- చిన్నారి గొంతు కోయడం ఉన్మాద చర్యలకు పరాకాష్ట
- ప్రతి రోజూ రాష్ట్రంలో 49 అఘాయిత్యాలు
అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో తప్పు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోకపోవడంతో వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్మాదులు రెచ్చిపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్రాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో గిరిజన చిన్నారిపై యాసిడ్ పోసి, గొంతు కోయడమే ఇందుకు నిదరర్శనమన్నారు. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ప్రాంతంలోనే దాదాపు 9 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దాడికి గురైన విద్యార్థినికి సరైన వైద్య సదుపాయం ప్రభుత్వం కల్పించలేదు. విద్యార్థులకి మేనమామ అని చెప్పుకొనే జగన్ రెడ్డి అదే జిల్లాలో ఉంటూ కనీసం బాధితురాలిని పరామర్శించలేదు.
జగన్ పాలనలో రోజుకు 49 అఘాయిత్యాలు
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకి సగటున 49మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మన రాష్ట్రం నేరాలు, మహిళలపై జరిగే అఘాయిత్యాలలో దేశంలోనే 8వ స్థానంలో ఉందన్నారు. 2021లో మహిళలపై 17,752 నేర ఘటనలు జరిగా యి. అంటే రాష్ట్రంలో రోజుకు సగటున ఆడబిడ్డలపై 49 అఘాయిత్య ఘటనలు జరుగుతున్నాయి. అరచకాలు పెరగడానికి మూల కారణం మద్యం. మద్యాన్ని నిషేదిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా వైసీపీ నాయకులు గంజాయి, మత్తు పదార్థాల వ్యాపారాలు చేస్తూ యువత భవిష్యత్తుని నాశనంచేస్తున్నారని మండిపడ్డారు.
డీజీపీ చెప్పిన 24 గంటల్లోనే సామూహిక అత్యాచారం
రాష్ట్రంలో మహిళలపై నేరాలను అదుపులోకి తెచ్చామని డీజీపీ ప్రటించిన 24 గంటల్లోపే తిరుపతి జిల్లా కేవీబీ పురంలో చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరం సీతానగరంలో నది ఒడ్డున కాబోయే భర్త సమక్షంలోనే యువతిపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డి మీద, నెల్లూరు జిల్లాలో డపై అత్యాచారయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాకి వస్తున్నందున నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులోని బాధిత చిన్నారిని జగన్‌రెడ్డి పరామర్శించాలి. ఆ బాలికను కాపాడటానికి తగిన చర్యలు తీసుకుని, న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలి.