్జ ఆ వీడియో ఒరిజినల్ కాదని ఎలా చెబుతారు
ఎస్పీ గారూ!
్జ తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన స్క్రిప్ట్ నే ఫకీరప్ప చదివారు
్జ అసలు వీడియో తెప్పించే సత్తా పోలీసులకు లేదా?
్జ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా
మంగళగిరి: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో చూసి దేశమంతా నివ్వెరపోగా…బుధవారం అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ చూసి రాష్ట్రప్రజలంతా నిర్ఘాంత పోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఫకీరప్ప ఎలా చెబుతారు? ఆయన ఏమైనా ఫోరెన్సిక్ నిపుణుడా అని ప్రశ్నించారు. వీడియో మార్ఫింగ్, ఎడిటింగ్ జరిగి ఉందవచ్చని ఎస్పీ చెబుతున్నారు, ఏవిధమైన పరీక్షలు నిర్వహించకుండా ఆయన మార్ఫింగ్ అని ఎలా నిర్థారిస్తారని ప్రశ్నించారు. మాధవ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్టు రాగానే నిజాలు నిగ్గు తేలుస్తామని సకల శాఖల మంత్రి సజ్జల, హోం మంత్రి అనిత, మహిళా కమిషన్ చెప్పి ఇప్పడు మాట మారుస్తు న్నారు. అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ నే అనంతపురం ఎస్పీ పక్కీరప్ప విలేఖరుల సమావేశంలో చదివారని దుయ్యబట్టారు. సెక్షన్ 185 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఎస్పీ చెప్పడం విడ్డూరంగా ఉంది. గోరంట్ల మాధవ్ నేనే కంప్లైంట్ చేశానని చెబితే ఆయన అభిమాని కొణతాల వెంకటేశ్వర రావు కంప్లైంట్ ఇచ్చాడని ఎస్పీ అంటున్నారు. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ.. నిజాలు వెలికితీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏకోశాన లేదు. కోట్లాది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పి కాలం వెళ్లదీసి ఇప్పడు మరో కోణంలో చెబుతున్నారు. కేసును నీరు గార్చడానికి ఇష్యూని డైవర్ట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టించి ఎస్పీతో ఏమీలేని స్టేట్ మెంట్ చెప్పించారు. ఇంతవరకు ప్రభుత్వం ఏ విచారణ జరపలేదు. ఇంత పెద్ద చదువులు చదివిన ఎస్పీ ఈ వీడియో ఒరిజనల్ కాదని కొనుక్కున్నానని తెలపడం అవివేకం. ఒరిజనల్ వీడియో ఒకవ్యక్తి చూస్తుండగా రెండో వ్యక్తి రికార్డు చేశాడు, మూడో వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడని చెబుతున్న ఎస్పీ ఒరిజినల్ వీడియో దొరకలేదని చెప్పడం సిగ్గుచేటు. గోరంట్ల మాధవ్పైో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు కానీ తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకే ఎస్పీ మాట్లాడారు. విజయవంతంగా కుట్రలుపన్ని కేసును నీరుగార్చారు. నిజాలు వెలికి తీయడంలో పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు ఎస్పీ ప్రయత్నించారు. హోంమంత్రి వనిత, సజ్జల రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఫోరెన్సిక్ ల్యాబ్ ఏమైనా అంతరిక్షంలో ఉందా? వీడియో అసలా, నకిలీయా అనేది నిపుణులు తేల్చాల్సి వుంటుంది. వీడియోలో ఉంది ఎంపీనా, కాదా అనేది తెలియడం లేదని చెప్పడం ప్రజల దృష్టిని మరల్చడమే. వీడియో సృష్టించిన వారిని పట్టుకోవాలని ఎస్పీ కోరుతున్నా అనడం వింతగా ఉంది. వీడియో ఎవరు తీశారు.. ఎవరికి పంపారు.. ఎవరు షూట్ చేశారు? అని తేల్చాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీడియోని మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని ఐ.టీడీపీ వాట్సప్ గ్రూప్లోఫ ఫస్ట్ వచ్చింది… 4వ తేదీ అర్ధరాత్రి ఈ వీడియోని పోస్ట్ చేశారు, యూకె నెంబర్ నుంచి వీడియోని పోస్ట్ చేశారని చెప్పడంలో అర్థంలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు ఒక వ్యక్తి పంపిన వీడియోని మరో వ్యక్తి చూస్తుండగా ఇంకో వ్యక్తి వీడియో తీశాడు, ఎస్పీ చెప్పిన మాటలు చిన్న పిల్లవాడు చెప్పినట్లుంది. రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్న ఎస్పీకి అసలు వీడియో తెప్పించడం కష్టమైన పనా? ఈ వీడియో యావత్ సమాజం చూసి అసహ్యింకుంటోందనే కనీస జ్జానం వైసీపీ నాయకులకు లేదు. వీటిపై నిజా నిజాలు బయటికి లాగాల్సిన బాధ్యత మీడియాపై కూడా ఉందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.