చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

సంక్షోభాలకు ఎదురొడ్డి పోరాడే దమ్ము మాకుంది!

తాటిపాక బహిరంగ సభలో యువనేత లోకేష్‌

by చైతన్యరధం
Nov 28, 2023 at 2:55pm
in ముఖ్య వార్తలు
సంక్షోభాలకు ఎదురొడ్డి పోరాడే దమ్ము మాకుంది!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పిచ్చోడు 3నెలల్లో పర్మినెంట్‌గా జైలుకి పోవడం ఖాయం
  • యుద్ధం మొదలైంది… సైకో జగన్‌కి ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌
  • టీడీపీ కార్యక్రమాలను ఆపడానికే తప్పుడు కేసులు
  • రాజోలును అవినీతికి అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే రాపాక

రాజోలు: సంక్షోభాలు, పోరాటాలు టీడీపీ కి కొత్త కాదు, ఎన్టీఆర్‌ దగ్గర నుండి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కున్నారు, కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము టీడీపీకి ఉంది, భయం మన బయో డేటాలో లేదు, యుద్ధం మొదలైంది… సైకో జగన్‌కి ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని యువనేత నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్‌లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగసభలో యువనేత నారాలోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… సైకో మా కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణిపై కూడా కేసులు పెడ తాం, అరెస్ట్‌ చేస్తామని మంత్రులు మాట్లాడారు. ఆ మంత్రులకు భయం పరిచయం చేసే బాధ్యత నాది. సైకోల బెదిరింపులకు, ఉడత ఊపులకు మేము భయ పడలేదు. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి పోవడం ఖాయమని లోకేష్‌ అన్నారు.

రూ. 43వేల కోట్లు మింగిన వాడిని ఏం చేయాలి?
ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, రూ.43వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న పిచ్చోడిని ఏం చెయ్యాలి. ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియా డాన్‌గా మారిన పిచ్చోడు మూడు నెలల్లో పర్మినెంట్‌గా జైలుకి పోవడం ఖాయం. ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు, మంత్రులు ఎక్కడికి పోతారు, రేపు అవినీతికి పాల్పడిన టోటల్‌ వైసీపీ ఇన్‌ జైల్‌. జైలర్‌ ఎవరో తెలుసా… చంద్రబాబు. మీ తాట తీస్తారు.ఇది ఖాయం రాసిపెట్టుకోండని లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

అతనే.. జెండా అజెండా!

విశాఖను ఐటీి రాజధానిగా అభివృద్ధి చేస్తాం!

అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం

రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయింది!
రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయింది… అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 80 ఏళ్ల కార్యకర్త కూడా బెదిరింపులకు భయపడకుం డా తొడకొట్టి సవాల్‌ చేస్తారు. దట్‌ ఈజ్‌ టీడీపీ పవర్‌. మూడు నెలలు ఓపిక పట్టండి. టీడీపీ కార్యకర్తల్ని వేధించిన వైసీపీ వారికి వడ్డీ తో సహా చెల్లిస్తా. రాజోలు లో ఉన్నా రష్యా పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తా. సైకో పాలన పోతుంది… సైకిల్‌ పాలన వస్తుందని లోకేష్‌ అన్నారు.

