- చేనేత రంగంలో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి
- 15 వేల మందికి ఉద్యోగావకాశాలు
- త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు
- మరిన్ని సంస్థలతో చర్చలు ఫలప్రదం
- చంద్రబాబు బ్రాండ్‌తో ఏపీకి పెట్టుబడుదారుల క్యూ
- త్వరలో ఆంధ్రలోనూ పెట్టుబడిదారుల సదస్సు
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత వెల్లడి
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగంలో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకొచ్చాయని, రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత వెల్లడిరచారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు గురించి, చేనేత రంగంలో అవకాశాలు గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని వెల్లడిరచారు.
చేనేత పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని, నాణ్యమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవలే నూతన టెక్స్‌టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సవిత చర్చలు జరిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, అడ్వాన్స్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఈ సంస్థలు ప్రతినిధులు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ పెట్టుబడులుపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకోడానికి రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి సవితకు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
వీరే కాకుండా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి సవిత నేతృత్వంలో ఏపీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో రూ.400 కోట్ల మేర అప్ సైక్లింగ్‌కు అవకాశాలున్నాయన్నారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని పెట్టుబడుదారులకు మంత్రి సవిత సూచించారు. త్వరలో మరిన్ని ఎంవోయూలు కుదుర్చుకోనున్నామని మంత్రి వెల్లడిరచారు. కర్నాటకకు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్‌టైల్స్ పార్క్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. రష్యాలో టెక్స్‌టైల్స్ వేర్ హౌస్ ఏర్పాటుకు ఏపీకి చెందిన గుంటూరు టెక్స్‌టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని మంత్రి సవిత వెల్లడిరచారు.
చంద్రబాబు బ్రాండ్‌తో పెట్టుబడుల వెల్లువ
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. న్యూఢల్లీిలో ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. 126 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారన్నారు. భారత్ టెక్స్ వల్ల చేనేత రంగంలో పెట్టుబడులకు, చేనేత వస్త్రాల మార్కెటింగ్‌కు కొత్త అవకాశాలు లభించాయన్నారు. ఖాదీ ఈజ్ ఏ నేషన్…ఖాదీ ఈజ్ బి కమింగ్ ఫ్యాషన్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా ఆధారపడిన రంగం చేనేత రంగమేనన్నారు. ఏపీలో చేనేత రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలు అత్యధిక శాతం చేనేత ఉత్పత్తుల్లో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబునాయుడు చేనేత పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు.
2014-19 మధ్య చేనేత పరిశ్రమకు, నేతన్నలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దీంతో ఆ ఐదేళ్లు చేనేతకు స్వర్ణయుగంగా మారిందన్నారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం చేనేతపై చిన్నచూపు చూడడంతో, నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడంతో, చేనేత పరిశ్రమకు మంచిరోజులు ప్రారంభమయ్యాయన్నారు. చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన పాలనాదక్షతపై నమ్మకంతో ఎందరో పెట్టుబడుదారులు ఏపీలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. చేనేతతో సహా మరెన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారన్నారు.
త్వరలో ఏపీలో పెట్టుబడుదారులతో సమావేశం
భారత్ టెక్స్ అందించిన స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి అనువైన వాతావరణం కల్పించారన్నారు. సుస్థిరమైన పాలనతో పాటు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏపీలో పలు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు. చేనేత రంగంలోనూ పెట్టుబడులు పెట్టేలా ఏపీలోనూ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడిరచారు.
35 హస్తకళలకు కేంద్రం గుర్తింపు
వన్ డిస్ట్రిక్-వన్ ప్రొడక్ట్ కింద రాష్ట్రంలో 35 హస్తకళలకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి సవిత వెల్లడిరచారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల జీవన విధానాలకనుగుణంగా హస్తకళలు అభివృద్ధి చెందాయన్నారు. ఏటికొప్పాక, ఆదివాసీ సవర చిత్రాలు వంటి హస్తకళలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఇలా 35 హస్త కళలకు వన్ డిస్ట్రిక్-వన్ ప్రొడక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ హస్తకళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాయన్నారు. దీనిద్వారా హస్త కళాకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా ఆర్థిక భరోసా లభించే అవకాశముందన్నారు.
రాష్ట్రానికి చేయూనితనివ్వండి
అంతకుముందు కేంద్ర చేనేత, జౌళి శాఖ కార్యదర్శి బీనాను మంత్రి సవిత కలిసి పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు, నేతన్నలకు అండగా నిలవాలని కోరారు. సర్వశిక్ష అభియాన్‌లో చేనేత దుస్తులు వాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యదర్శి బీనా దృష్టి తీసుకెళ్లారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పలు స్టాళ్ల సందర్శన
భారత్ టెక్స్ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. ఆయా రాష్ట్రాలు, దేశాల సంప్రదాయలకు అనుగుణంగా తయారైన దుస్తులను పరిశీలించారు. వాటి నాణ్యత, తయారీ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్‌లో నిర్వహిస్తున్న చేనేత ఎగ్జిబిషన్‌ను కూడా మంత్రి సందర్శించారు. అమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.