అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్య క్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో వినా యక చవితి శుభా కాంక్షలు తెలిపా రు. సకల దేవతా గణాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు తన కరుణా కటాక్షాలు మనం దరిపై చూపాలని ఆకాంక్షించారు. ఆయురా రోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మన స్పూర్తిగా ప్రార్థించారు. సకల శాస్త్రాలకు అధి నాయకుడు, జ్ఞానానికి ఆరాధ్యుడు, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడికి ప్రజలంతా భక్తిశ్రద్ధల తో తొలి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. వినాయక చవితి పరమత సహనానికి ప్రతీకగా పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత విభేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి చేసుకునే వినాయక చవితి మండపాలపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమన్నారు. ఆ గణ నాథుడు పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.