చలికాలంలోనూ ఫ్యాన్‌కు ఉక్కపోత
చలికాలంలో కూడా ఫ్యాన్‌కి ఉక్కపోత మొదలైంది. మూడు నెలల్లో ఫ్యాన్‌ మాడిపోవడం ఖాయం. సైకో పనైపోయింది. ఆ విషయం అతనికి అర్థం అయింది. ఈ మధ్య కాలంలో దాదాపు పది కార్యక్రమాలు ప్రారంభించాడు. దేనికీ ప్రజల నుండి స్పందన లేదు. గడప గడప కి వైసీపీ అని బయలుదేరితే ప్రజలు ఉతికి ఆరేశారు. సైకో మా నమ్మకం అని కార్యక్రమం మొదలు పెడితే మా కొద్దీ సైకో అన్నారు. సైకో మా భవిష్యత్తు అంటూ స్టిక్కర్లు అంటిస్తే.. పీకి డ్రైనేజీ లో పడేశారు. సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సు మంది.. పిచ్చోడి హయాంలో జరిగిన సామాజిక అన్యాయం గురించి బీసీ, ఎస్సీ, ఎస్టీలు నిలదీశారు. ఇప్పుడు ఇంకో కొత్త కార్యక్రమం వై ఏపీ నీడ్స్‌ సైకో అని మొదలు పెడితే.. ప్రజలు వియ్‌ హేట్‌ సైకో అంటున్నారని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చినందుకు సారీ!
ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతు న్నాను. మీరంతా నన్ను పెద్ద మనస్సుతో క్షమించాలి. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్‌ ఇచ్చినం దుకు మీరు నన్ను క్షమించాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనవరి 27న నేను యువగళం పాదయా త్ర ప్రారంభించాను. 400 రోజులు 4000 వేల కిలో మీటర్లు పాదయాత్ర చెయ్యాలని నిర్ణయించుకొని కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించాను. యువ గళానికి బ్రేకులు లేవు, వీక్లీ ఆఫ్‌ లేదు, శనివారం, ఆదివారం లేదు. 209 రోజుల పాటు ప్రజల్లో ఉన్నా. 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2853 కిలో మీటర్లు పాదయాత్ర చేసానని లోకేష్‌ చెప్పారు.

వైసీపీ నేతల దోపిడీని బయటపెట్టా!
రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్‌, భవన నిర్మాణ కార్మికులు, న్యాయవాదులు, రవాణా రంగ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, ఆర్‌ఎంపీలతో అనేక ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నాను. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చాను. ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చాను. వైసీపీ నాయకుల అవినీతిని బయటపెట్టాను. ఒక్క ఛాన్స్‌ పేరుతో జగన్‌ చేస్తున్న దోపిడీ బయటపెట్టాననని లోకేష్‌ అన్నారు.

యాత్రను అడ్డుకునేందుకు కుట్రలు…
యువగళం ప్రజాగళంగా మారింది. నేను పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుండే సైకో జగన్‌ అడ్డుకోవడానికి స్కెచ్‌ లు వేశాడు. పోలీసుల్ని పంపాడు, పిల్ల సైకోలను పంపాడు. అయినా మనం తగ్గేదే లేదు అన్నాం. నా మైక్‌ లాక్కున్నారు …అన్న ఎన్టీఆర్‌ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదు. ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర. వాలంటీర్ల మీద కేసులు పెట్టాడు, నాయకుల మీద కేసులు పెట్టాడు, నా మీద కేసులు పెట్టాడు. అయినా యువగళం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబుని అరెస్ట్‌ చేసి యువగళం పాదయాత్ర ఆపాడు ఈ సైకో జగన్‌ అని లోకేష్‌ మండిపడ్డారు.

చంద్రబాబును చూస్తే సైకోకి భయం…
చంద్రబాబుని చూస్తే సైకోకి భయం. అందుకే అక్రమంగా అరెస్ట్‌ చేశాడు. సొంత అమ్మని చూసినా, సొంత చెల్లిని చూసినా సైకో జగన్‌ కి భయమే. సైకో అని ఎందుకు అంటున్నానో మీ అందరికీ స్పష్టంగా తెలియాలి. చంద్రబాబుపై ఎన్ని అక్రమ కేసులు పెట్టాడో మీరే చూసారు. స్కిల్‌ డెవెలప్మెంట్‌ కేసు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, ఇసుక కేసు, లిక్కర్‌ కేసు… త్వరలో అన్న క్యాంటిన్‌ కేసు అంట. పేదలకు ఉచితంగా అన్నం పెట్టడం వలన రాష్ట్ర ఖజానా కి నష్టం వచ్చింది అని కేసు పెడతాడట. రాబోయే ఎన్నికల్లో సైకో ఓడిపోయిన తరువాత ఎక్కడ ఉంటాడని ప్రజలను అడుగుతూ లోకేష్‌ వ్యంగ్యంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. 1) హైదరాబాద్‌ ప్యాలస్‌ 2) బెంగళూరు ప్యాలస్‌ 3) తాడేపల్లి ప్యాలస్‌ 4) లండన్‌ పిచ్చాసుపత్రి.

