చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Jan 29, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల వైద్యకళాశాల అభివృద్ధి
  • అర్జున గ్రహీత జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం, స్థలం
  • హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణం
  • అమరావతిలో వీధిపోటు ప్లాట్లకు ప్రత్యామ్యాయ ప్లాట్లు
  • అక్కడ భూములు లేని పేదలకు పింఛన్ల మంజూరు
  • తితిదే పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్, భూకేటాయింపులు
  • కృష్ణాపట్నం పోర్టుకు అటవీ భూముల బదిలీకి నిర్ణయం
  • లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి నివేదికపై చర్చ
  • వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో క్యాబినెట్ సమా వేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తితిదే లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివే దికపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ వేసిన విషయాన్ని అధికారులు చెప్పారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత..దానిపై స్పందించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచా ర విభాగంలో సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

కేబినెట్ భేటీలో కీలకాంశాలు..
* పిడుగురాళ్ల వైద్యకళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చ
* పలమనేరులో లైవ్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు ఆమోదం
* అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాలస్థలం ఇచ్చేందుకు ఆమోదం. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
* ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ. 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం
అమరావతి పరిధిలోని వీధిపోటుభూములు పొంది న రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం
* అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుకు ఆమోదం
* తితిదే పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్, పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
* అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్ స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదం
* పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం.
* ఇంధనశాఖలో పలుపరిపాలన అనుమతులకు ఆమోదం
* తిరుపతి, విశాఖపట్నం శిల్పారామం ప్రాజెక్టుల కోసం వీ/ గార్డెన్సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్కు జారీ చేసిన ఎల్వాజేలను రద్దు చేసి కొత్తగా ఈడీఐలను ఆహ్వానించాలని మంత్రివర్ణ నిర్ణయం
* పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి నిర్ణయం క్యాబినెట్ ఆమోదించించిన అజెండా అంశాలు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-01-2026

కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

ఎస్వీయూ నుంచి ఏఎంసీకి భూమి బదిలీ
పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్యకార శాఖ:

చిత్తూరు జిల్లా పలమనేరులోని లైవ్ స్టాక్ రీసెర్చ్. స్టేషన్కు చెందిన 33 ఎకరాల భూమిని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, పలమనేరుకు బదిలీ చేయడానికి అనుమతి ఇచ్చింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పరిహార మొత్తం చెల్లించి, నిర్ణయించిన ప్రక్రియ ప్రకారం భూమి స్వాధీనం చేసుకు ని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని స్థాపించడానికి అనుమతి ఇచ్చింది. చిత్తూరు జిల్లా పలమనేరులో వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్ సరిపోవడం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వర వెటరినరీ యూనివర్సిటీకి
చెందిన 33 ఎకరాల భూమిని మార్కెట్ కమిటీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. దీనికి సంబంధించి మార్కెట్ కమిటీ ఇప్పటికే రూ. 1.45 కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. ఈ కొత్త యార్డ్ రావడం వల్ల రైతులకు అమ్మకాలు చేసుకోవడానికి స్థలం దొరుకుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. పలమనేరు పట్టణ పరిధిలో ఉన్న ప్రస్తుత
వ్యవసాయ మార్కెట్ కమిటీని రైతు బజార్ సొసైటీకి అప్పగించి వాణిజ్య సౌకర్యాలతో కూడిన ఆధునిక రైతుబజార్ అభివృద్ది చేయాలని ఆదేశించింది.

పీపీపీ మోడ్ లో పిడుగురాళ్ల వైద్య కళాశాల అభివృద్ధి
ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ:
పిడుగురాళ్ల లోని ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ మోడ్లో అప్ గ్రేడ్ చేయడానికి జీవో 4, 5, 6, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించింది. పిడుగు రాళ్ళలో 100 ఎంబీబీఎస్ సీట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను క్యాబినెట్ ఆమోదించింది. జాతీయ వైద్య కమిషన్ (చీవీజ) నిబంధనల ప్రకారం ఇక్కడి ఆసుపత్రి బెడ్ల సంఖ్యను 330 నుంచి 420కి పెంచారు. ఈ కాలేజీ. ఆసుపత్రి నిర్వహణ కోసం మొత్తం 837 పోస్టులను మంజూరు చేశారు. దీనివల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు, మెడికల్ విద్యార్థులకు మంచి శిక్షణ అందుతుంది.

