అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారు. హెల్త్ యూనివర్సిటీ వైయస్ కి ఎటువంటి సంబంధం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక చీకటిదినంగా మిగిలిపోతుంది. 1986లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించారు. జగన్ ఒక సైకో.. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి చెందిన 400 కోట్ల రూపాయిలు నిధులు జగన్ కొట్టేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతి కి గర్వకారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగు జాతి ని అవమానించడమే. తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్. దేశంలో మొదట సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ పేరు మార్చడానికి రహస్య క్యాబినెట్ నిర్వహించారు. ఇదే పద్దతి లో చంద్రబాబు గారు ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. చంద్రబాబు గారు వైఎస్ పేరు తొలగించలేదు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి సిఎం అయ్యాక గతంలో తమిళనాడులో ఉన్న రాజకియం ఇక్కడ తీసుకొచ్చారు. ఇదే పద్దతి కొనసాగితే రాష్ట్రం పేరు కూడా మార్చేసే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తో జగన్ చరిత్ర హీనుడు గా మిగిలిపోతాడు. ప్రజా సమస్యలు అనేకం ఉంటే జగన్ ప్రభుత్వం పేర్లు మార్చే పనిలో బిజీగా ఉంది. టిడిపి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతాం. ఎన్టీఆర్ పై అంత గౌరవం ఉంటే హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారు? అన్న క్యాంటీన్ ఎందుకు ఎత్తేసారు? సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారు. చంద్రబాబునాయుడు ఏనాడో జిల్లాలో వైద్య కళాశాల తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొచ్చారు. అప్పుడు బహుశా జగన్ టెన్త్ పేపర్లు కొట్టేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడని లోకేష్ ఎద్దేవా చేశారు.