స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమూ చూపలేదు…
స్కిల్‌ కేసు లో ముందు రూ. 3 వేల కోట్ల అవినీతి అన్నారు, ఆ తరువాత తూచ్‌ 370 కోట్లే అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అవి కూడా పార్టీ అకౌంట్‌ లోకి వచ్చాయి అంటున్నారు. మూర్ఖుల్లారా.. అవి మా కార్యకర్తలు సభ్యత్వం కోసం చెల్లించిన రుసుము. 52 రోజులు చంద్రబాబుని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేసారు. ఒక్క ఆధారం అయినా చూపించారా? ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు రుజువు చెయ్యగలిగారా? వ్యవస్థల్ని మ్యానేజ్‌ చేసి చంద్రబాబుని 52 రోజులు జైల్లో పెట్టి సైకో జగన్‌ ఆనందం పొందాడు. హైకోర్టు లో నిజం గెలిచింది. బెయిల్‌ ఇస్తూ ఇచ్చిన ఆర్డర్‌ కాపీ చదివిన ఎవరికైనా జగన్‌ వ్యవస్థల్ని ఎలా నాశనం చేసాడో అర్థమయింది. నా పై కూడా అనేక కేసులు పెట్టారు, సీఐడీ విచారణకు పిలిచారు. ధైర్యంగా వెళ్లాను. ఎం పీక్కుంటారో పీక్కోమని చెప్పాను. తప్పు చేస్తే చంద్రబాబే నన్ను వదిలిపెట్టరని లోకేష్‌ స్పష్టం చేశారు.

కార్యక్రమాలు ఆపేందుకే తప్పుడు కేసులు…
దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై సైకోలు దాడి చేసారు, మన రాముడు చంద్రబాబు ఇంటిపై దాడి చేసారు, మన నాయకుల్ని, కార్యకర్తల్ని చంపాడు, కేసులు పెట్టాడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. అయినా మన పోరాటం ఆగలేదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా ఓర్చుకున్నాం. ఒక పక్క నా యువగళం, మరోపక్క చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారంటీ, మరో పక్క పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర తో సైకో భయంతో వణికిపోయాడు. ఈ మూడు కార్యక్రమాలు ఆపాలనే అక్రమ కేసులు పెట్టాడని లోకేష్‌ విమర్శించారు.

అండగా నిలచిన వారికి ధన్యవాదాలు…
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో ఆయన గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. 53 రోజుల పాటు ప్రజా పోరాటం జరిగింది. గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉద్యమాలు జరిగాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, దేశవ్యాప్తంగా అనేకమంది నేతలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు కుటుంబం, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రజల్ని ప్రేమించారు. ఆయనకి ప్రజలు అండగా నిలబడటమే కాకుండా ఆయన చేసిన గొప్ప పనులు ఇప్పటి యువతకు తెలిసేలా చేసారు. ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నిజాన్ని గెలిపించిన అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాకని లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

పేదలు, దోపిడీదారులకు మధ్య యుద్ధం…
పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని సైకో అంటాడు. ఇప్పుడు జరుగుతున్నది పేదలకు, దోపిడీ దారులకు మధ్య యుద్ధం. దోపిడీదారు రూ. 450 కోట్లతో విశాఖపట్నం లో రుషికొండ కి గుండు కొట్టేసి మరీ ప్యాలస్‌ కట్టుకున్నాడు. ఊరికో ప్యాలెస్‌ ఉంది. ఏది రూ. 500 కోట్లకు తక్కువ లేదు ఈయన పేదవాడు అంట. ఈ దోపిడీదారు పేదలకు కట్టిన ఇళ్లు ఎన్నో తెలుసా పూర్తి అవ్వనివి కూడా లెక్కేస్తే 450 కూడా ఉండవు. ఈ దోపిడీదారు పేదలకు కట్టే ఇళ్లు చిన్నపిల్లాడు చిటికిన వేలితో తోస్తే పడిపోతాయని లోకేష్‌ విమర్శించారు.

