డోన్ నియోజకవర్గం కలచట్ల గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ చెరువును హంద్రీనీవా జలాలతో నింపాలి. గ్రామంలో ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు నిర్మించాలిఅని కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధలేదు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తాం. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.