చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కోనసీమలో మరో వ్యాన్‌ పిక్‌

by చైతన్యరధం
Sep 14, 2022 at 11:36am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
కోనసీమలో మరో వ్యాన్‌ పిక్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.27వేల కోట్ల కుంభకోణానికి జె-గ్యాంగ్‌ స్కెచ్‌
  • 27వేల ఎకరాల భూములకు ఎసరు.. ఇప్పటికే పేదలకు బెదిరింపుల పర్వం
  • ఈ భూములతో వ్యాన్‌ పిక్‌ తరహాలో బ్యాంకులను కొల్లగొట్టే వ్యూహం
  • రహస్యంగా తీరప్రాంత గ్రామాల్లో సజ్జల, మిథున్‌ పర్యటనలు
  • ఎమ్మెల్యే రేపాక నేతృత్వంలో తీర ప్రాంతంలో వైసీపీ దొంగల హల్‌చల్‌
  • ఏవీఆర్‌ ఆయిల్స్‌ పేరుతో చమురు, సహజవాయువు వెలికితీత సాకు
  • ఓఎన్‌ జిసి చేతులెత్తేసిన చోట తాము వెలికితీస్తామని అనుమతులు
  • పచ్చని తీరంపై జగనాసురుడి కళ్లు – ఆందోళనలో తీరప్రాంతవాసులు

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమలాపురం)
అడ్డగోలు సంపాదన, అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులతో సహా ఎవరినైనా బలిపెట్టే స్వభావంగల నేరచరితుడు ఫ్యాక్షనిస్టు, దోపిడీదారుడైన జగ న్‌రెడ్డికి రాష్ట్రప్రజలు దొంగచేతికి తాళాలిచ్చినట్లుగా 40నెలలక్రితం అధికార పగ్గాలు అప్పగించారు. ఇంకే ముంది..కంచే చేనుమేసిన చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి. ఎటువంటి అధికారం లేకుండానే తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దోచుకున్నగజదొంగ జగన్మోహన్‌రెడ్డికి అధికారపీఠం దక్కడం తో ఆయనచేసే అడ్డగోలు దోపిడీకి రాజముద్ర తోడైంది. తన తండ్రి హయాంలో వేటినైతేదోచుకొని వేలకోట్లు పోగేసుకున్నాడో అదేతరహా కుంభకోణాలను జగన్‌రెడ్డి 2.0 రిపీట్‌ చేస్తున్నారు. గతంలో దోపిడీ కారణంగా జైలుపాలైన ఓబులాపురం మైన్స్‌, లేపాక్షి నాలెడ్జి హబ్‌, వ్యాన్‌ పిక్‌లనే మళ్లీ లేటేస్టుగా పునరాృ తం చేస్తూ ఈ మూడింటి ద్వారా దాదాపు 50వేల కోట్లరూపాయల అక్రమసంపాదనకు తెరలేపారు. గత మూడేళ్లలో ల్యాం డ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌ కుంభ కోణాల ద్వారా 2లక్షల కోట్లరూపాయలు దోచుకున్న జగన్‌..రాబోయే రెండేళ్ల లో మరో మూడు లక్షల కోట్లు దోచుకునేందుకు పకడ్బందీగా స్కెచ్‌వేసి పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. అయితే తాజా ఎపిసోడ్‌లో కథ పాతదే అయినా క్యారెక్టర్లను మాత్రం స్వల్పంగా మార్చి నయా దోపిడీ పర్వానికి తెరలేపారు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. అందులో భాగంగానే కోనసీమ అంబేద్కర్‌ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సముద్రతీరంలోవ్యాన్‌పిక్‌ తరహా భారీ కుంభకోణానికి తెరలేపారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ పేరుతో దాదాపు 27వేల ఎకరాల దళితులు, మత్స్యకారుల భూములను కొట్టేసి వేల కోట్లరూపాయల దోపిడీకి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధంచేశారు.

