- సీఎంఆర్‌ఎఫ్ మంజూరు చేయించిన మంత్రి డోలా
- హామీ ఇచ్చిన మరుసటిరోజే వైద్యం కోసం ఎల్‌వోసీ
- చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
ఒంగోలు(చైతన్యరథం): గాయపడిన గురుకుల విద్యార్థికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి రూ.2 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయించారు. రెండురోజుల క్రితం వేడి పాలు మీదపడి టంగుటూరు జ్యోతి బాపూలే గురుకుల విద్యాలయ 5వ తరగతి విద్యార్థి మధుమోహన్ తీవ్రంగా గాయపడ్డా డు. ఆస్పత్రిలో విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా సీఎంఆర్‌ఎఫ్ నిధులతో వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. ఈ ఎల్‌ఓసీని విద్యార్థి తల్లిదండ్రులు శనివారం ఆసుపత్రి యాజమాన్యానికి అందజేశా రు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్యం చేయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.