- దీర్ఘకాలిక ప్రణాళికలతో మిగులు రాష్ట్రంగా ఏపీ
- జగన్ తుగ్లక్ చర్యలతో ఆ రంగం సర్వనాశనం
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే విద్యుత్ కొనుగోళ్లను 60 శాతం మేర తగ్గించినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో మంగళవారం సమీక్షించారు. విద్యుత్ రంగానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. జగన్ తుగ్లక్ చర్యలతో సంక్షోభంలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు అను సరించాల్సిన వ్యూహాలపై ఉన్నతాధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తితో విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని 60 శాతానికి తగ్గించినట్లు వివరించారు. ఇటీవల రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన జెన్‌కో సంస్థ ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తోనే సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అతి కొద్దినెలల్లోనే పూర్వవైభవం దిశగా తీసుకెళ్లామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే వేసవి విద్యుత్ వినియోగాన్ని దృష్టి లో ఉంచుకుని పారిశ్రామిక, గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికా రులు ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం సుమా రు 6 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టా లన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు భిన్నంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందు లూ లేకుండా చూడాలని ఆదేశించారు. పునరుత్పాదక విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, జాయింట్ సెక్రటరీ కుమార్‌రెడ్డి, అధికా రులు పాల్గొన్నారు.