భారతదేశ రాజకీయ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రూటే సపరేట్. ఆయన ఏ పని చేసినా ఎంతో ముందు చూపు మరియు దూరదృష్టితో పాటు భవిష్యత్తు ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆ పనులు తనకు వ్యక్తిగతంగా ఇమేజ్ ను పెంచటంతోపాటు పార్టీకి మైలేజ్ ను చేకూర్చిపెట్టే విధంగా ఉంటాయి. ఇప్పుడు లేజిస్లేటివ్ కౌన్సిల్ కు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లోనూ ఫలితాలు సానుకూలంగా రావటంలో ఆయన మార్కు విజన్ తో పాటు వివిధ రకాల ప్రణాళికలు సైలెంట్ గా పని చేసినట్లు కనిపిస్తోంది. అందులో ఒకదాని గురించి ఇప్పుడు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయిన ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ పేరుతో యువతకు శిక్షణ మరియు ఉద్యోగాలు కల్పించే పనికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు ఎన్ఆర్ఐ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్ పర్యవేక్షణలో సుమారుగా ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఎంపవర్మెంట్ సెంటర్ వేలాదిమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే విధంగా వందలాదిమందికి ఉద్యోగాలు కల్పించింది.
ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ తోనే మధ్యలోనే విద్యను ఆపివేసిన మధ్యతరగతి వర్గాల వారికి స్థానికంగానే అవసరమైన రీతిలో ఉద్యోగాలు కల్పించింది. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను అెమెరికాకు పంపింది. సుమారుగా వందమందికి పైగా టీచర్లును మరికొద్ది రోజుల్లో ఉద్యోగాలు ఏర్పాటు చేసి అమెరికాకు పంపనుంది. డిప్లొమా మరియు ఐటిఐ కోర్సులలో ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి గల్ప్ దేశాల్లో ఉపాధి కల్పించనుంది.. ఇది ఇప్పుడు తుది దశలో అంటే ట్రైనింగ్ అనంతరం అభ్యర్థులు కొద్ది రోజుల్లో ఉద్యోగాలు పొందనున్నారు. అదేవిధంగా ఇంగ్లీషు మరియు హీందీ భాషల్లో కూడా కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రొఫెషనల్స్ తో ఇప్పిస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి విజన్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు యువతను మరియు పట్టభద్రులను ఆకర్షించాయి. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేలాది మంది ఇప్పటికే శిక్షణ పొందారు.
దీని ప్రభావంతో ఒకవిధంగా పాజిటివ్ వేవ్ క్రియేట్ కావటం ద్వారా తెలుగుదేశం అభ్యర్థులకు కొంతమేరకు ఉపయోగం కలిగించిందని చెప్పవచ్చు. గతంలో బాబు వేస్తే జాబు వస్తుందనే నినాదం ప్రజల్లో బలమైన ముద్ర వేసి తెలుగుదేశం గెలుపుకు కారణమైంది. ఇప్పుడు ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలు గత నినాదం తరహా అనుభవం మరియు ఫలితాల్ని పునరావృతం చేసేందుకు దోహదం చేసేలా ఉన్నాయి.
కడప నుంచి ఇక్కడికు వచ్చి బి.కామ్ క్వాలిఫికేషన్ తో ట్యాలీ కోర్సు లో మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ పొందిన పొ ఎం నాగశేషయ్య మాట్లాడుతూ తాను తెలుగుదేశం అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం జరిగిందని చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించటంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటారని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.