనా చిత్తశుద్ధితో, అంకితభావంతో చేస్తారు. రాష్ట్రానికి, దేశానికి ఆర్థికమంత్రి ఎంతముఖ్యమో, కుటుంబంలో ఆడబిడ్డలు కూడా అంతే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టగలరన్నారు.
అదే సంకల్పం
పేదవాడిని సంపన్నుడిని చేయాలన్న నా ఆశ అత్యాశా? పేదల్ని ధనికులతో సమానంగా ఉండేలా చూడటం సాధ్యమని మీరు నమ్ముతారా? నేను చెప్పేది నమ్ము తారా? వైసీపీ దొంగలుచెప్పేది నమ్ముతారా? వారు మాత్రమే కోటీశ్వరులు అయ్యేలా వైసీపీ దొంగలు ఆలోచిస్తారు. పేదవాళ్లు కోటీశ్వరులు కాకూడదా.. జగన్ ఒక్కడే కోటీ శ్వరుడు కావాలా? పేదల ముఖాల్లో ఆనందం చూడటమే నా సంకల్పం. ప్రతి కుటుం బం సంతోషంగా జీవించాలన్నదే నా సంకల్పం అని చంద్రబాబు చెప్పారు. నాకుండే వ్యసనం ప్రపంచంలోని తెలుగువారు అందరూ ఆనందంగా ఉండాలన్నదే. ప్రపంచంలోనే తెలుగుజాతి కమ్యూనిటీ నంబర్ 1 స్థానంలో ఉండాలి. ఆప్పుడే నాలో జోష్ వస్తుంది. తెలంగాణకు ఆంధ్రాకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని హరీశ్ రావుఅన్నాడు.
నా ఆలోచనల నుంచి పుట్టిన వాటిని అక్కడ ఎవరూ విధ్వంసం చేయలేదు. అది సంతోషించాల్సిన విషయం. నేను ప్రారంభించిన పథకాలు, నిర్మా ణాల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొనసాగించాడన్నారు. ఇక్కడేం జరుగుతోంది. ప్రజలసంపద, కొన్నిలక్షలకోట్ల సంపద అమరావతిని బూడిద లోపోసిన పన్నీరుగా మార్చాడు. పోలవరం పూర్తి చేయాలనుకున్న ఆలోచనను ఆది లోనే చిదిమేశాడు. రాయలసీమకు నీళ్లుఇస్తే, అక్కడ వ్యవసాయం, పారిశ్రామిక రంగం రెండూ బ్రహ్మండంగా వెలిగేవి. అమ్మఒడి ఇస్తే ప్రజల సమస్యలు తీరుతాయా? అని ప్రశ్నించారు.
నేను ఇళ్ల నిర్మాణం పై సెల్ఫీఛాలెంజ్ విసిరితే జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు. ఇప్పుడు తనకు అమ్మఒడి ఇవ్వలేదన్న చిన్నారిపుష్ప ఫోటోతో జగన్ కు సెల్ఫీ ఛా లెంజ్ విసురుతాను. ఏ సమాధానం చెబుతాడు? ఎవరిపైనా నాకు కోపం, ద్వేషం ఉం డవు. ప్రజలపై అభిమానం, ప్రేమ తప్ప. నా సంకల్పం సాకారం కావడానికి ప్రపం చంలోని తెలుగువారు అంతా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం లోని తెలుగు వారు, అందరికంటే మిన్నగా రాణించి, అన్నివర్గాల్లో నంబర్ 1గా ఉండాలన్నది నా తొలిసంకల్పం అయితే, రాష్ట్రంతోపాటు, ఇతరరాష్ట్రాల్లోని పేదలు కోటీశ్వరులు కావాలన్నది రెండో సంకల్పం. ఆ రెండు సాధించేలా అందరూ నాకు సహకరించాలి. అదే నా కోరిక అని వెల్లడించారు.
మహిళల ప్రశ్నలు .. చంద్రబాబు సమాధానాలు
ప్రశ్న 1: ప్రైవేట్ రంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు : రాష్ట్రంలో మొట్ట మొదటిసారి మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిసాధికారత కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీనే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆస్తిలో మహిళలకు సమానహక్కు కల్పించా రు. దీనికి సంబంధించి ఎప్పుడో ఎన్టీఆర్ అమలుచేస్తే, కేంద్రం ఇప్పుడు చట్టం చేస్తోంది. ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు నేను 33శాతం రిజర్వేషన్లు కల్పించాను. చట్టసభల్లో కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తెలుగుదేశం పోరాడుతుంది.
ప్రశ్న-2 : ఎస్సీఎస్టీలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మీరేమంటారు?
