ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. ఒకే భావజాలం కలిగిన రాజకీయ పార్టీలు పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకుంటాయని, అది తప్పు కాదన్నారు.
భట్టిప్రోలులో విలేకర్లతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను సింగిల్‌గా 175 నియోజకవర్గాలలో విడి విడిగా పోటీ చేయాలని అంటున్న జగన్ కేంద్రంలో 543 నియోజకవర్గాలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీని ప్రశ్నించ గలడా అని ప్రశ్నించారు. రాజకీయాలలో ఎన్నికల వ్యూహాలు, పొత్తులు అనేది సహజమని, దానిని ప్రశ్నించే హక్కు మరొక రాజకీయ పార్టీకి ఉండదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని, తద్వారా జగన్ లబ్ది పొందాలని ఈ విధమైన మాటలతో ప్రతిపక్షాలను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారని సాయిబాబా అన్నారు.