కర్మయోగి అమలులో టాప్ 5లో ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులకు డిజిటల్ శిక్షణలో పురోగతి
విజన్ 2047 నిర్మాణంలో మార్గదర్శకం
అమరావతి(చైతన్యరథం): ఐజీవోటీ కర్మయోగి అమలులో ఏపీఎస్‌డీపీఎస్ నేతృత్వం లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య అభివృద్ధి కి డిజిటల్ శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఐజీవోటీ కర్మయోగి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్ డీపీఎస్) సమన్వయంతో వేగంగా అమలుచేస్తోంది. ప్రజలతో మమేకమై ఆధునిక పాలనను లక్ష్యంగా పెట్టుకుని ముందుకుసాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 16న ఏపీ ప్రభుత్వం, కెపాసిటీ బిల్డింగ్ మిషన్, కర్మయోగి భారత్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనిద్వారా ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగులు డిజిట ల్ ప్లాట్‌ఫాంలో శిక్షణ పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 6న కేబినెట్ ఆమోదించిన సామర్థ్య అభివృద్ధి, నాలెల్డ్ సొసైటీ పాలసీ.. అనంతరం ఫిబ్రవరి 18న జారీ అయిన జీవో 2 ద్వారా కార్యరూపం దాల్చింది. 2025 ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రస్థాయిలో నమోదైన వారు 8,55,799 మంది, కోర్సులకు నమోదైన వారు 6,36,719 మంది, కోర్సులు పూర్తిచేసిన వారు 3,69,844 మంది. ఈ గణాంకాలతో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచింది. కర్మయోగి ద్వారా ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఫంక్షనల్ కాంపిటెన్సీలకు అనుగుణంగా శిక్షణ అందుతోంది. ఇది ప్రభుత్వ సేవల నాణ్యత, ప్రజలతో పరస్పర చర్యను మెరుగుపరు స్తోంది. ఏపీఎస్ డీపీఎస్ పర్యవేక్షణలో గట్టి మానిటరింగ్, విభాగాల మధ్య సమన్వయం, జిల్లాస్థాయి చొర వతో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యాచరణ స్వర్ణాంధ్ర విజన్ 2047 కు అనుగుణంగా ఉంది. ఏపీ ప్రభుత్వం సామర్థ్య వంతమైన, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకున్న పాలనా వ్యవస్థను నిర్మించడంలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.