టిడిపి తరపున వడ్డెర సామాజిక వర్గీయులను చట్టసభకు పంపించే బాధ్యత తాను స్వీకరిస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన క్వారీలను తిరిగి స్వాధీనం చేసుకొని వడ్డెర్లకు అప్పగిస్తామని చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం వద్ద బీసీ సామాజిక వర్గీయులతో
ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలు లేవనెత్తిన సందేహాలకు లోకేష్ సమాధానమిచ్చారు. బీసీలకు పుట్టినిల్లు టిడిపి. బీసీలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది టిడిపి వల్లే.
బీసీలకు మొదట 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్, ఆ తరువాత 34 శాతానికి పెంచింది చంద్రబాబు. అని వివరించారు. టిడిపి హయాంలో ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తులు చేసే వారిని ఆదుకున్నట్టు చెప్పారు. జగన్ బీసిలకు ఇచ్చిన రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి 16,500 మందిని పదవులకి దూరం చేశారన్నారు. వైసిపి పాలనలో బీసీల పై దాడులు పెరిగిపోయాయి.25 వేల అక్రమ కేసులు బీసీల పై కేసులు పెట్టారని ఆరోపించారు. టిడిపి గెలిచిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బీసీ కార్పొరేషన్ పునర్నిర్మాణం చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. బీసీలో ఉన్న ఉపకులాల వారీగా కమ్యూనిటీ భవనాలు నిర్మాణం చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
నిన్న పెనుకొండ అనకొండ మాజీ మంత్రి శంకరనారాయణ పై నేను స్పష్టమైన ఆరోపణలు చేశాను, ఆర్ అండ్ బి మినిస్టర్ గా పనిచేసిన ఆయన నియోజకవర్గానికి పీకింది ఎంటి అని అడిగితే బూతులు తిడుతున్నారని లోకేష్ చెప్పారు. నేను చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పలేదు అంటే అన్ని నిజాలు అని ఎమ్మెల్యే ఒప్పుకున్నట్టేనా అని అన్నారు. నేను ఇంకా రెండు రోజులు నియోజకవర్గంలో ఉంటా ఆయన పీకింది ఏమైనా ఉంటే చర్చకు రావాలి అని సవాల్ చేశారు. గీత కార్మికులను ఆదుకుంది టిడిపి. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ అమలు చేస్తాం. నీరా కేఫ్ లకు అనుమతులు ఇస్తాం.
గీత కార్మికులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. జగన్ అక్రమ మద్యం వ్యాపారం కోసమే గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. టిడిపి గెలిచిన వెంటనే 10 లక్షల చంద్రన్న భీమా ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని వెల్లడించారు. బీసీల్లో ఉపకులాల్లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం మేము సత్యపాల్ కమిటీ వేసాం. ఆ రిపోర్ట్ ని వైసిపి ప్రభుత్వం పక్కన పడేసింది. మేము వచ్చిన తరువాత సత్యపాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని వివరించారు. ఇక్కడ ఎంపి యుట్యూబ్ లో పీకింది తప్ప ఢిల్లీ లో పీకింది ఏమి లేదు. బీసీల సమస్యల కోసం ఇక్కడ ఎంపి ఒక్క రోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు.
2017 లో బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని టిడిపి ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు లోకేష్ తెలిపారు.నాలుగేళ్లు పడుకొని జగన్ ఇప్పుడు బోయ, వాల్మీకలను మోసం చేశాడు, కొత్త తీర్మానం పేరుతో కొత్త డ్రామా కి తెర లేపాడు, కేవలం నాలుగు జిల్లాల్లో ఉన్న వారిని మాత్రమే ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసాడని విమర్శించారు.గొర్రెలు కొనుగోలు, ఇన్స్యూరెన్స్ కి టిడిపి ప్రభుత్వం సహాయం అందించింది. వైసిపి నాయకులు బంజరు భూములను కబ్జా చేశారు. వాటిని వెనక్కి తీసుకొని గొర్రెలు మేపుకోవడనికి కురుబలకి కేటాయిస్తాం అని వెల్లడించారు. గోపాలమిత్ర పథకాన్ని జగన్ అటక ఎక్కించారు.టిడిపి గెలిచిన వెంటనే గోపాలమిత్ర పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బిసిలకు భూములు కేటాయిస్తాం. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం.
టిడిపి హయాంలో కీలక పదవులు అన్ని బిసిలకు ఇచ్చాం. జగన్ పాలనలో కీలక పదవుల్లో ఎవరు ఉన్నారో బీసీ సోదరులు ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. టిడిపి హయాంలో యార్న్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ, కలర్ సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. జగన్ పాలనలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే అదుకోలేదు.యార్న్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ, కలర్ సబ్సిడీ అన్ని జగన్ ప్రభుత్వం ఎత్తేసిందని విమర్శించారు. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, చేనేత మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రజకలను ఆదుకుంది టిడిపి. శాసనమండలికి పంపింది టిడిపి.
వాషింగ్ మెషిన్, ఐరెన్ బాక్సులు అందజేసింది టిడిపి.
ఇప్పుడు రజకులకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. టిడిపి గెలిచిన వెంటనే రజకులకి వాషింగ్ మెషిన్ తో పాటు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. డ్రై క్లీనింగ్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి సహాయం అందిస్తాం అని లోకేష్ వెల్లడించారు.