జవాబు : ఎస్సీ,ఎస్టీల కోసం పనిచేసింది తెలుగుదేశమే. ఇళ్లనిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50శాతం కేటాయింపులు చేసింది ఎన్టీఆర్ గారు. నేను వచ్చాక అంటరానితనం నిర్మూలన కు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, ఎస్సీఎస్టీలకు స్వేచ్ఛ, సమానత్వాన్ని అందించాను. పున్నయ్య కమిషన్ 42ప్రతిపాదనలు చేస్తే అన్నింటినీ ఆమోదించాను. అంబేద్కర్ రాజ్యాం గం మనకు చెప్పింది.. అందరినీ సమానంగా చూడమని. ఎస్సీఎస్టీలకు సమాజంలో గౌరవం పెంచింది తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడున్నప్రభుత్వం మాయమాటలతో ఎస్సీ ఎస్టీలను న మ్మించి, వారిఓట్లు కొట్టేసింది. ఎస్సీఎస్టీ మహిళలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఏ ఒక్కమహిళ కూడా ఈప్రభుత్వం లో ప్రశాంతంగా బతకడం లేదు. తప్పు చేసినవారు ఎవరై నా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్ లో ఏ ఆడబిడ్డ కు అన్యాయం జరక్కుండా చూసేది తెలుగుదేశంపార్టీయేనని హామీ ఇస్తున్నా.
ప్రశ్న-3 : మిమ్మల్ని సీఈవో సీఎం అంటారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మీరు ఎలాంటి సహాయంచేయగలరు.. ఎంత తోడ్పాటు అందించగలరు?
జవాబు : నేను ముఖ్యమంత్రి అయినప్పుడు పారిశ్రామికవేత్తలు చాలాతక్కువగా ఉండేవారు . ప్రతిఒక్కరూ ఎంటర్ ప్రెన్యూర్ కావాలని ఆలోచనచేశాను. అప్పుడప్పుడే పైకిరావాలనుకుం టున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలకు పరిచయం చేశాను . ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు చేయడం కాదు.. వారే ఉద్యోగాలివ్వాలని చెప్పాను. హైదరాబా ద్ మహానగరం ధనికులు ఎక్కువగా ఉన్ననగరాల్లో ప్రపంచంలోనే 65వస్థానంలో ఉంది. నా లెడ్జ్ ఎకానమీలో తెలుగువారు ముందున్నారు. పారిశ్రామికరంగం లో కూడా ముందున్నారు.
ప్రశ్న-4: ఉద్యోగుల డీఏపై మీరు ఆలోచించాలి సార్? మా తప్పుతెలిసొచ్చింది సార్.. భవిష్యత్ లో తప్పుచేయం. భవిష్యత్ లో మీరే నాయకులుగా ఉండాలిసార్. మీరు తప్ప ఎవరు వచ్చి నా రాష్ట్రానికి ఉపయోగంలేదు సార్.
జవాబు : తప్పకుండా మీరుచెప్పిన దానిపై ఆలోచిస్తాను. ఉద్యోగుల గౌరవంకోసం పోరాడిం ది తెలుగుదేశం ప్రభుత్వమే. డబ్బులులేకపోయినా, రాష్ట్రం విడిపోయి ఆర్థికసమస్యలున్నా, ఉద్యోగులు ఇబ్బందిపడకూడదని తెలంగాణతో సమానంగా 42శాతం ఫిట్ మెంట్ఇచ్చాను. పీఆర్సీ పెంచాను. అదీ నాకు ఉద్యోగులపై ఉండే అభిమానం. మీకు న్యాయంచేస్తాను.
ప్రశ్న-5 : రాష్ట్రంలోని నిరుద్యోగసమస్యను ఎలా పరిష్కరిస్తారు సార్?
జవాబు : నిరుద్యోగసమస్య పరిష్కారంపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. ప్రతి ఒక్కరూ కష్టపడి, సంపాదించే మార్గాలు చెబుతాను. వాటిని అందిపుచ్చుకోవడంలో మీరు ఎప్పుడూ ముందుండాలి.
ప్రశ్న-6 : ఆడపిల్ల లేదని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు ఆడపిల్ల ఉంటే లోకేశ్ గారిలా రాజకీయాల్లో కొనసాగించేవారా? లేక వ్యాపార బాధ్యతలు అప్పగించేవారా?
జవాబు : తప్పకుండా నాకుఒక ఆడపిల్ల ఉండి ఉంటే బాగుండేది. ప్రతి ఆడబిడ్డను నాసొంత బిడ్డగానే భావిస్తాను. మగపిల్లలతో సమానంగా ఆడవారు రాణిస్తారని నమ్ముతాను. ఒకప్పు డు ఆడపిల్లల్ని భారంగా భావించేవారు. అబ్బాయిల్ని చదివించి, అమ్మాయిలకు పెళ్లిచేసి పంపేవారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడాన్నిచూశాను కాబట్టే, వారి కాళ్ల పై వారు నిలబడాలని డ్వాక్రాసంఘాలు ఏర్పాటుచేశాను.