పిచ్చోడి పాలనలో సామాజిక అన్యాయం…
పిచ్చోడి పాలనలో జరిగిన సామాజిక అన్యాయం గురించి తలచుకుంటే బాధేస్తుంది. అమర్నాథ్‌ గౌడ్‌ లాంటి బీసీ బిడ్డలను ఎంత కిరాతకంగా చంపారో గుర్తుపెట్టుకోండి. డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అచ్చెన్న, డాక్టర్‌ అనితా రాణి, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం, వర ప్రసాద్‌, చీరాల లో కిరణ్‌, చిత్తూరు లో ఓం ప్రతాప్‌, ఇప్పుడు కొవ్వూరు లో మహేంద్ర ఎంత మంది ఎస్సీ బిడ్డల ప్రాణాలు తీశాడో గుర్తుపెట్టుకోండి. అబ్దుల్‌ సలాం, మిస్బా, హాజీరా బీ.. ఎంత మంది మైనార్టీ బిడ్డల ప్రాణాలు తీసాడో గుర్తుపెట్టుకోవాలని లోకేష్‌ అన్నారు.

కటింగ్‌ అండ్‌ ఫిటింగ్‌ మాస్టర్‌ జగన్‌…
జగన్‌ కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌. ఫిట్టింగ్‌ ఎలా ఉంటుందో చెబుతా. జగన్‌కి రెండు బటన్స్‌ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్‌. రెండోవది రెడ్‌ బటన్‌. బ్లూ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌లో 10 రూపాయలు పడుతుంది. రెడ్‌ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్‌ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు.. ఆర్టీసీ బస్‌ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు.. ఇంటి పన్ను బాదుడే బాదుడు.. చెత్త పన్ను బాదుడే బాదుడు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు.. నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్‌ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్‌ కట్టింగ్‌ మాస్టర్‌. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటీన్‌ కట్‌, పండుగ కానుక కట్‌, పెళ్లి కానుక కట్‌, చంద్రన్న బీమా కట్‌, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కట్‌, ఫీజు రీయింబర్స్మెంట్‌ కట్‌, 6 లక్షల పెన్షన్లు కట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్‌ అని లోకేష్‌ అన్నారు.

మహిళలకు జగన్‌ నమ్మకద్రోహం…
జగన్‌ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్‌ అన్నాడు. పెన్షన్‌ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ. 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2 వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి మహాశక్తి ప్రకటించారని లోకేష్‌ వివరించారు. మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి: 18 ఏళ్లు నిండిన మహిళలకు ` నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

యువత భవితను దెబ్బతీసిన జగన్‌…
యువత భవిష్యత్తు పై జగన్‌ దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్‌ కోరుకుంటున్నాడు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్‌2 లేదు, డీఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బీసీ స్టడీ సర్కిల్స్‌ మూసేసాడు. జీఓ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం. పెండిరగ్‌ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తామని లోకేష్‌ వెల్లడిరచారు.

మోటార్లు బిగిస్తే పగులగొట్టండి!
జగన్‌ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్‌ పాలన లో క్రాప్‌ హాలిడే, అక్వా హాలిడే చూస్తున్నాం. జగన్‌ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్‌ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని లోకేష్‌ చెప్పారు.

ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తాం…
జగన్‌ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్‌ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జీపీఎస్‌ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్‌ లీవులు, 8 టీఏ, డీఏలు పెండిరగ్‌ పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్‌ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్‌ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్‌ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్‌ కూడా కోతపెట్టాడు జగన్‌. 15 శాతం అలవెన్స్‌ కట్‌ చేసాడు. ఎస్‌ఐకి 10 వేలు, హెడ్‌ కానిస్టేబుల్‌ కి 8 వేలు, కానిస్టేబుల్‌ కి 6 వేలు కట్‌ చేసాడు. జగన్‌ తెచ్చిన జీఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్‌ యథాతథంగా ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం…
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు. నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు మాత్రం బీసీలకు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు జగన్‌ రద్దు చేసాడు. ఇదేనా జగన్‌ దళితులకు ఇచ్చే గౌరవం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

తూర్పుగోదావరి అంటే నాకు ఇష్టం…
తూర్పుగోదావరి జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఈ పచ్చదనం, గోదావరి చూసి ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చూపించే మమకారం, వెటకారం రెండూ సూపర్‌. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి రాజోలు. ప్రముఖ పర్యాటక కేంద్రం రాజోలు. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ , బయ్యా సూర్య నారాయణ మూర్తి, పట్టి కామమ్మ లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డ రాజోలు అని లోకేష్‌ కొనియాడారు.