ఎవరీ ఎవిఆర్‌ ఆయిల్స్‌ లిమిటెడ్‌?
ఎవిఆర్‌ ఆయిల్స్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది ఒక అన్‌ లిస్టెడ్‌ కంపెనీ. ఈ కంపెనీ జగన్‌ రెడ్డి అధికారం చేపట్టడానికి సరిగ్గా నాలుగునెలల ముందు 2019 ఫిబ్రవరి 4వతేదీన చెన్నయ్‌ లో కేవలం లక్షరూపాయల పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ తో 10లక్షల రూపాయల పెట్టుబడితో రిజిస్టర్‌ అయింది. జగన్‌ రెడ్డి అధికారం చేపట్టి 3 సంవత్సరాల 4నెలలు కాగా, ఎవిఆర్‌ మినరల్స్‌ స్థాపించి 3 సంవత్సరాలు 7నెలలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎటువంటి మౌలిక సామర్థ్యం, ఆర్థిక పరిపుష్టిలేని సూట్‌ కేసు కంపెనీ ఎవిఆర్‌ ఆయిల్స్‌ సంస్థ. దీనికి ప్రతాప్‌ చంద్ర శివ అనే వ్యక్తి డైరక్టర్‌ కాగా, ఫిలిప్‌ పోతెన్‌ అనే వ్యక్తి నామినీ డైరక్టర్‌ గా ఉన్నారు. ఎటువంటి కనీస మౌలిక వనరులులేని ఈ సంస్థ రాజోలు నియోజక వర్గంలోని సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని సముద్రతీర ప్రాంతంలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ నిక్షేపా లు వెలికితీస్తామని 21-8-2021న ప్రభుత్వా నికి దరఖాస్తు చేసుకోగా, ఏడాది క్రితం కనీస పరిశీ లన లేకుండా ఎన్విరాన్‌ మెంటల్‌ క్లియరెన్స్‌ ఇచ్చారు.

సంబంధితవార్తలు

సజ్జల, పేర్ని నానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి

కౌంటింగ్‌ ఏజెంట్లపై వ్యాఖ్యలు

జైలుకు, బెయిలుకు మధ్య జగన్‌ జీవితం : పవన్‌

అంతా సజ్జల కనుసన్నల్లోనే
రాష్ట్ర సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రాంతంలోని ఒక గెస్ట్‌ హౌస్‌లో రెండురోజులు బసచేసి ఏం చేయాలనే విషయమై స్థానికఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు రూట్‌ మ్యాప్‌ ఇచ్చి..స్థానిక అధికారులకు త్వరగా పని పూర్తి చేయాలని అనధికారిక ఆదేశాలు జారీచేసి వెళ్లారు. దీంతో ఎవిఆర్‌ ఆయిల్స్‌ కంపెనీ ప్రతినిధులు, వైసిపి నేతలు రంగంలోకి దిగారు. రెండుమండలాల పరిధి లోని 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో 27వేల ఎకరాలు సేకరించాలన్నది సజ్జలగారి ఆర్డర్‌.. ఎకరాకు 50వేలు ఇస్తాం.. మర్యాదగా భూములు అప్పగించి వెళ్లండి.. మీరు వెళ్లకపోయినా ఈ ‘‘యజ్జం’’ ఆగదన్నది వైసిపి నేతల చెబుతున్న మాటల్లోని సారాంశం. ఈలోపు మంత్రి పెద్దిరెడ్డి తనయుడు, ఎంపి మిధున్‌రెడ్డి ఈ ప్రాంతంలో రహస్యంగా పర్యటించడంతో దీనివెనుక ఎవరున్నారో పెద్దగా కష్టపడకుండానే తీరప్రాంత వాసులకు అర్థమైంది. అనాదిగా ఈభూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మమ్మల్ని వదిలేయండని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కలెక్టర్‌ గ్రీవెన్స్‌ సెల్‌ స్పందనలో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సంబంధిత విజ్జాపన పత్రం తీసుకొని కనీసం రశీదు ఇవ్వడానికి కూడా ఉన్నతాధికారులు సాహసించలేదంటే ఏ స్థాయిలో వ్యవహారం నడుస్తుందో అర్థంచేసుకోవచ్చు.

మూడుబావుల్లో చమురునిక్షేపాల వెలికితీతకు అనుమతి
కెజి బేసిన్‌ పరిధిలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం కేంద్రంగా మూడువెల్స్‌లో చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీస్తామని ఈ సంస్థ చెబుతోంది. ఇందుకు అవసరమైన ఆఫ్‌ షోర్‌ కార్య కలాపాల కోసం తాము KEI-RSOS  పెట్రోలియం ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ (KRPEL)తో ఒప్పం దం చేసుకున్నామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెప్పి అనుమతులు తెచ్చుకుంది. గతంలో ఓఎన్‌ జిసి వారు డ్రిల్లింగ్‌ చేసి వయొబుల్‌ కాదని చేతులెత్తేసిన 2బావులతోపాటు మరో బావి కలిపి మూడు బావులకు ఎవిఆర్‌ సంస్ధ కేంద్రంనుంచి అనుమతులు తెచ్చుకోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 31న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం కేశవదాసుపాలెం జడ్‌పి హైస్కూలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా, రైతులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన సాక్షి దినపత్రికల్లో మార్చి 1వతదీన వెలువ డిరది. 30రోజుల్లో అభ్యంతరాలు ఉంటే తెలియ జేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. కేశవదాసుపాలెం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అధికారులు ప్రభుత్వానికి ఏమి నివేదిక ఇచ్చారో తెలియదు.

వద్దంటున్నా తీరగ్రామాల్లో ఎవిఆర్‌ సర్వే
ఆ తర్వాత ఎవిఆర్‌ ఆయిల్స్‌ కంపెనీ ప్రతినిధులు, కొందరు వైసిపి పేటిఎం బ్యాచ్‌ సొసైటీ భూములతో సహా జిరాయితీ భూముల్లో సర్వే చేయడం ప్రారంభించారు. కేసనపల్లి సిసిఎఫ్‌ సొసైటీ వారు ఈ సర్వేని అడ్డుకొని తమ భూముల్లో డ్రిల్లింగ్‌ కార్యకలా పాలు నిర్వహించడానికి వీల్లేదని పాలక మండలిలో తీర్మానించారు. భూములు ఇవ్వాలంటూ వైసిపికి చెందిన పేటిఎం బ్యాచ్‌ తీవ్రవత్తిళ్ల నేపథ్యంలో రాజోలు తీరప్రాంత పరిరక్ష సమితి ఆధ్వర్యంలో కేశవదాసు పాలెంతోపాటు తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జులై 6న రెండు మండలాల్లో ఆందోళనలు కూడా నిర్వహిం చారు. ఎస్సీ, సిసిఎఫ్‌, ఆల్‌ క్యాస్ట్‌ సొసైటీ సహకార సంఘాలు ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తీరప్రాంత పరిరక్షణ సమితినాయకులు సఖినేటిపల్లి మండలంలో తీరప్రాంత గ్రామాలైన అంతర్వేది పల్లెపాలెం, అంతర్వేది కర, గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, కేశవదాసుపాలెం, చింతల మోరి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పర్యటించి తమ నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కన్నుపడితే ఎంతమంది అడ్డుపడినా, ఎన్నివేల కుటుంబాలు రోడ్డునపడినా పట్టించుకోడు. రాజోలు తీరంలోకూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. దాదాపు 15వేల దళిత, మత్స్యకార కుటుంబాలు ఆధారపడిన 27వేల ఎకరాల భూములను కేవలం తమ స్వార్థంకోసం బలిపెట్టాలని చూస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులైన జె-గ్యాంగ్‌ చర్యలను అడ్డుకోవడమే ప్రస్తుతం తీరప్రాంత గ్రామాలకు ఉన్న ఏకైకమార్గం.

Tags: 27వేల ఎకరాలుKEI-RSOSఅక్రమసంపాదనఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ఎంపి మిధున్‌రెడ్డిఎవిఆర్‌ ఆయిల్స్‌ఓబులాపురం మైన్స్‌కుంభకోణాలుకేశ వదాసుపాలెంకోనసీమ అంబేద్కర్‌ జిల్లాగజదొంగచమురుజగన్‌రెడ్డిజగన్‌రెడ్డి 2.0జైలుదళితులుదోపిడీదారుడునేరచరితుడు ఫ్యాక్షనిస్టుభూములుమత్స్యకారులుమలికిపురంమైన్‌రాజోలురాపాక వరప్రసాద్‌లక్షకోట్లులేపాక్షి నాలెడ్జి హబ్‌ల్యాం డ్‌వైన్‌వ్యాన్‌ పిక్‌శ్యాండ్‌సఖినేటిపల్లిసజ్జల రామకృష్ణారెడ్డిసహజవాయువుసూట్‌ కేసు కంపెనీసొసైటీ భూములు
Previous Post

నాని వ్యాఖ్యలకు నిరసనగా నిరాహారదీక్ష

Next Post

అమరావతి ఉద్యమ అణచివేతకు జగన్‌రెడ్డి కుట్ర

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య
ఆంధ్రప్రదేశ్

ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య

చైతన్యరధం
@ July 1, 2026
మంగళగిరిలో క్రికెట్ పండుగ
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో క్రికెట్ పండుగ

చైతన్యరధం
@ July 1, 2026
ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సు

చైతన్యరధం
@ June 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist