అమరావతి (చైతన్యరథం): ఈ ఏడాది కడపలో అత్యంత ఘనంగా తలపెట్టిన మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ కమిటీలను మంగళవారం ప్రకటించారు. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ.. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.
పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తీర్మానాలు, మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి ఏర్పాటు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. కడప వేదికగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ‘మహానాడు’ నిర్వహించనున్న విషయం తెలిసిందే.