జగన్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఎన్నికల ముందు రాజోలు నియోజకవర్గానికి జగన్‌ అనేక హామీలు ఇచ్చాడు. ఎన్నికల ముందు సఖినేటిపల్లి ` నరసాపురం మధ్య గోదావరిపై వంతెన నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి… పదవీ కాలం ముగుస్తున్నా ఆ వంతెన పనులు మొదలు పెట్టలేదు. వరద సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఏటిగట్లను పటిష్ట పరుస్తానని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. రాజోలు శివారు మేకలపాలెంలో వరదల సమయంలో 180 కుటుంబాలవారికి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తామని జగన్‌ హామీ ఇవ్వగా, ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదు. నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేసిన దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఆలయ అభివృద్ధి కోసం రూ. 14 కోట్లు కేటాయిస్తానని జగన్‌ 2021లో ప్రకటించగా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని లోకేష్‌ విమర్శించారు.

రాజోలును అవినీతి అడ్డాగా మార్చిన రాపాక!
ఇక్కడ జనసేన శాసనసభ్యుడిగా ఎన్నికైన రాపాక వరప్రసాద్‌ వెన్నుపోటు పొడిచి వైసీపీ లో చేసి రాజోలు ని అవినీతికి అడ్డాగా మార్చేసారు. మలికిపురం మండలం కత్తిమండలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సుమారు రూ.2 కోట్లతో అధునాతన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి రోడ్డుకోసం రూ.20 లక్షల ఎంపీ లాడ్స్‌ నిధులు వినియోగించారు. చింతలమోరి సముద్రతీరంలో పేదలకు చెందిన 15 ఎకరాలకు పైగా భూములను ఆక్రమించారు. గతంలో దిండి ఇసుక రీచ్‌ ను ఎమ్మెల్యే కుమారుడు వెంకట్రావు నిర్వహించారు. అంతర్వేది నుండి కరవాక వరకు సుమారు 10 గ్రామాలలో ఎంతో విలువైన ఖనిజ సంపదను ఇసుక రాంపుల ద్వారా అధికారపార్టీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు. అంగన్‌ వాడీ, విద్యుత్‌ శాఖలో ఆపరేటర్‌ పోస్టులకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని లోకేష్‌ ధ్వజమెత్తారు.

సొసైటీల భూములు కొట్టేసేందుకు కుట్ర…
రాజోలు నియోజకవర్గ పరిధిలో సముద్రతీర ప్రాంతంలో 22 చదరపు కి.మీ.ల పరిధిలో నిరుపేద దళితులు, మత్స్యకారులకు చెందిన భూములను ఏవీఆర్‌ ఆయిల్స్‌ పేరిట కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేసనపల్లి, బట్టేలంక ప్రాంతంలో ఎస్సీ సొసైటీ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడి దళితులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు, ప్యాలస్‌ బ్రోకర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అత్యంత విలువైన తీర ప్రాంత భూములను కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సెంటు పట్టాల పేరుతో దోపిడీ…
సెంటు పట్టా పేరుతో పేదలకు ఇచ్చిన ఉచిత ఇంటి స్థలాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. పట్టాలు ఇచ్చిన భూములను అంతకుముందు తక్కువ రేటుకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి మూడు రెట్లు అధికంగా అమ్మి వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ స్థలాలు నదీ పరివాహక ప్రాంతం, చెరువులు, శ్మశానాలు, పల్లపు ప్రాంతాల్లో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకుని పరిస్థితి లేదు. దాతలు ఇచ్చిన స్థలంలో దశాబ్ధాల క్రితం ఏర్పాటుచేసిన మల్కిపురం కళాశాల భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడిరది. కళాశాలలో ఉన్న లెక్చరర్లను ఒక్కొక్కరిగా బదిలీ చేసి మూసివేతకు ప్రయత్నిస్తున్నారు. మల్కిపురం కళాశాల ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం సుమారు రూ. 500 కోట్లవరకు ఉందని లోకేష్‌ అన్నారు.

కొబ్బరి రైతులను ఆదుకుంటాం!
తూర్పుగోదావరి జిల్లా లో వరి, ఆక్వా, కొబ్బరి రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి ఖర్చు తగ్గించి గిట్టుబాటు ధర వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. సముద్రం ముందుకు వచ్చి, పచ్చటి కొబ్బరి చెట్లు ఉప్పు నీటి ప్రవాహం కారణంగా వందలాది ఎకరాలలో కొబ్బరి చెట్లు సర్వనాశనమవు తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొబ్బరి రైతులను ఆదుకుంటాం. గోదావరి నది చెంతనే ఉన్నా రాజోలు నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలకు రక్షిత నీరు అందడం లేదు. టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే సురక్షిత తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కాలువల్లో గుర్రపు డెక్క ఎక్కువగా ఉండటం వలన రైతులకు ప్రధాన సమస్యగా ఉంది. పంట కాలువలు శుభ్రం చేయిస్తాం.

ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్‌…
నియోజకవర్గంలో ప్రధానంగా ఆక్వా రైతుల చెరువులకు ఇస్తున్న కరెంట్‌ చార్జీలు విపరీతంగా పెంచటం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్‌, జోన్లతో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ ను అందిస్తాం. రాజోలు ఏరియా హాస్పిటల్‌ లో డాక్టర్లు, సరైన వైద్య సదుపాయాలు లేక ఇక్కడ ప్రజలు అమలాపురం గానీ, కాకినాడ గానీ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా పేదలకు వైద్యం అందే పరిస్థితులు లేవని లోకేష్‌ అన్నారు.

ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం…
గత తెలుగుదేశ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసారు. నియోకజకవర్గానికి రక్షిత నీరు అందించేందుకు రూ.100 కోట్ల తో మంచినీటి పథకాన్ని మంజూరు చేయించారు. వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని మూలనబెట్టింది. భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేసి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

డ్రైనేజి వ్యవస్థను ఆధునీకరిస్తాం…
నియోజకవర్గంలో డ్రైనేజి వ్యవస్థను ఆధునీకరించి రైతుల కష్టాలను తొలగిస్తాం. నియోజకవర్గంలో 3 మండలాలకు సంబంధించిన రైతులకు ప్రధాన సమస్యగా ఉన్న శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ 14 కి.మీ.ల మేర డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహించాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు చేపట్టి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. రాజోలు ఏరియా హాస్పిటల్‌ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, డాక్టర్లను నియమించి స్థానిక ప్రజలకు ఇక్కడే వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్‌ చెప్పారు.

5 గురు మంత్రులయ్యారు… ఏం లాభం?
తూర్పుగోదావరి జిల్లా నుండి ఐదుగురు మంత్రులు అయ్యారు. కానీ జిల్లాకి చేసింది సున్నా. ఒక మంత్రి పేషీలో జీతాలు ఇవ్వలేదని పేషీకి తాళం వేసారు. ఇంకో మంత్రి ఖజానా కు కన్నం వేస్తే ఉద్యోగం పోయింది. మిగిలిన వాళ్లకు అసలు వారి శాఖ ఏంటో కూడా తెలియదు. తూర్పుగోదావరి జిల్లా లో జగన్‌ గుంతల పధకం తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తారు రోడ్డు కాకుండా మేజర్‌ రోడ్లను సిమెంట్‌ రోడ్లుగా మారుస్తాం. మత్స్యకారులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దు చేసాడు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మత్స్యకారులను ఆదుకుంటామని లోకేష్‌ అన్నారు.

Tags: అవినీతి చక్రవర్తి జగన్‌నారా లోకేష్ యువగళంరాజోలు
Previous Post

సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా జగన్ రెడ్డి? – కింజరాపు అచ్చెన్నాయుడు..

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2023

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..
ఆంధ్రప్రదేశ్

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
ప్రధాని పర్యటనకు సర్వ సన్నద్ధం: పల్లా
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ, పార్లమెంట్‌ స్థాయి మహానాడులను ఘనంగా నిర్వహించాలి

చైతన్యరధం
@ May 17, 2025
రికార్డు బద్దలుకొడదాం!
ఆంధ్రప్రదేశ్

ధర తగ్గకూడదు..కొనుగోళ్లు ఆగకూడదు..

చైతన్యరధం
@ May 17, 2025
రికార్డు బద్దలుకొడదాం!
ఆంధ్రప్రదేశ్

రికార్డు బద్దలుకొడదాం!

చైతన్యరధం
@ May 17, 2025
మేరా భారత్‌ మహాన్‌
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్‌ సిందూర్‌కు శాల్యూట్‌

చైతన్యరధం
@ May 17, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist