.డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిరచిన కార్యకర్తలు
.ఆగ్రహంతో ఆఫీసులోకి చొచ్చుకెళ్లే యత్నం
.రెండుగంటలపాటు గేటు ఎదుట బైఠాయింపు
అమరావతి : కుప్పంలో వైసిపి మూకలు అన్న క్యాంటీన్ విధ్వంసం చేయడం, టిడిపి కార్యకర్తలపై దాడికి దిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీవీల్లో ఘటన విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీశ్రేణులు ప్రదర్శనగా వెళ్లి డీజీపి కార్యాలయాన్ని ముట్టడిరచారు. వైసిపి మూకల దుశ్చర్యపై ఆగ్రహంతో ఊగిపోయిన పార్టీశ్రేణులు ఒకానొక దశలో డీజీపీ ఆఫీసు మెయిన్ గేటును తోసుకొని లోపలకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అదుపుచేయడం అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నేతలవల్ల కాలేదు. సిఎం డౌన్ డౌన్, పోలీసుల వైఖరి నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున డీజీపీ కార్యాలయం వద్ద మొహరించాయి. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న, ఇతర ముఖ్యనేతలు కార్యకర్తలతో కలిసిపోయి డీజీపీ ఆఫీసు ఎదుట సుమారు రెండుగంటలపాటు బైఠాయించారు. ఆ తర్వాత కుప్పం ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించి పాద యాత్రగా కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళనలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, మాజీమంత్రి పీతల సుజాత, బోండా ఉమ,గిడ్డీ ఈశ్వరి, తెనాలి శ్రావణ్‌కుమార్, ద్వారపురెడ్డి జగదీష్,కురగుళ్ల రామకృష్ణ,మెంటే పార్థసారథి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు, నాదెండ్ల బ్రహ్మం, పార్టీ నేతలు కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, జీవీ నాగేశ్వరరావు, బొద్దులూరి వెంకటేశ్వరరావు, పోతినేని శ్రీనివాసరావు, సయ్యద్ రఫీ, అనపర్తి శ్రీనివాస్, రాయపాటి సాయికృష్ణ, సుఖవాసి శ్రీనివాస్, బుచ్చి రాంప్రసాద్, బొప్పూడి వెంగలరావు, యార్లగడ్డ వెంకన్నచౌదరి,దామా మహేష్,పరుచూరి కృష్ణ,పేరయ్య పాల్గొన్నారు.