చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల భూకబ్జాలకు అధికారుల అండ

వైసీపీలో చేరలేదని ఇంటికి వెళ్లే దారి మూసేశారు

by చైతన్యరధం
Oct 25, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలీసులు తొత్తులుగా మారి సహకరించారు
  • బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి వేధించారు
  • న్యాయం చేయాలని ప్రజావేదికకు అర్జీదారులు
  • పెద్దిరెడ్డి అండతో భూములు కొట్టేసిన కజిన్‌ బ్రదర్‌
  • దివ్యాంగుల స్థలాలు కొట్టేసి వ్యభిచారం నిర్వహణ
  • వైసీపీలో చేరలేదని ఇంటికి వెళ్లే దారి మూసేశారు

మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో వైసీపీ నేతల భూకబ్జాలపై ప్రజావేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారి భూకబ్జాలకు అధికారులు, పోలీసులు అండగా నిలిచి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన వైనంపై న్యాయం చేయాలని నేతలకు ప్రజావేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుండగా కేసులు పెట్టినా నాడు పోలీసులు పట్టించుకోకపోగా తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించి వేధించారని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన దివ్యాం గుల ఇంటి స్థలాలను ఇప్పించి తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మంత్రి టీజీ భరత్‌, ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్‌, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబులు అర్జీలు స్వీకరించారు.
` గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి కజిన్‌ బ్రదర్‌ అయిన పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి అక్రమంగా తమ భూములను ఆక్రమించుకున్నారని..తహసీల్దార్‌, వీఆర్వోలు వారికి సహక రించారని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన కె.చోలేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి తమ భూమిని ఇప్పించాలని, అక్రమార్కులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని భూ కబ్జా చేసిన పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తాను టీడీపీ కార్యకర్తను కావడంతో వైసీపీలో చేరమంటే చేరలేదన్న కక్షతో తన ఇంటి కి వెళ్లే దారిని రెండు వైపులా మూసివేశారని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం ఇందిరానగర్‌కు చెందిన నూతలపాటి జయచంద్రనాయుడు ఫిర్యాదు చేశారు. అప్పటి అధికారులు కూడా వైసీపీ నేతలకే కొమ్ము కాశారని..దారికి అడ్డంగా ఉన్న గోడలను తొల గించి దారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` తన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూశారని..కోర్టుకు వెళుతుంటే దాడి చేశారని సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం చంద్రగిరికి చెందిన జి.మధు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే సీఐ శ్రీహరి వైసీపీ నేతలకు తొత్తుగా వ్యవహ రించి ఫిర్యాదును మార్చి రాసి బలవంతంగా తన చేత సంతకాలు చేయించారని వివరించారు. మరుసటిరోజు ఇచ్చిన ఫిర్యాదును వాపస్‌ తీసుకోవాలని సీఐ, ఎస్‌ఐ హరూన్‌బాషాలు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి వైసీపీ నేతలకు అనుకూలంగా అగ్రిమెంట్‌ తయారు చేయించి కోటిన్నర ఇవ్వాలంటూ బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని వివరించారు. తన ఇంటికి వచ్చి రూ.7 లక్షల నగదు, రూ.31 లక్షల ప్రామిసరీ నోట్స్‌ తీసుకెళ్లారని.. దీనిపై నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని నాడు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొల గించి తన భూమిని కబ్జా చేయాలని చూసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో తమ భూమని అక్రమంగా వీఆర్వో మరొకరి పేరు మీదకు మార్చారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామానికి చెందిన చలిచీమ శంకరావు తెలిపారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా తనకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకుని తనకు తన భూమిని ఇప్పించాలని వేడుకున్నారు.
` జడ చక్రి, కె.మహేష్‌ అను వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా తమ ఇంటిని కూల్చడమే కాకుండా రౌడీలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తిరుపతి మండలం తిరుపతికి చెందిన కె.సి.సునీత ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. వాళ్లకు అడ్డు వెళితే తలలు తీసేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణ రక్షణ కల్పించి బెదిరింపులకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
` నెల్లూరు జిల్లా కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించి మూసివేతతో రోడ్డునపడ్డ దాదాపు 230 మంది కార్మికులు గ్రీవెన్స్‌లో తమ గోడు చెప్పుకున్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేతతో తామంతా రోడ్డున పడ్డామని.. 2019లో జగన్‌ రెడ్డికి తమ గోడు చెప్పుకోగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. తమను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
` తనను మోసం చేసి పెళ్లి చేసుకుని కాపురానికి పనికిరాని భర్త నుంచి విడాకులు అడుగుతుంటే తనను, తన తల్లిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వారి నుంచి కాపాడి విడాకులు ఇప్పించాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంకు చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చింది.
` వినుకొండ మండలం గోకనకొండలో ఉన్న తన భూమిని వైసీపీ నేతలు ఆక్రమిం చుకున్నారని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన వెంకటరామయ్య ఫిర్యాదు చేశారు. భూ కబ్జాపై రెవెన్యూ అధికారులను, పోలీసులను ఆదేశించి తమ భూములు ఇప్పించాలని వేడుకున్నారు.
` ఇంటికి కాంపౌండ్‌ గోడ కట్టుకోవడానికని లక్ష రూపాయలు పెట్టి తెచ్చుకున్న రాళ్లను దొంగిలించారని, ఇంటి పరిసరాల్లో పెరుగుతున్న చెట్లను నరికేసి తీసుకెళ్లారని కడప జిల్లా చెన్నూరు మండలం గుర్రంపాడు గ్రామానికి చెందిన మర్రి అరుణాదేవి ఫిర్యాదు చేసింది. దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరింది.
` ప్రకాశం జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీకి చెందిన రిటైర్డ్‌, వీఆర్‌ఎస్‌ ఉద్యోగులు తమ సమస్యను వివరిస్తూ తమకు వివిధ పద్దుల కింద కంపెనీ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉందని, డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

Previous Post

లోకేష్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా జగన్‌రెడ్డీ?

Next Post

దూసుకుపోతున్న ఏపీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-02-2026

కార్యకర్త
@ February 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026

కార్యకర్త
@ February 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

కార్యకర్త
@ February 5, 2026
మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు
ఆంధ్రప్రదేశ్

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
Load More

ముఖ్య వార్తలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

చైతన్యరధం
@ February 4, 2026
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

చైతన్యరధం
@ February 4, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist