.దళితులకు గతప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు
.మంగళగిరిలో దళితుల దీక్షలకు లోకేష్ సంఫీుభావం
మంగళగిరి: జగన్ రెడ్డిని దళిత ద్రోహి అని నేను ఊరికే అనడం లేదు.. వైసిపి పరిపాలన వచ్చిన నాటి నుండి దళితుల పై దాడులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులకు లోకేష్ మంగళవారం సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ని వేదించి చంపేశారు. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడి పోరాడినందుకు వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం ని హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసాడు. తిరుపతి లో డాక్టర్ అనితా రాణి వైసిపి నేతల అవినీతి కి సహకరించలేదని వేదించారని అన్నారు. అదేవిధంగా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపేశారు. సిఎం సొంత నియోజకవర్గం పులివెందుల లో దళిత మహిళ నాగమ్మ ని అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యలేదన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఖర్చు ని సబ్ ప్లాన్ గా చూపిస్తున్నారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదన్నారు. దళితుల కోసం అనేక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 26 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. దళితుల స్వయం ఉపాధి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జగన్ రెడ్డి మెంటలోడో, సైకో నో అర్దం కావడం లేదన్నారు. విదేశీ విద్య కి ఉన్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. దళితులకు అనేక హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి పేరు తొలగించడం దారుణం. అంబేద్కర్ పేరు తొలగించినా వైసిపి లో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. తక్షణమే విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దళితుల పై దాడులు ఆపాలి. దాడి చేసిన వైసిపి నేతల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ది దరిద్ర పాదం. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్ల నాలుగు నెలలు అవుతోంది మూడు రాజధానులు అని ఒక్క ఇటుక పెట్టలేదన్నారు. విశాఖని నాశనం చేశారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్ట్ కి విశాఖ లో రోజుకో విషాదం జరుగుతుంది. కర్నూలు లో ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చెయ్యలేదు. అమరావతి అభివృద్ది అడ్డుకున్నారన్నారు. జగన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల లిస్ట్ చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదని లోకేష్ పేర్కొన్నారు.