అమరావతి: ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పోసాని నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.