- ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం
- డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటో అర్థమైంది
- మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
మంగళగిరి (చైతన్యరథం) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేసిందని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో ఎం తో పురోగతి సాధించింది. జగన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించి… శాంతి భద్రతలు లేకుండా చేశారు.. నాటి పాలనలో రాష్ట్ర అభివృద్ధి లేదు.. సంక్షేమ పథకాలు అమలు చేశా మని చెప్పడమే తప్పు.. జగన్రెడ్డి చేసింది మాత్రం శూన్యం. ఆయన బటన్ నొక్కుడు అంటాడు.. లక్ష మందికి చేరాల్సిన పథకా లు కేవలం 10 వేల మంది చేరేలా చేసేవాడు. చివరి ఏడాది కూడా బకాయిలతోనే పబ్బం గడుపుకున్నాడు. ఇలాంటి దుర్భారమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత మంచిగా ఉండటం వల్లనే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీ సూపర్ సిక్స్. 18 నెల ల్లోనే 90 శాతం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపిం చింది కూటమి ప్రభుత్వం. జగన్రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు.. అధికారంలోకి రాగానే మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 16 వేల మెగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేసింది. తల్లికి వందనం పథ కం.. జగన్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చావ్.
కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని అమలు చేసి చూపించింది. ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లల తల్లులకు లబ్ధి చేకూరింది. జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే పింఛన్ ను రూ.3 వేలు చేస్తానని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ.250 పెంచుతానంటూ జే టార్న్ తీసుకున్నావ్… చివరి ఏడాది 4 నుంచి 5 నెలల ముందు రూ.3 వేలు చేశావ్. కూటమి అధికారంలోకి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించాం. అది కూడా ఏప్రిల్ నెల పెంచిన మొత్తాన్ని లబ్ధిదా రులకు అందజేశాం. దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్ని, తలసే మియా వ్యాధిగ్రస్తులకు .10 వేలు, పూర్తిగా అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి రూ.15 వేలు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఈ రకమైన సంక్షేమం దేశంలో ఎక్కడ కూడా అమలు కావట్లేదు.. జగన్ రెడ్డి పెట్టి పోయిన అప్పులు, ఆర్థిక విధ్వం నం నుంచి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంతో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసుకుంటూ వచ్చారు.
జగన్రెడ్డి విధ్వంసాన్ని ప్రజలు మరువలేదు
గత జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు లేవు.. సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు.. ఇసుకను అపేసి నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురి చేశాడు. లిక్కర్ ద్వారా ఆరోగ్యాలు పాడు చేసి.. కుటుంబాలను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభు త్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ఇవికాకుండా రైతు లకు అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చాం. కౌలు రైతును కూడా ఏ విధంగా అమలు చేయాలనేది చర్చలు జరుగుతున్నాయి. మత్స్యకారులకు రూ.20 వేలు, ఆటో డ్రైవర్లకు రూ.15వేలు అందజేశాం. మైనార్టీలకు, కులవృత్తులపై ఆధారాపడ్డ వారందరికీ కూడా రూ.3600 కోట్లు ఖర్చు చేశాం. ఫాస్టర్లకు గౌరవ వేతనం అందించేందుకు రూ.51 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయిం చింది. ఇమామ్లకు నెల రూ.10 వేలు, మౌజమ్ లకు రూ.5 వేలు, పురోహితులకు నెలకు రూ.15 వేలు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. గత ప్రభుత్వ పాలనలో దూప, దీప నైవేద్యాలకు అని చెప్పారు కానీ, ఎక్కడ అమలు కాలేదు. నాయీ బ్రహ్మణులకు కూటమి ప్రభుత్వం రూ.25 వేలకు గౌరవ వేతనం పెంచింది. జూనియర్ లాయర్లకు రూ.15వేల అందజేశాం. రాష్ట్ర వ్యాప్తం గా పేద మహిళలకు లక్ష కుట్టు మిషన్లు అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్లు తీసేశారు. గ్రూప్ – 1 మీద విచారణ జరుగుతుంది. గ్రూప్ -2లోనూ అవకతవకలు చేశారు. ఉద్యోగస్థులకు సంబంధించి రూ.40 వేల కోట్లు బకాయిలు పెట్టారు. రూ.12 వేల కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లిం చింది. అందులో ప్రధానమైనవి డీఎస్సీ- కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 16 వేల మంది ఇచ్చాం. వాళ్లకు ఉన్న స్టైఫండ్ రూ.4,500 ఉంటే . 12500 పెంచాం. పోలీసు దానిని కానిస్టేబుల్స్ సెలక్షన్ జరగా ల్సి ఉండగా జగన్రెడ్డి చిన్న చూపు చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు 5,757 ఎంపికైన కానిస్టేబుళ్లను కుటుంబాలతో సహా పిలిచి అపాయింట్మెంట్ అందజేసినప్పుడు వారి ఆనందం మాట ల్లో చెప్పలేం. అదే కూటమి ప్రభుత్వానికి దీవెన, అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ కూడా అందజేశాం. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చే నాటికి అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు రూ.లక్ష కోట్లు. అవి తీర్చుకుంటూ.. రైతులకు ధాన్యం బాకీలు తీర్చి. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించి… కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తుల బకాయిలు తీర్చి చంద్రబాబు గాడిన పెడుతున్నారు. జగన్రెడ్డి పాలనలో రూ.450 కోట్లతో విశాఖపట్నంలోని కొండమీద అతిథి గృహాలు కట్టుకున్నాడు.
విమాన ప్రయాణ ఖర్చులకు రూ.222 కోట్లు అయ్యాయి. ఇటు వంటి దుబారా ఖర్చులను చూసుకుంటే భారీగా దుర్వినియోగం కనిపిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి మొదటి ప్రాధా న్యతనిస్తుంది. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో రూ.24 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు చేసుకున్నాయి. దీంతో దాదాపు 25 నుంచి 26 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. మేము ఎన్నికల హామీల్లో ఇచ్చింది 20 లక్షల ఉద్యోగాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1.. మళ్లీ ఆ స్థానానికి వెళితేనే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందు తుంది. క్వాంటం వ్యాలీతో అమరావతి ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
అభివృద్ధిని నిరోధించే వ్యక్తి జగన్రెడ్డి..
మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల 600 సీట్లు రాష్ట్ర విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధిని నిరోధించే వ్యక్తి జగన్రెడ్డి.. ఈ రాష్ట్రానికి కొట్టిన దెబ్బ రాష్ట్ర ప్రజలకు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఆయన చేసిన ఆర్థిక విధ్వంసం ఏ విధంగా ఉందో ఊహించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లటం చాలా కష్టం. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళు తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు పూర్వవైభవం తీసుకొచ్చేం దుకు పవన్కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు చేపట్టి మెగా పేటీఎంను నిర్వహించారు. పిల్లలు పాఠశాలలో ఏమి చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉండా లనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు రిజర్వాయర్లలో 1600 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో భూగర్భ జలాల నిల్వ స్థాయి పెరిగాయి. కరువుతో అలమట్టించే రాయలసీమలో కూడా ఎక్కడ బోర్ వేసినా నీరు వస్తున్నాయి. కేవలం రాష్ట్రాన్ని ముందు నిలబెట్టి తరువాత పరుగులు పెట్టించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచిన జగన్రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు వచ్చింది. యూనిట్కు రూ.0.13 పైసలు తగ్గించామని తెలిపారు.











