- కేంద్ర పథకం సాస్కి కింద నిధుల విడుదల
- రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి దిశగా అడుగులు
- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి(చైతన్యరథం): పర్యాటకాంధ్రప్రదేశ్కు బాటలు వేస్తూ అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా రూ.113.751 కోట్ల నిధులు విడుదలయ్యాయని రాష్ట్ర పర్యాట క, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ వెల్లడిరచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం 2024 -25 ద్వారా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రం సాస్కి స్కీం ద్వారా తొలి విడతగా 66 శాతం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల్లో 75 శాతం వినియోగించాక మిగతా 34 శాతం విడుదల చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్న టు వివరించారు. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్)లను కేంద్రానికి సమర్పించామని గుర్తుచేశారు. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని సెప్టెం బర్లో బెంగుళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో ఇచ్చిన హామీని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిలుపుకున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.