మన కుటుంబంలో ఒకరికి సుస్తీ చేసింది. ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్తితి. అప్పుడే కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన యువ డాక్టరు వద్దకు వెళ్తారా? లేక అనుభవజ్ఞుడైన వైద్యుని వద్దకు వెళతారా? సరిగ్గా రాష్ట్రం పరిస్థితి కూడా ఇలాగే వుంది. రాష్ట్రానికి ఇప్పుడు సుస్తీ చేసింది. అనుభవజ్ఞుడైన వైద్యుడు అవసరం వుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ గుర్తుకు వస్తున్న పేరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్ ను కాపాడగలిగే సత్తా, సామర్థ్యం ఒక్క చంద్రబాబుకే వున్నదని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే చంద్రబాబు రాష్ట్రంలో ఏమూలకు వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అంతటి ప్రజాస్పందన వ్యక్తం కావటానికి కారణం ఏమిటి? ప్రజలంతా ముక్తకంఠంతో చెప్పే సమాధానం ఒక్కటే. చంద్రబాబు అనుభవజ్ఞుడు. పాలనాదక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడి తిరిగి గాడిలో పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం అన్న భావన అన్ని వర్గాలలో ప్రబలుతోంది.
చంద్రబాబు పర్యటనలకు లభిస్తున్న ప్రజాస్పందన, అవలంబిస్తున్న వ్యూహాలకు అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టిడిపి లేదా చంద్రబాబు పై చేసే విమర్శలు అన్నీ బెడిసికొడుతున్నాయి. చివరకు చంద్రబాబు వయస్సును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయాలన్న తలంపుకు అధికార పార్టీ నాయకులు తెరదీశారు. యువకుడు అనే ఉద్దేశంతో అప్పుడే డ్రైవింగ్ సరిగా రాని వ్యక్తి చేతికి వాహనం ఇస్తే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఊహించుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్ర పరిస్తితి ఇలాగే వుంది. చిన్న వయసులో అధికారం చేజిక్కినా, ప్రగతిశీల, అభ్యుదయ కారక ఆలోచనలు వుంటే అద్భుతాలు సృష్టించవచ్చు.
ఎవరు యువకుడు?
వయస్సు అనేది కాలగమనంలో వచ్చే ఒక రోజు. అది దేహానికే పరిమితం అయి వుంటుంది. మనసుకి కాదు. చంద్రబాబు వయసు గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం అవి
చేసే వారి దిగజారుడు తనాన్ని సూచిస్తున్నాయి. చంద్రబాబు ఒక్కరే సీనియర్ సిటిజన్ కాదు. ఈ దేశానికి ప్రధానిగా వున్న నరేంద్ర మోడీ సైతం సీనియర్ సిటిజనే. అంతేగాక ప్రస్తుత ముఖ్యమంత్రులు గా వున్న నవీన్ పట్నాయక్(76), అశోక్ గెహ్లాట్ (71), నితీష్ కుమార్ (71), స్టాలిన్ (69), కెసిఆర్ (68), మమత బెనర్జీ (67). వీరితో పాటు మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు, దేవెగౌడ వంటివారంతా సీనియర్ సిటిజన్ లు అయిన తర్వాతే ప్రధానమంత్రులు అయ్యారు. వీరంతా ప్రజాజీవితంలో చెరగని ముద్ర వేసినవారే.
వీరిలో ఎవరికీ లేని వయసు నిబంధన చంద్రబాబుకే ఎందుకు వచ్చింది? చంద్రబాబును వేలెత్తి చూపడానికి ఇసుమంతైనా అవకాశం ప్రత్యర్థులకు దొరకదు. చంద్రబాబు ఇప్పటికీ రోజుకు 16 గంటలకు పైగా పని చేస్తారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఆయన అనుక్షణం తపిస్తారు. అందుకోసమే ఆయన సమయాన్నంతా వెచ్చిస్తారు. మరిప్పుడు యువకులు అని చెప్పుకునే కొంతమంది నాయకులు చేస్తున్నది ఏమిటి? ఉరకలెత్తే ఉడుకు రక్తాన్ని, ఆలోచనలను, ప్రజాసంక్షేమం కోసం వినియోగిస్తే ఉత్తమ సమాజ నిర్మాణానికి పునాది అవుతోంది. అయితే ఆ విధంగా జరుగుతున్నదా? ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతో నమ్మకంతో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని, విలువైన సమయాన్ని ప్రతీకార రాజకీయాల కోసమో లేక క్రీడా వినోదం కోసమో ఉపయోగించటం దురదృష్టకర పరిణామం. అందుకు ఫలితం రాష్ట్ర భవిష్యత్ ఒకతరం వెనక్కి వెళ్ళటం. డ్రైవింగ్ సరిగా రాని యువ పైలట్ కు విమానం నడపమని ఇస్తే ఫలితం ఎలా వుంటుందో, ప్రస్తుత రాష్ట్ర పరిస్తితి అదేవిధంగా వుంది.
కాలంతో పోటీ పడే చంద్రబాబు
చంద్రబాబు నాయుడు కాలంతో పోటీ పడే నవయువకుడు. యువకులు అని చెప్పుకునే ఎంతోమంది నాయకుల ఊహకు సైతం అందని వేగం చంద్రబాబుది. ప్రస్తుత పరిస్థితులను రెండున్నర దశాబ్దాల క్రితమే ఊహించి అమలు పరచిన గొప్ప దార్శనికుడు. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ గురించి సైతం ఊహించి అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించటం చంద్రబాబుకే సాధ్యం.
సహజంగా వయసనేది దేహానికే గాని, మనసుకు కాదు అని అందరూ అంటుంటారు. చంద్రబాబు మనసుకు వయసు ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. అయితే ఆశ్చర్యకరంగా చంద్రబాబు దేహానికి సైతం వయసు ఛాయలు సొకక పోవటం విశేషం. ఊపిరిసలుపని పర్యటనలు వున్నప్పటికీ, గంటల తరబడి వాహనంపై నిలబడి వుండటం, అనర్గళంగా ఉపన్యాసం ఇస్తుండటం చూసిన వారెవరైనా చంద్రబాబుకు వయసు అనగలరా? అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబుకు మాత్రమే అది సాధ్యమయింది. ప్రజాసంక్షేమం పట్ల వున్న శ్రద్ధ, చిత్తశుద్ధి, నిబద్ధత కారణంగానే చంద్రబాబుకు అంతటి శక్తి వచ్చిందనేది నిర్వివాదాంశం. ఆ సంకల్ప బలమే చంద్రబాబుకు శ్రీరామరక్ష.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి చెబుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ హెచ్ ఓ) తాజాగా రూపొందించిన ప్రామాణికాల ప్రకారం 66 నుంచి 79 సంవత్సరాల వారిని మధ్యవయస్కులు గా పరిగణించాలి. 80 నుంచి 99 సంవత్సరాల మధ్య వయసున్న వారిని పెద్దలు లేదా సీనియర్ సిటిజెన్ లుగా వ్యవహరించాలి. వృద్ధాప్యం అనే పదాన్ని నిర్వచించటానికి ఇప్పటి వరకు గీటురాయి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అది దేశాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.