ఏపీ శిల్పారామం సొసైటీకి అధికారాలు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ: ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ముఖ్య కార్యనిర్వాహక అధి కారికి కింది అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించింది.

– శిల్పారామం, తిరుపతిలో కన్వెన్షన్ సెంటర్ విత్ గెస్ట్ రూమ్స్ స్పా, విశాఖపట్నంలో బొటిక్ హోటల్/ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి కోసం వీ/0 గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంకు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్్వఐఎస్) ను రద్దు చేయడానికి, ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ / కల్చరల్ సొసైటీతో కాన్సెషన్ అగ్రిమెంట్, లీజ్ డీడ్ అమలు చేసే షరతును పూర్తిగా షరతులు లేకుండా నెరవేర్చడంలో విఫల మవడం దృష్ట్యా ఎల్వోఐ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-వీ/స్ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన బిడ్ సెక్యూరిటీ, ఇతర చెల్లింపులను ఆర్ఎఫ్పీ షరతుల దృష్ట్యా జప్తు చేయడానికి
-భూముల కోసం కొత్తగా ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ను ఆహ్వానించి, ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులందరికీ ప్రస్తుత మార్కెట్ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రతిపాదనలను సమర్పించే అవకాశం కల్పించడానికి ఏపీ శిల్పారామం సొసైటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారికి అధికారం కల్పించింది.

జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం, స్థలం
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిన అగ్రశ్రేణి అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజ్ జ్యోతిని ప్రభుత్వం ఘనంగా గౌరవించా లని నిర్ణయించింది. ఒలింపిక్స్లో పాల్గొనడం, 2023, 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లలో వరుసగా బంగారు పతకాలు సాధించడం, ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకోవడం వంటి ఆమె అసమానమైన విజయాలను క్యాబినెట్ ప్రత్యేకంగా అభినందించింది. ఇప్పటికే ప్రభుత్వం ఆమెకు వివిధ పతకాల సాధన కోసం దాదాపు రూ.85 లక్షల నగదు ప్రోత్సాహకాలతో పాటు, విదేశీ శిక్షణ, ఆహారం, ఇతర అవసరాల కోసం సుమారు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఆమె సాధించిన ఈ అసాధారణ విజయాలకు గుర్తింపుగా విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలాన్ని కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఆమె తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదాలో (డిప్యూటీ కలెక్టర్ కాకుండా ఇతర పోస్టులు) ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం.గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రీడాకారుల కృషిని. గౌరవించడం ద్వారా రాష్ట్రం లోని ఇతర క్రీడాకారులకు భరోసా కల్పించడం, యువతను క్రీడల వైపు ఆకర్షించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్యఉద్దేశం

గుంటూరులో కల్చరల్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ జోన్
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ:
శిల్పారామం, గుంటూరులో కల్చరల్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ జోన్ను అభివృద్ధి చేయడానికి ఎక్స్వర్డ్ కమిటీ సిఫార్పు చేసిన విధంగా 1.47 ఎకరాల భూమిని సీఈవో, ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్ కల్చ రల్ సొసైటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విజయవంతమైన బిడ్డర్ ఎం/ఎస్ రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లేదా లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేయడానికి అజరాకి అధికారం కల్పించింది. ఈ సంస్థ సుమారు రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 మంది పట్టే హాల్, పిల్లల ఆటస్థలం వంటివి నిర్మిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు లేకుండా కొత్త సౌకర్యాలు వస్తాయి.

ఏపీ టిడ్కోకు రూ.4,451 కోట్లు రుణం
పురపాలక/ పట్టణాభివృద్ధి శాఖు రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ యూనిట్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం. కోసం హడ్కో నుండి రూ.4,451 కోట్ల టర్మ్ లోన్ పొందేందుకు ఏపీ టిద్యోకు ప్రభుత్వ హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్లను జూన్ 2026 నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. పీఎం ఏవై-10 కింద ఇళ్లు/ స్థలాలు కావాలని దాదాపు 10లక్షల మంది దరఖాస్తు చేస్తుకున్నారు.. అవి పరిశీలనలో ఉన్నాయి. వీటిలో దాదాపు 7.50 లక్షల వరకూ అర్హులు ఉండవచ్చు. దాదాపు 2.50 లక్షల మందికి ఇళ్లు స్థలాలు లేవని సర్వేలో తెలిసింది. పీఎంఏవై-1.0లో ఉన్న గృహాలను అన్నింటినీ అక్టో బరు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం చారు. తదుపరి 7.50లక్షల గహాలను కూడా చేపట్ట డం జరుగుతుంది. 2029కల్లా రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు అందరికీ శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు సమకూర్చాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.

