గిద్దలూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పర్యటనుకు వెళుతూ దారిలో రైతు కూలీలతో మాట్లాడిన టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మండ్లపాడు గ్రామంలో పొగాకు గ్రేడింగ్ చేస్తున్న మహిళలతో మాట్లాడి రోజు కూలీ ఎంత వస్తుంది…నరేగా పనులు చేస్తున్నారా…కూలీ ఎంత ఇస్తున్నారు అని ఆరాతీసిన టీడీపీ అధినేత. ఇప్పుడు నరేగా పనులకు రూ.100 మాత్రమే ఇస్తున్నారని చెప్పిన కూలీలు, టీడీపీ ప్రభుత్వ సమయంలో నరేగా పనులకు రోజుకు రూ.250 ఇచ్చేవారు అని చెప్పారు.
నేడు ఖర్చులు పెరిగాయని, కూలీ డబ్బు సరిపోవడం లేదని చెప్పిన మహిళలు. అధిక మద్యం ధరలు తమ కుటుంబాలకు భారంగా మారాయనీ, టీడీపీ వచ్చి ఉంటే ఈ కరువు ప్రాంతానికి నీరు వచ్చి ఆదాయం పెరిగేది అని వ్యాఖ్యానించిన శ్రీ చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ బాబు గారితో తో చెప్పిన మహిళా కూలీలు. గిద్దలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు.