- ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం
- 17 నెలల కాలంలో రూ.15 వేల కోట్ల సాయం అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- ఉత్పత్తి సామర్థ్య వినియోగం 48 నుంచి 80 శాతానికి పెంపు
- దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాల ఆర్థిక సాయం
- నాడు స్టీల్స్టాప్లాంట్ నష్టాల్లో ఉన్నా పట్టించుకోని జగన్
- పైపెచ్చు భూములు అమ్మేసేందుకు కుట్రలు
- అప్పుడూ.. ఇప్పుడూ ప్లాంట్ను నిలబట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చేయూతతో ప్రైవేటైజేషన్ ప్రచారం నుంచి స్టీల్స్టాంట్ ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతోంది. నష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్లాంట్ను ఆదుకునేందుకు 17 నెలల కాలంలో కూటమి
ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయంతో అండగా నిలిచింది. విశాఖ ఉక్కును గట్టెక్కించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లు అందించింది.
రూ.3 వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేవలం 17 నెలల్లో పరిశ్రమకు రూ.15 వేల కోట్ల మేర సాయం అందింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నిరంతర సంప్రదింపులతో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ఉక్కు మంత్రితో పలు మార్లు భేటీ అయ్యి స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా సహకారం అందించేలా చేశారు. స్టీల్ ప్లాంట్ను
గట్టెక్కించడానికి 2024లో రూ.500 కోట్ల ఈక్విటీని, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సుగా రూ.1140 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఆర్థిక చేయూతతో 2024 అక్టోబరులో రెండో బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం కావటంతో ఉత్పత్తి సామర్థ్య వినియోగం 67 శాతానికి పెరిగింది. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపుల మేరకు మరో మారు రూ.9,800 కోట్ల ఈక్విటిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో తీసుకున్న రూ.1140 కోట్ల రుణాన్ని ప్రిఫరెన్సు షేర్ క్యాపిటల్గా మారుస్తూ
నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది అక్టోబరు నాటికి ప్లాంట్ సామర్థ్య వినియోగం 80 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 16,322 టన్నుల హాట్ మెటల్్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయగలుగుతోంది. 13 వేల మంది
రెగ్యులర్, 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. రాజకీయ
-సంప్రదింపులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కూటమి ప్రభుత్వం నిలువరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7.3. మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తోంది. ఎంఎస్ఎంఈలు, స్థానిక పరిశ్రమలు,
ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీలకు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. నవరత్నకంపెనీ హోదాతో 2014-15 రూ .12,958 కోట్ల నికర లాభాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది.
పట్టించుకోని జగన్.. పట్టు వీడని చంద్రబాబు
ఆ తరువాత 2019-24 మధ్య విశాఖ స్టీల్స్టాంట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నాడు ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ నిర్వహణకే పరిమితం అయింది. నష్టాల కారణంగా నాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా కుదించాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్నా గత వైసీపీ పాలకులు కనీసం స్పందించలేదు. పైపెచ్చు ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నించారు. స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేసి, రాష్ట్ర వాటాకు వచ్చే స్థలంలో రాజధాని పెడితే బావుంటుందనే కపట బుద్ధితో నాడు దాని మీద కన్నేసిన జగన్ రెడ్డి ఏ రోజూ ప్లాంట్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. 2024లో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తోనే కర్మాగారం నడవాల్సిన దుస్థితికి వచ్చింది. అప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. ఉక్కు కార్మికుల గుండెల్లో భయం మొదలై నిరసనలు మొదలెట్టారు. తరువాత 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యారు. 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. తెల్లవారు జామున రెండున్నర గంటలకు దేశమంతా నిద్రలో ఉన్న వేళ దేశ రాజధానిలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని వెంటబెట్టుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లి, పరిస్థితిని అత్యవసరంగా సీఎం చంద్రబాబు నివేదించారు. అంతకు ముందు 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిశారు. ఆ అర్ధరాత్రి దాటాక చర్చలు ముగిసిన అనంతరం, తెల్లవారుజామున 3 గంటలకు ఆర్థిక శాఖ స్వయంగా ట్వీట్ చేసింది. ఆ సమావేశం ఫలితంగానే, విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రం కాపాడేందుకు రూ.10,300 కోట్ల ఈక్విటీ, రూ.1,140 కోట్ల రుణ సహాయంతో ముందుకు వచ్చింది.
వాస్తవాలు దాచేసి విషప్రచారం
25 ఏళ్ల క్రితమే కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2800కోట్లు సాయం తీసుకొచ్చి నాడు సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ను ఆదుకున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కట్టుబడిన సీఎం చంద్రబాబు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో వాస్తవాలు దాచిపెట్టి… కూటమి ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయి. కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూటమి పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ బలోపేతమవుతోంది. ఇకపై మరింత ప్రగతి సాధిస్తుంది.
కేంద్ర, రాష్ట్రాల మద్దతు తాత్కాలిక ఊరట మాత్రమే. ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పట్టాలంటే, ఆ పోరాట స్ఫూర్తిని, సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రతి ఉద్యోగి కష్టపడాలి. గతంలో ఎప్పుడైతే ప్లాంట్ రేటెడ్ కెపాసిటీకి మించి పని చేసిందో, అప్పుడే లాభాలు గడించింది. కేంద్రం ఇచ్చిన నిధులతో వినియోగ సామర్థ్యాన్ని 80 శాతానికి పెంచగలిగారు. ఈ లక్ష్యాన్ని 100%కి చేరుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమించడం అత్యవసరం. దీర్ఘకాలికంగా నిలబడాలంటే, ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వాలు వేల కోట్లు ఇచ్చినా, ఖర్చులపై కళ్లెం లేకపోతే, ఈ నిధులు పాత అప్పులు తీర్చడానికే, వడ్డీలకే సరిపోతాయి. ఏదైనా ఓ సంస్థ నిలబడాలంటే.. కష్ట పడాల్సింది ఉద్యోగులే. ఎవరి స్థాయిలో వారు తమ పనిని మనసు పెట్టి చేస్తే సంస్థ నిలబడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కార్మికులు, ఉద్యోగులు ఉద్యమం చేసినప్పుడు ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ ఇలా వేల కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థలో పోసి కాపాడు కుంటూంటే.. ఉద్యోగులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఎవరూ మద్దతివ్వరు.