అమరావతిలో వీధి పోట్ల ప్లాట్ల రద్దు.
ప్రత్యామ్నాయ ప్లాట్లు
పురపాలక/పట్టణాభివృద్ధి శాఖః అమరావతిలో రహదారి అడ్డంకులు ఉన్న ప్లాట్లను (కేటగిరీ ఏ, బీ-అభ్యంతరకరమైన ప్లాట్లు) రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సీఆర్డీఏ కమిషనరు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కల్పించింది. లాటరీ ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించే అధికారం ఇచ్చింది. రద్దు, ప్రత్యామ్నాయ కేటాయింపు తర్వాత ఖాళీ అయిన ప్లాట్లను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 2.61 లక్షల ఇళ్లను జూన్ 2026 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు ఇచ్చిన ప్లాట్లలో వాస్తు పరంగా కొన్ని ఇబ్బందులు (రోడ్డు హిట్స్) ఉన్నాయని గుర్తించారు. ఇలాంటి అభ్యంతరాలు ఉన్న 112 ప్లాట్లను రద్దు చేసి వారికి లాటరీ ద్వారా వేరే ప్లాట్లు ఇవ్వనున్నారు. అయితే ఈ సదుపాయం కేవలం ఇంకా ఎవరికీ అమ్మని (మ్యుటేషన్ అవ్వని) ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుంది.

పురపాలక/పట్టణాభివృద్ధి శాఖ తల్లిదండ్రులిద్దరూ
మరణించిన కుటుంబాల మైనర్ పిల్లలకు ల్యాండ్ స్ పూర్ పెన్షన్ను బదిలీ చేయడానికి కమిషనర్, ఏపీసీఆర్ కు అధికారం కల్పించింది. గతంలో మైనర్లకు పెన్షన్ ఇచ్చే వీలుండేది కాదు. కానీ ఇప్పుడు ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా వారి సంరక్షకుల పర్యవేక్షణలో ఈ సాయం అందుతుంది.
– 29 ప్రదేశాలలో భౌతిక మౌలిక సదుపాయాల పనులను రద్దు చేసి మళ్లీ టెండర్ ఇవ్వడానికి, పీఎంఏవై (యూ) – 1.0 కింద బ్యాలెన్స్ పసుల .226.36 ໘ (= 2025-26) సవరించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు ఆమోదం తెలిపింది.

టీటీడీలో పోస్టుల అప్ గ్రేడు అనుమతి
రెవెన్యూ (దేవదాయ) శాఖ: తిరుమల తిరుపతి
దేవస్థానాల (టీటీడీ) వైద్య విభాగంలో లాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్/ ఫిజియోథెరపిస్ట్లో ఒక్కొక్క పోస్ట్ను అప్గ్రేడ్ చేసి సీనియర్ లాబ్ టెక్నీషియన్, చీఫ్ రేడియోగ్రాఫర్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ పోస్ట్లను సృష్టించడానికి అనుమతి ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని అసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు పెరగడం వల్ల వాటిని పర్యవేక్షించేందుకు సీనియర్ పోస్టులు అవసరమయ్యాయి. దీనివల్ల చాలా ఏళ్లుగా ఒకే హోదాలో ఉన్న సిబ్బందికి ప్రమోషన్లు లభిస్తాయి, వైద్య సేవలు కూడా మెరుగుపడతాయి.

– శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం చట్టం, 29 అఫ్ 2006లోని సెక్షన్ 37 (1), సెక్షన్ 38 (2)ను సవరించి పేర్కొన్న సెక్షన్ల నుంచి “లెప్రసీ” అనే పదాన్ని తొలగించడానికి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా ఉండేందుకు ఈ మార్పు చేశారు.

రుణ పరిమితి పెంపునకు అనుమతి
రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ: షెడ్యూల్డ్ కులాలు,
షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వడానికి అదనపు వనరులను సమీకరించడానికి సంబంధించిన ఉత్తర్వులను ఆమోదించింది. బాండ్ జారీకి సంబంధించిన ఖర్చుకు సంబంధించిన అంశాలను ఆమోదించింది. జీవో 345, రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ, తేది 22-07-2023లో మంజూరు చేసిన అనుమతిని పునరుద్ధరించడం ద్వారా ఏపీఎన్బీసీఎల్ యొక్క రుణ తీసుకునే పరిమితులను అదనంగా రూ.11,850 కోట్లు పెంచి సెబీ నిబంధనలకు అనుగుణంగా రూ.11,850 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (చీజణం) జారీ చేయడానికి అనుమతి ໑໐໖. 5 345, 6 22-07-20230 పేర్కొన్న అనెక్చర్లోని నిబంధనలు, షరతులకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత రూ.11,850 కోట్ల రుణం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్యూఆర్, డిబెంచర్ ట్రస్టీ, వీ/ట. బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ మధ్య అమలు చేయబడే త్రిపక్ష ఒప్పందం ద్వారా ప్రభుత్వ హామీను విస్తరించడానికి ఆమోదం తెలిపింది.

దేవాలయ అభివృద్ధికి భూమి
డెవెన్యూ శాఖ: తిరుమల తిరుపతి దేవస్థానాల
జగన్నాధపురం Hiío I.S.రాఘవపురం (ఎ) ద్వారక ລ້ຍ ລ້ Sy.No. 425/1940 2 ఎకరాల ప్రభుత్వ భూమిని Smt. కోచర్లకోట లలితమ్మ, W/o వెంకట కామరాజుకు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. షిరిడీ సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం మార్కెట్ విలువ రూ.30,00,000/- ఎకరాకు (అంటే రూ.60,00,000/-) చెల్లింపుపై ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. UDA + DPR & NOC సమర్పణకు లోబడి ఈ భూమి కేటాయింపు జరుగుతుంది. ఈ భూమి ప్రస్తుతం ‘కొండ పోరంబోకు’గా ఉంది, అక్కడ ఇప్పటికే ఆలయ నిర్మాణం చేసి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిని క్రమబద్ధీకరించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వం ఎకరాకు రూ. 30 లక్షల ధరను నిర్ణయించింది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణాపట్నం పోర్టుకు అటవీ భూముల బదిలీ
-14, 16, 27, 28, 29. అటవీ భూముల బదిలీ: కృష్ణాపట్నం పోర్ట్ దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్, రైలు-రోడ్డు కనెక్టివిటీ కోసం కొన్ని ద్వీపాలు అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న ‘గాయాలు’ లేదా ‘కొండ పోరంబోకు భూములను అటవీ శాఖకు అప్పగించారు. దీనిపై గ్రామసభల్లో అభ్యంతరాలు రాకుండా తహసీల్దార్లు చర్యలు తీసుకున్నారు.

రెవెన్యూ శాఖ: నెల్లూరు జిల్లా, రాపూరు
మండలంలోని పంగిలిలో 1532 (పాత సర్వే నెం:1)లో 216 ఎకరాల ప్రభుత్వ భూమిను అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. ముత్తుకూరు మండలంలోని ఎపూర్ ఆర్ఎఫ్ 1033 ఎకరాల అటవీ భూమిని డైవర్షన్ చేసి కృష్ణాపట్నం ఓడరేవు అభివృద్ధికి ఈ భూమిని కేటాయించడం జరిగింది.

నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 323లో 230 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. మూతుకూర్ మండలంలోని ఎవూర్ ఆర్ఎఫ్ 1033 ఎకరాల అటవీ భూమిని డైవర్షన్ చేసి కృష్ణాపట్నం ఓడరేవు అభివృద్ధికి ఈ భూమిని కేటాయించడం జరిగింది..
నెల్లూరు జిల్లా, కొండపురం మండలం, తురువ యెజ్జబల్లి గ్రామంలోని 707లో 468.06 ఎకరాల ప్రభుత్వ భూమిను అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. మూతుకూర్ మండలంలోని ఎపూర్ఆర్ఎఫ్ 1033 ఎకరాల అటవీ భూమిని డైవర్షన్ చేసి ఉచితంగా కృష్ణాపట్నం ఓడరేవు అభివృద్ధికి ఈ భూమిని కేటాయించడం జరిగింది..
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం, దేవరాజు-సురయపల్లి గ్రామంలోని 317-1, 318-1, 319, 320-1 మొదలైన వాటిలో మొత్తం. 27.91 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. మూతుకూర్ మండలంలోని ఎవూర్ ఆర్ఎఫ్ 1033 ఎకరాల అటవీ భూమిని డ్రైవర్షన్ చేసి ఉచితంగా కృష్ణాపట్నం ఓడరేవు అభివృద్ధికి ఈ భూమిని కేటాయించడం

– నెల్లూరు జిల్లా గుడినారవ గ్రామం, ఉదయగిరి మండలంలోని సర్వే నం. 163 (పాత సర్వేనెం.1-2)లో 87.97 ఎకరాల ప్రభుత్వ భూమిను అటవీ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. ముత్తుకూరు మండలంలోని ఎపూర్ ఆర్ఎఫ్ 1033 ఎకరాల అటవీ భూమిని డ్రైవర్షన్ చేసి ఉచితంగా కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధికి ఈ భూమిని కేటాయించడం జరిగింది.

సోలార్ ప్రాజెక్టుల కోసం భూములు
15, 20, 21, 23, సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం లీజులు: ఈ ప్రాజెక్టుల కోసం 36 నెలల నిర్మాణ కాలం మరియు 25 ఏళ్ల నిర్వహణ కాలం (మొత్తం 33 ఏళ్లు) కేటాయించారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఈ లీజులను ఖరారు చేశారు. భూమి అప్పగించిన వాటి నుండి లీజు అద్దె అమలులోకి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది.

రెవెన్యూ శాఖ: తాడిపత్రి మండలం తలారిచెరువు
అలూరులోని 17,18 మొదలైన వాటిలో మొత్తం 2648.08 ఎకరాల (తలాదిచెరువు విలేజ్ లో 2191, 57 ఎకరాలు, అలూరు విలేజ్లో 456.51 ఎకరాలు) ప్రభుత్వ భూమిను లీజు ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ (ప్రైవేట్ లిమిటెడు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం మార్కెట్ విలువపై 10% చెల్లింపుపై ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. తలారిచెరువు విలేజ్ ఎకరాకు రూ.3,15,000/- అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.31,500/-, అలూరు విటీజ్ మార్కెట్ విలువ ఎకరాకు రూ.2,50,000/- అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.25,000/- చొప్పున. లీజు రేటు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఐదు సంవత్సరాలకు 10% ఎస్కలేషన్తో 33 సంవత్సరా• వరకు లీజు కాలం ఉంటుంది.

– గాలివీడు మండలం తుముకుంటలోని 977/1 977/2 మొదలన వాటిలో మొత్తం 52.99 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. 100 వీని అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం. లీజు రేటు ఎకరాకు రూ.31,000/ సంవత్సరానికి చెల్లింపుపై ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. రెండు సంవత్సరాలకోసారి 5% ఎస్కలేషన్తో 30 సంవత్సరాల కాలానికి ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 నిబంధనల ప్రకారం లీజు ఇవ్వడం జరుగుతుంది.

– నంద్యాల జిల్లా గాడివేముల మండలం గాని గ్రామంలోని 748ఏ మొదలైన వాటిలో 54227 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. వీణ డె జజరా రాజూకు కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ (1000 ఎండబ్ల్యూ) అభివృద్ధి కోసం లీజు మొత్తంపై 10% చెల్లింపుపై ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. మార్కెట్ విలువ ఎకరాకు రూ.2,00,000/- అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.20,000/- చెల్లింపుపై (గాని గ్రామంలో 2015 సంవత్సరంలోనే అడ్వాన్స్ పజేషన్ ఇచ్చినందున) ప్రతి ఐదు సంవత్సరాలకు 10% ఎస్కలేషన్ 33 సంవత్సరాల వరకు లీజు కాలం ఉంటుంది.
గాలివీడు మండలంలోని తుముకుంట, వేలిగల్లు గ్రామాలలో మొత్తం 1187.58 ఎకరాల (అంటే తుముకుంట గ్రామంలోని సర్వే 197, 200 మొదలైన వాటిలో 1100,03 ఎకరాలు, వేలిగల్లు గ్రామంలోని 432-2, 434-3 మొదలైన వాటిలో 87.55 ఎకరాలు) ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపది కన ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడానికి ఆమోదం తెలిపింది.

500 ఎండబ్ల్యూ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం లీజు మొత్తంపై 10% చెల్లింపుపై ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. తుముకుంట గ్రామంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.2,00,000/- అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.20,000/- మరియు వేలిగల్లు గ్రామంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.2,50,000/- అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.25,000/- చొప్పున లీజు రేటు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఐదు సంవత్సరాలకు 10% ఎస్కలేషన్తో 33 సంవత్సరాల వరకు లీజు కాలం ఉంటుంది.
రామాయపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ పాప్కు భూములు

17, 24, 25, రామాయపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ హల్: పోర్టు చుట్టుపక్కల ఉన్న రావురు, చెవురు గ్రామాల్లో సుమారు 1831 ఎకరాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడానికి నిరాకరించినా ప్రజలందరికీ మేలు చేసే పారిశ్రామికాభివృద్ధి కాబట్టి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. ఇక్కడ పరిశ్రమలు రావడం వల్ల వెనుకబడిన ప్రాంతాల రూపురేఖలు మారుతాయి.

రెవెన్యూ శాఖ: గూడ్లూరు మండలం రావురు
గ్రామంలోని నాఎ. చీశీం.659-9, 660-4 మొదలైన వాటిలో 8.06 ఎకరాల ప్రభుత్వ భూమిని రామాయపట్నం పోర్ట్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. మార్కెట్ విలువ రూ.15,00,000 ఎకరాకు అంటే రూ.1,20,90,000/- (8.06 ఎకరాలకు) చెల్లింపుపై సాధారణ షరతులకు లోబడి ఈ భూమి కేటాయింపు జరుగుతుంది.

– గూడ్లూరు మండలం రావురు గ్రామంలోని సర్వే నెంబర్లు 39, 48-1 మొదలైన వాటిలో 70,61 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. రామాయపట్నం నాన్-మేజర్ పోర్ట్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.15,00,000.. మొత్తం ఖర్చు అంటే 70.61 ఎకరాలకు రూ.10,59,15,000/- చెల్లింపుపై సాధారణ షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది.
– గూడ్లూరు మండలం చెవురు గ్రామంలోని సర్వే నెంబర్లు 185, 198 మొదలైన వాటిలో 16,46 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. రామాయపట్నం పోర్ట్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు మార్కెట్ విలువ ఎకరాకు రూ.20,12,133 మొత్తం ఖర్చు అంటే 16.46 2 6.3,31,19,700 3 సాధారణ షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఈ భూమిని కేటాయిస్తారు.

బయోగ్యాస్ ప్లాంట్ కు భూమి
18, 26, రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు: ఈ ప్లాంట్ల వల్ల పంట వ్యర్ధాల నుంచి గ్యాస్ తయారవుతుంది, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్ఆర్డీసీఏపీ ఈ ప్రాజెక్టుకు మధ్యవర్తిగా ఉంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా ఈ భూములను సదరు సంస్థకు అప్పగించే ప్రక్రియ మొదలైంది.

రెవెన్యూ శాఖ: ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం
పెదైర్లపాడులోని సర్వే నెంబరు 652లో 475.57 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. ఎజ డ వీణ, చీ జుణజారా కు వీట రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరాకు రూ.15 వేలు సంవత్సరానికి చొప్పున ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది.
రెండేళ్లకోసారి 5% ఎస్కలేషన్తో గరిష్టంగా 30 సంవత్సరాల వరకు లీజు కాలం ఉంటుంది.
– ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం, యగెమడుగు గ్రామంలోని 1069,15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలి పింది. NREDCAP కు వీట రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంప్రెస్ట్ ఐయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరాకు రూ.15 వేల చొప్పున ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. రెండేళ్లకోసారి 5% ఎస్కలేషన్తో గరిష్టంగా 30 సంవత్సరాల వరకు లీజు కాలం ఉంటుంది..
కేంద్రీయ విద్యాలయ స్కూల్కు భూ
కేటాయింపు

రెవెన్యూ శాఖ: అన్నమయ్య జిల్లా మదనవల్లె
మండలం వలసపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 496/2 మొదలైన వాటిలో 6,09 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. న్యూ ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ను సివిల్ సెక్టార్లో ఏర్పాటుకు ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. స్థానిక పంచాయతీ కూడా దీనికి పూర్తి మద్దతుగా తీర్మానం ఇచ్చింది. ఈ పాఠశాల వల్ల స్థానిక పిల్లలకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన విద్య ఉచితంగా అందుతుంది.

మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి
రెవెన్యూ శాఖ: కర్నూల్ జిల్లా యెమ్మిగనూర్ మండలం బనవాసి గ్రామంలోని సర్వే నెంబర్లు 343,344/2 2 77.37 2 ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలి పింది. మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం ఈ భూమిని కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్లగ్-అండ్-ప్లే పథకంతో దీనిని అనుసంధానించనున్నారు. ఈ భూమిలో ప్రస్తుతం యూకలిప్టస్ చెట్లు ఉన్నాయి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఇక్కడ భారీ ఎత్తున ఉపాధి కల్పన జరగనుంది.

అమ్యూజిమెంట్ థీమ్ పార్కు భూమి
రెవెన్యూ శాఖ: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం నందకోట గ్రామంలోని సర్వే 30: 22-15 0.30 25, 2 30: 22-3లో 2.60 ఎకరాలు, 22-5లో 7.79 ఎకరాలు, 22-6లో 1.90 ఎకరాలు, మొత్తం 12.59 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ తో కూడిన ఫైవ్ స్టార్ రిసార్ట్ కమ్ కన్వెన్షన్ సెంటర్. అభివృద్ధి కోసం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కేటాయింపు జరుగుతుంది. ‘ఎకో-బల్’ (జుషశ్-సంశ్రీవ) పేరుతో ఈ పర్యాటక ప్రాజెక్టును చేపడుతున్నారు. నీటి వనరుల శాఖ మరియు రెవెన్యూ శాఖ సంయుక్తంగా తనిఖీ చేసి, ఎలాంటి వివాదాలు లేని 12.59 ఎకరాలను ఎంపిక చేశాయి. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగం పెరగడం వల్ల స్థానికులకు కొత్త అవకాశాలు వస్తాయి.

రెవెన్యూ శాఖ ప్రభుత్వం జీవో నం.576, రెవెన్యూ (అసైన్మెంట్ 1) శాఖ, తేదీ 08.12.2017లోని పారా 3 లోని పాయింట్లు 1, IIIలో సవరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర మండల ప్రధాన కార్యాలయంలో జాతీయ రాజకీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు, తమ సొంత భూమి లేదా భవనం లేని పక్షంలో ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన 0.30 ఎకరాల బదులుగా గరిష్టంగా 0.50 ఎకరాల వరకు కేటాయించేందుకు అనుమతి ఇవ్వబడింది. ఈ కేటాయింపు నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది.. లీజు అద్దె 0.50 ఎకరాల భూమికి సంవత్సరానికి రూ.1,000గా నిర్ణయించబడింది.

ఆరోగ్య సంరక్షణ, విద్య పరిశోధన కేంద్రానికి భూములు
రెవెన్యూ శాఖ: విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం గ్రామీణ మండలం, యెండాడ గ్రామం సర్వే నంబర్ 14/5 లో గల ఎ.9.04 సెంట్ల ప్రభుత్వ భూమిని విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య పరిశోధన కేంద్రం స్థాపన కోసం హైదరాబాద్ లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్ చైర్మన్కు కేటాయించేం దుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమి మొత్తం 43,753,6చదరపు గజాలు, మార్కెట్ విలువ రూ.192,51,58, 400/- చెల్లించబడుతుంది. అంటే చదరపు గజానికి రూ.44,000/- (సాలాటి యం మినహాయించి) లేదా ఎకరానికి రూ.5.00 కోట్లు, ఈ కేటాయింపు ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ షరతులకు లోబడి ఉంటుంది. ఏఐజీ సంస్థ. 15 ఎకరాల స్థలం కోరినా, ప్రస్తుతం వివాదాలు లేని 9.04 ఎకరాలను ఎంపిక చేశారు. సదరు సంస్థ ఈ స్థలాన్ని తక్కువ ధరకు ఇవ్వమని కోరినా, మార్కెట్ రేటు (చదరపు గజానికి రూ.44,000) ప్రకారమే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనివల్ల ఉత్తరాంధ్రలో రీసెర్చ్, అకడమిక్ హబ్ ఏర్పాటు అవుతుంది.

జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం
అలవనరుల అభివృద్ధి శాఖ: ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-II, బట్రెన్ డ్యామ్…మెయిన్ డ్యామ్ ప్యాకేజీకి సంబంధించిన ఇతర సంబంధిత పనుల నిర్మాణంలో ఉపయోగించబడే రాతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని (అ) అందుబాటులో ఉన్న రాతి దంపిల నుంచి రాతిని వేరు చేయడం, (అ) హిల్ నంబర్ 902 నుంచి రాతి తవ్వకం ద్వారా లభించే రాతి పరిమాణానికి సంబంధించిన ఆర్థిక ప్రభావాన్ని అమోదించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ టైమ్న్, బ్యాలెన్స్ పసుల సకాలంలో పూర్తికి కట్టుబడి ఉండేందుకు ఈ అదనపు పనిని ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ M/s. MEIL, హైదరాబాద్ు ఎల్ఎస్ కాంట్రాక్ట్ 01/2019-20, 86 08-11-2019 5 5.247.12 అప్పగించడం జరిగింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సుమారు 71.63 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. గతంలో తవ్విన రాళ్లలో సగానికి పైగా పనికిరావని నిపుణులు (సీఎస్ఎంఆర్ఎస్) తేల్చారు. రాయి కొరత వల్ల ద్యామ్ ఆగిపోకూడదని, సమీపంలోని హిల్ నం. 902ని సీఎం పర్యటనలో భాగంగా గుర్తించి తవ్వకాలకు ఆదేశించారు.
– పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఈపీసీ సిస్టమ్లో లెఫ్ట్-సైద్ కనెక్టివిటీస్ కోసం పీఐపీహెచ్బ్ల్యూ- ప్యాకేజ్ నెం.66: దాదాపు 890 మీటర్ల పొడవు గల నావిగేషన్ టన్నెల్ నిర్మాణం, సాదిల్ డ్యామ్ ‘భూ’, దాని నిర్మాణంతో సహా ఆఫ్-టేక్ రెగ్యులేటర్” పని విషయంలో రూ.4,49,00,484 అదనపు ఆర్థిక పరిణామాలకుఆమోదం తెలిపింది. సైట్-స్పెసిఫిక్ పరిస్థితుల కారణంగా పరిమా ణాల పెరుగుదల కారణంగా ఈ అవసరం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో భూమి లోపల పైపులైన్లు చాలా లోతుగా ఉండటం, కొండ వాటం వల్ల తవ్వకాలు 46 మీటర్ల నుంచి 104 మీటర్ల వరకు పెరిగాయి. ఇలాంటి మార్పులు ముందే ఊహించడం సాధ్యం కాదని టెక్నికల్ కమిటీ ధృవీకరించింది. ఈ నిధులకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ కోరనున్నారు.

ఇంధన శాఖలో 900 కోట్ల రుణానికి ఆమోదం
ఇంధన శాఖ: ప్రభుత్వం జీవో 01 07.01.2026లో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ హడ్కో నుంచి రూ.900 కోట్ల ప్రత్యేక గడువు రుణం పొందేందుకు ప్రభుత్వ హామీని అందించింది. ఈ రుణం ద్వారా లభించే నిధులను బొగ్గు కొనుగోలు, విద్యుత్ కొనుగోలు, ఇతర అవసరమైన వ్యయాల కోసం, నిర్దిష్ట షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ముందస్తు రుణంగా ఇవ్వడం జరుగుతుంది. వేసవిలో బొగ్గు కొరత రాకుండా ఉండాలంటే ముందస్తుగా నిధులు అవసరం. ఈ అప్పు ద్వారా ఏపీ జెన్కో ఇతర సంస్థలకు ఆర్థిక సాయం అందుతుంది. దీనికి ప్రతిగా విద్యుత్ సంస్థలు 2% గ్యారెంటీ కమిషను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
ఇంధన శాఖ: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (సవరణ) బిల్లు, 2026ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నెం.8 ఆఫ్ 2025 అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (సవరణ) ఆర్డినెన్స్, 2025 స్థానంలోకి వస్తుంది. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టం, 1939లో అవసరమైన సవరణలు చేయడం లక్ష్యం. గతంలో ప్రభుత్వం వసూలు చేసిన సుంకంపై హైకోర్టులో వివాదం నడుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి వచ్చే ఆదా యాన్ని కాపాడుకోవడానికి ఈ చట్ట సవరణ చాలా ముఖ్యం. దీనివల్ల పాత వసూళ్లకు చట్టబద్ధత రావడమే కాకుండా భవిష్యత్తులో గందరగోళం ఉండదు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ పాల్గొన్నారు..

Previous Post

కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 29-01-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-01-2026

కార్యకర్త
@ January 29, 2026
కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్

కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి
ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-01-2026

కార్యకర్త
@ January 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకం

చైతన్యరధం
@ January 28, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

చైతన్యరధం
@ January 28, 2026
శిక్షణ తరగతుల్లో విద్యార్థిలా మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

శిక్షణ తరగతుల్లో విద్యార్థిలా మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 28, 2026
కాలంతో పాటు మారాలి
ఆంధ్రప్రదేశ్

కాలంతో పాటు మారాలి

చైతన్యరధం
@ January 28, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

చైతన్యరధం
@ January 28, 2026
కాలంతో పాటు మారాలి

కాలంతో పాటు మారాలి

చైతన్యరధం
@ January 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

చైతన్యరధం
@ January 29, 2026
కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు

కృష్ణవేణి జీవితం ఈ తరానికి మార్గదర్శకం -చంద్రబాబునాయుడు

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకం

చైతన్యరధం
@ January 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist